
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆర్మీ ఆస్పత్రి అధికారులు సోమవారం వెల్లడించారు. ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య నిపుణుల బృందం నిశితంగా పరిశీలించిందని పేర్కొన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ ప్రణబ్ శరీరం వైద్యం అందించడానికి సహకరిస్తూ స్థిరంగా ఉందని తెలిపారు. ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలోని ఆర్మీ ఆసుపత్రిలో ప్రణబ్ ఈ నెల 10వ తేదీన చేరిన విషయం తెలిసిందే. మెదడులో ఏర్పడ్డ ఒక అడ్డంకిని తొలగించేందుకు ఆయనకు శస్త్ర చికిత్స కూడా జరిగింది. అదే రోజు ఆయనకు కోవిడ్–19 పరీక్షలు జరపగా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే.