
న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్‌డీ తివారీ (91) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయనకు ఢిల్లీలోని సిటీస్ మాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గత నెల 26న తీవ్రజ్వరం, న్యూమోనియా రావడంతో కుటుంబసభ్యులు తివారీని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తివారీ ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లకు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. తివారీ ఆరోగ్యస్థితిపై ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్, మాజీ ఉత్తరాఖండ్ సీఎం విజయ్ బహుగుణ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment