army hospital
-
ఆర్మీ ఆస్పత్రిలో ఏనుగుల కలకలం
-
కంటి ఆపరేషన్ చేయించుకున్న రాష్ట్రపతి
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ న్యూఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో కంటి ఆపరేషన్ చేయించుకున్నారు. గురువారం ఉదయం ఈ శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో పేర్కొంది. శస్త్ర చికిత్స విజయవంతమైందని, రాష్ట్రపతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. President Ram Nath Kovind underwent cataract surgery at Army Hospital (Referral & Research), New Delhi today morning. The surgery was successful and he has been discharged from the hospital: Ajay Kumar Singh, Press Secretary to the President pic.twitter.com/DQcxf0Wnf8 — ANI (@ANI) August 19, 2021 -
రఘురామ వైద్యపరీక్షల పర్యవేక్షణకు జ్యుడిషియల్ అధికారి
సాక్షి, హైదరాబాద్: నరసపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైద్య పరీక్షల పర్యవేక్షణ కోసం జ్యుడిషియల్ అధికారిని తెలంగాణ హైకోర్టు నియమించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జ్యుడిషియల్ రిజిస్ట్రార్ నాగార్జునను హైకోర్టు నియమించింది. ఈ మేరకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి జ్యుడిషియల్ అధికారి చేరుకున్నారు. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో రఘురామకృష్ణరాజుకు ముగ్గురు ఆర్మీ వైద్యుల బృందం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ వైద్య పరీక్షలను అధికారులు వీడియో తీస్తున్నారు. మెడికల్ నివేదికను సీల్డ్ కవర్లో న్యాయాధికారి సుప్రీంకోర్టుకు సమర్పించనున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర కేసులో అరెస్టయిన ఎంపీ రఘురామకృష్ణరాజుకు బెయిలు ఇచ్చేందుకు సోమవారం సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. తనకు రమేశ్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలన్న ఆయన విజ్ఞప్తిని కూడా తోసిపుచ్చి.. రఘురామకృష్ణరాజును సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించి తెలంగాణ హైకోర్టు నియమించే జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో వైద్య పరీక్షలు జరపాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరించి తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ద్వారా సీల్డ్ కవర్లో తమకు నివేదిక పంపాలని పేర్కొంది. దీనిపై ఈనెల 19వ తేదీలోగా కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. -
రఘురామకు బెయిల్ నిరాకరణ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర కేసులో అరెస్టయిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు బెయిలు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తనకు రమేశ్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలన్న ఆయన విజ్ఞప్తిని కూడా తోసిపుచ్చింది. రఘురామకృష్ణరాజును సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించి తెలంగాణ హైకోర్టు నియమించే జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో వైద్య పరీక్షలు జరపాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరించి తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ద్వారా సీల్డ్ కవర్లో తమకు నివేదిక పంపాలని పేర్కొంది. దీనిపై ఈనెల 19వ తేదీలోగా కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. హైకోర్టు బెయిలు నిరాకరించడంతో రఘురామకృష్ణరాజు, ఆయన కుమారుడు భరత్ వేర్వేరుగా దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లను సోమవారం విచారించిన జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. మంగళగిరి ఎయిమ్స్, మణిపాల్ ఆస్పత్రులను సూచించినా... ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ‘‘జ్యుడీషియల్ అధికారి సమక్షంలో రఘురామకృష్ణరాజుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించడానికి అభ్యంతరం లేదు. మంగళగిరిలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయవచ్చు. విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రి(ప్రైవేట్)లో జరిపినా అభ్యంతరం లేదు’’ అని తెలిపారు. అయితే మంగళగిరిలోని ఎయిమ్స్ కొత్తగా ఏర్పాటైందని, తగినంత మంది సిబ్బంది లేరని, మణిపాల్ ఆసుపత్రి ప్రైవేట్‌ది అని రఘరామరాజు తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి అభ్యంతరం వ్యక్తం చేశారు. రఘురామకృష్ణరాజును సొంత ఖర్చులతో ఢిల్లీ రావడానికి అనుమతించి ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించాలని కోరారు. దీనికి కేంద్రం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం చెప్పలేదు. అయితే సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స కాకుండా కేవలం వైద్య పరీక్షలు మాత్రమే నిర్వహించాలని దుష్యంత్ దవే కోరారు. సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రికి చేరుకున్న ఎంపీ ఖర్చులు పిటిషనరే భరించాలి... ‘ఆర్మీ ఆసుపత్రి హెడ్ ఆధ్వర్యంలో ముగ్గురు వైద్యులతో కూడిన మెడికల్ బోర్డు వైద్య పరీక్షలు నిర్వహించాలి. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఆర్మీ ఆసుపత్రిలోనే వైద్య సేవలు అందించాలి. దీన్ని జ్యుడీషియల్ కస్టడీగా భావించాలి. ఆర్మీ ఆసుపత్రిలో అయ్యే ఖర్చును పిటిషనర్ భరించాలి. స్పెషల్ లీవ్ పిటిషన్లపై కౌంటరు దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగా రెండు రోజులు గడువు ఇస్తున్నాం. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు పిటిషనర్ కాపీలు అంజేయాలి. పిటిషనర్ రిజాయిండర్‌ను ఈ నెల 20లోగా దాఖలు చేయాలి. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేస్తున్నాం. ఈ ఆదేశాలు అమలు అయ్యేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్యలు తీసుకోవాలి. మా ఆదేశాలను ఈ–మెయిల్ ద్వారా తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, ఏపీ హైకోర్టు, సీఎస్, సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి హెడ్‌కు పంపాలి’’ అని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. సుప్రీంకోర్టును ఆశ్రయించిన టీవీ 5, ఏబీఎన్ ఈ వ్యవహారానికి సంబంధించి తమపైనా కేసు నమోదు చేయడంపై టీవీ 5, ఏబీఎన్ చానళ్లు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సంస్థ, ఉద్యోగులపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని, సీఐడీ దర్యాప్తుపై స్టే ఇవ్వాలని కోరుతూ సోమవారం రిట్ పిటిషన్ దాఖలు చేశాయి. ఆర్మీ ఆస్పత్రికి తరలింపు.. సాక్షి, గుంటూరు : సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎంపీ రఘురామకృష్ణరాజును అధికారులు గుంటూరు జిల్లా జైలు నుంచి సికింద్రాబాద్‌కు తరలించారు. జైళ్ల శాఖ డీజీపీ నుంచి ఉత్తర్వులు అందడంతో సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో పోలీసు భద్రత నడుమ వ్యక్తిగత వాహనంలో జైలు నుంచి ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. -
హైదరాబాద్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు
-
రఘురామ కృష్ణరాజు కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు
-
డీప్ కోమాలోకి ప్రణబ్ ముఖర్జీ
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆయన ఆరోగ్యంపై తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఆర్మీ ఆస్పత్రి వైద్యులు.. డీప్ కోమాలోకి ప్రణబ్ వెళ్లారని ప్రకటించారు. ఇప్పటి వరకు అందించిన వైద్య చికిత్సతో ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మార్పులేదని, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ పెరిగిందని వైద్యులు తెలిపారు. ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పైనే ప్రణబ్‌కు చికిత్స కొనసాగుతోందని ఆర్మీ ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. కాగా బ్రెయిన్ సర్జరీ తర్వాత కరోనా బారినపడటంతో ప్రణబ్ ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఆయన ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. (క్షీణిస్తున్న ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం) -
కోమాలోకి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ (84) ఆరోగ్య పరిస్థితిలో ఏ మార్పులేదని, ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నామని ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రి తెలిపింది. ఆయన కోమాలోనే ఉన్నారని ఆదివారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. కాగా, ఈనెల 10వ తేదీన ఆర్మీ ఆస్పత్రిలో చేరిన ప్రణబ్‌కు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. దాంతోపాటు ఆయనకు కోవిడ్–19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పరిస్థితి విషమించి ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. (చదవండి: కాంగ్రెస్ నాయకత్వంపై సీనియర్లు లేఖ) -
విషమంగానే ప్రణబ్ ఆరోగ్యం
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆర్మీ ఆస్పత్రి అధికారులు సోమవారం వెల్లడించారు. ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య నిపుణుల బృందం నిశితంగా పరిశీలించిందని పేర్కొన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ ప్రణబ్ శరీరం వైద్యం అందించడానికి సహకరిస్తూ స్థిరంగా ఉందని తెలిపారు. ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలోని ఆర్మీ ఆసుపత్రిలో ప్రణబ్ ఈ నెల 10వ తేదీన చేరిన విషయం తెలిసిందే. మెదడులో ఏర్పడ్డ ఒక అడ్డంకిని తొలగించేందుకు ఆయనకు శస్త్ర చికిత్స కూడా జరిగింది. అదే రోజు ఆయనకు కోవిడ్–19 పరీక్షలు జరపగా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. -
‘నాన్న కోసం ప్రార్ధించండి’
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ప్రజలకు తానిచ్చిన దానికంటే వారి నుంచి తాను ఎంతో పొందానని నాన్న తరచూ చెబుతుండేవారని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ అన్నారు. తన తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థించాలని ఆయన ప్రజలను కోరారు. ఢిల్లీలోని ఆర్మీ రిఫరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రి 96 గంటల అబ్జర్వేషన్ వ్యవధి శుక్రవారంతో ముగుస్తుందని చెప్పారు. ప్రణబ్‌జీ చికిత్సకు స్పందిస్తున్నారని అభిజిత్ ట్వీట్ చేశారు. ప్రణబ్ ముఖర్జీకి సోమవారం బ్రెయిన్ సర్జరీ జరిగిన అనంతరం ఆయన ఆరోగ్య పరిస్ధితి విషమంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేదని, ఆయన ఇంటెన్సివ్ కేర్‌లో వెంటిలేటర్‌పైనే ఉన్నారని ఆర్మీ ఆస్పత్రి పేర్కొంది. రక్తపోటు, మధుమేహం సహా కీలక ఆరోగ్య సంకేతాలన్నీ నిలకడగా ఉన్నాయని తెలిపింది. మరోవైపు తన తండ్రి ఆరోగ్యం మరింత క్షీణించలేదని, ప్రణబ్‌జీ కళ్లలో కొంత మెరుగుదల కనిపించిందని ఆయన కుమార్తె షర్మిష్ట పేర్కొన్నారు. కాగా బ్రెయిన్ సర్జరీకి ముందు తనకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ప్రణబ్ ముఖర్జీ ట్వీట్ చేశారు. ప్రణబ్ సత్వరమే కోలుకోవాలని బెంగాల్‌లోని ఆయన స్వగ్రామంలో ప్రార్ధనలు నిర్వహించారు. ఇక బీర్బం జిల్లాలో ఆయన బంధువులు మూడు రోజుల పాటు మృత్యుంజయ హోమం జరిపారు. చదవండి : ప్రణబ్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలను నమ్మొద్దు -
రావల్పిండి ఆర్మీ హాస్పిటల్లో భారీ పేలుడు
-
భగవంతుడా.. బతికించు
సియాచిన్ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన జవాను ♦ సోమవారం రాత్రి హుటాహుటిన ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రికి తరలింపు ♦ అత్యంత విషమంగా వీర జవాను ఆరోగ్యం ♦ ఆసుపత్రికి వచ్చి చూసివెళ్లిన ప్రధాని ♦ మిగతా 9 మంది సైనికుల మృతి ♦ భగవంతుడా బతికించాలని ప్రార్థిస్తున్న భారతావని న్యూఢిల్లీ/ధార్వాడ్: అతనో వీర జవాను... హిమాలయ పర్వతశ్రేణుల్లో అత్యంత కఠిన వాతావరణంలో సియాచిన్‌పై 19 వేల అడుగుల ఎత్తులో... ఎడతెగకుండా కురిసే మంచులో సరిహద్దు భద్రతను నిర్వర్తిస్తున్నాడు. ఈనెల మూడోతేదీన ప్రకృతి కన్నెర్ర చేసింది. సియాచిన్లోని భారత సైనికుల బేస్‌పై భారీ మంచుచరియలు విరిగిపడ్డాయి. ఆచూకీ దొరకని పదిమంది సైనికులూ మరణించే ఉంటారని రెండు రోజులకే ఆర్మీ అధికారికంగా ప్రకటించింది కూడా. మృతదేహాలను వెలికితీసే చర్యలు కొనసాగాయి. సోమవారం... అప్పటికే ఐదురోజులు గడిచిపోయాయి. సోమవారం సాయంత్రానికి ఐదు మృతదేహాలను బయటకు తీశారు. గాలింపులో భాగంగా మంచుకొండలను తవ్వుతున్న సిబ్బందికి మరొక దేహం కనిపించింది. మెల్లిగా చుట్టూ ఉన్న మంచును తొలగిస్తున్నారు. ఆశ్చర్యం.. ఆ సాహస జవాను చనిపోలేదు. సర్వశక్తులతో మృత్యువుతో పోరాడుతున్నాడు. అంతే సహాయక సిబ్బందిలో ఒక్కసారిగా విభ్రాంతి. ఏమిటిది? ఎలా సాధ్యం? వెంటనే అక్కడే ఉన్న వైద్యబృందం చికిత్స మొదలుపెట్టింది. అనంతరం ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రికి తరలించారు. మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో, 25 అడుగుల లోతులో మంచుకింద కూరుకుపోయినా... ఐదు రోజుల దాకా ఊపిరి నిలుపుకోవడం అద్భుతమే. అసలు శ్వాస అందడమే గగనం. మంచులోతుల్లో సజీవ సమాధి.. ఎక్కడున్నామో, ఎలా బయటపడతామో, సహాయం ఎప్పుడు అందుతుందో, అసలు బతుకుతానో... లేదో! ఇవేవీ ఆ వీర జవాను స్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయాయి. అతను లాన్స్‌నాయక్ హనుమంతప్ప కొప్పాడ్. అత్యంత శీతల వాతావరణంలో రోజుల తరబడి ఉండటంతో అతని రక్తపోటు తగ్గింది. గుండె కొట్టుకునే వేగం నెమ్మదించింది. శరీరంలోని కీలక అవయవాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గింది. కాలేయం, మూత్రపిండాలు పనిచేయడం మానేశాయి. శరీర ఉష్ణోగ్రతా నెమ్మదిగా తగ్గింది. అయితే అదృష్టవశాత్తు హనుమంతప్ప శరీరం ఎక్కడా మంచుకు ఎక్స్పోజ్ కాలేదు. పూర్తిగా కవర్ చేసి ఉండటంతో కాళ్లు, చేతులు గడ్డకట్టుకుపోయే పరిస్థితి ఉత్పన్నం కాలేదు. అయితే శరీరంలో నీటిశాతం తగ్గిపోవడం, ఆహారం లేకపోవడంతో... బాగా నీరసించిపోయాడు. హనుమంతప్ప కాలేయం, కిడ్నీలు కూడా సరిగా పనిచేయడం లేదని, దీంతో వెంటలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని ప్రకటించారు. దేశ రక్షణకోసం సియాచిన్‌పై విధుల్లో నిలిచిన ఈ వీరజవానును బతికించాలని భారతావని భగవంతుడిని ప్రార్థిస్తోంది. ఐదు రోజుల పాటు.. మైనస్ 40 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత వద్ద.. మంచు కింద 30 అడుగుల లోతున కూరుకుపోయినా.. హనుమంతప్ప జీవించి ఉండటం సంచలనంగా మారింది. ఆయనను మంగళవారం ఉదయం ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. హనమంతప్ప ఇంకా స్పృహలోకి రాలేదని, ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. హనుమంతప్పను ప్రధాని మోదీ, ఆర్మీ చీఫ్ దల్బీర్‌సింగ్ పరామర్శించారు. హనుమంతప్ప కర్ణాటకలోని థార్వాడ్‌కు చెందినవారు. ఆయనకు భార్య, ఏడాదిన్నర పాప ఉన్నారు. ఆయన జీవించి ఉండడంతో వారి కుటుంబంలో తిరిగి సంతోషం నెలకొంది. భారత్-పాక్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వద్ద సియాచిన్ గ్లేసియర్‌పై ఉన్న సైనిక బేస్‌క్యాంపుపై ఆరు రోజుల కింద(ఫిబ్రవరి 3) మంచు చరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. 19 వేల అడుగుల ఎత్తయిన ఆ ప్రాంతంలో మంచు చరియల కింద పది మంది జవాన్లు కూరుకుపోయారు. యుద్ధ ప్రాతిపదికన సహాయం.. సియాచిన్ ప్రాంతంలో హనమంతప్ప జీవించి ఉన్నట్లు గుర్తించిన సైన్యం వైద్యులు.. అక్కడే చికిత్స ప్రారంభించారు. పూర్తిగా చల్లబడిపోయిన శరీర భాగాలను వేడెక్కించేందుకు వేడి ద్రవాలను నరాల ద్వారా ఎక్కించారు. ఓవైపు వేడి చేసిన ఆక్సిజన్ వాయువును అందిస్తూ.. మరోవైపు శరీరాన్ని బయటి నుంచి కూడా వేడి చేసే చర్యలు చేపట్టారు. ఆ వెంటనే ప్రమాద స్థలి నుంచి ఓ హెలికాప్టర్లో సియాచిన్ బేస్‌క్యాంపునకు చేర్చారు. అక్కడ మరికొంత చికిత్స చేసి.. వైద్య నిపుణులు తోడుగా మరో హెలికాప్టర్లో థాయిస్ ఎయిర్‌బేస్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి వైద్య సౌకర్యాలున్న ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. ఆయన ఆత్మస్థైర్యం గొప్పది: మోదీ మంచు చరియల కింద నుంచి సజీవంగా బయటపడిన హనమంతప్పను మంగళవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్మీ చీఫ్ దల్బీర్‌సింగ్ పరామర్శించారు. హనమంతప్ప ఒక గొప్ప సైనికుడని, ఆయన ఆత్మస్థైర్యం ఎంతో గొప్పదని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రపతి అభినందన: హనుమంతప్ప సాహస వీరుడని, సియాచిన్ మంచు చరియల తుపాను నుంచి ఆయన చిరంజీవిగా బయటపడిన వార్త విని తనకు ఎంతో ఆనందమేసిందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఇది మాకు పునర్జన్మ.. హనమంతప్ప భార్య మహాదేవి: సియాచిన్‌లో మంచు కింద కూరుకుపోవడంతో హనుమంతప్ప మరణించి ఉంటాడన్న ఆవేదనలో కూరుకుపోయిన ఆయన కుటుంబంలో... ఆయన బతికే ఉన్నాడన్న వార్త తిరిగి సంతోషం నింపింది. ఇది తమ కుటుంబానికే పునర్జన్మ అని ఆయన భార్య మహాదేవి పేర్కొన్నారు. బుల్లెట్ల కంటే మంచే ప్రమాదకరం హిమాలయాల్లో అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండే యుద్ధభూమి సియాచిన్. పగలు ఉష్ణోగ్రత మైనస్ 40 డిగ్రీల సెంటీగ్రేడ్లు.. రాత్రి మైనస్ 55 డిగ్రీల వరకూ పడిపోతుంది. 1984 నుంచి వాతావరణ ప్రతికూలతల వల్ల 869మంది చనిపోయారు. 1984లో పాక్ నుంచి సియాచిన్‌ను స్వాధీనం చేసుకునేందుకు నిర్వహించిన ఆపరేషన్‌లో 33మంది సైనిక అధికారులు చనిపోయారు. వీరు కాకుండా 54మంది జూనియర్ కమాండింగ్ అధికారులు, మరో 782మంది ఇతర అధికారులు, జవానులు మృతి చెందారు. మిగతా తొమ్మిది మంది మృతి హనుమంతప్ప మినహా మంచులో కూరుకుపోయిన మిగతా తొమ్మిదిమంది జవానులు మరణించినట్లు ఆర్మీ ప్రకటించింది. ► సిపాయ్ ముష్తాక్ అహ్మద్.. పర్నపల్లె, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ ► సుబేదార్ నగేషా.. తేజూర్, హసన్ జిల్లా కర్ణాటక ► లాన్స్ హవాల్దార్ ఎలుమామలై.. దుక్కం పరై, వేలూరు,తమిళనాడు ► లాన్స్ హవిల్దార్ ఎస్ కుమార్.. కుమానన్ తోఝు, తెని.. కేరళ ► లాన్స్‌నాయక్ సుధీశ్ మోన్రోతురుత్, కొల్లాం, కేరళ ► సిపాయ్ మహేశ పీఎన్ హెచ్డీ కోటే, మైసూర్, కర్ణాటక ► సిపాయ్ గణేశన్, చెక్కతేవన్ పట్టి, మదురై, తమిళనాడు ► సిపాయ్ రామమూర్తి, గుడిసతన పల్లి, కృష్ణగిరి, తమిళనాడు ►సిపాయ్ నర్సింగ్ అసిస్టెంట్ సూర్యవంశి, మస్కర్వాడి, సతారా, మహారాష్ట్ర -
ఆర్మీ వైద్యుడి కారు దొంగతనం
-
ఆర్మీ వైద్యుడి కారు దొంగతనం.. ఢిల్లీలో అలర్ట్
న్యూఢిల్లీ: ఎన్నడూ లేనంతగా ఈసారి దేశ రాజధానిలో టెన్షన్ టెన్షన్ గా మారింది. గణతంత్ర దినోత్సవం దగ్గరపడుతున్నా కొద్ది చోటుచేసుకుంటున్న సంఘటనలు నిఘావర్గాల, పోలీసుల గుండెల్లో గుబులుపుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ పోలీసులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఇప్పటికే పలువురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేయగా.. తాజాగా ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని లోధి గార్డెన్ లో పార్క్ చేసిన ఓ ఆర్మీ ఆస్పత్రి వైద్యుడికి చెందిన తెల్లటి సాంత్రో కారు(హెచ్ఆర్51టీ6646)ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. కారుపై ఆర్ఆర్ ఆస్పత్రి స్టిక్కర్ ఉంది. తన కుటుంబంతో కలిసి కాలక్షేపం కోసం ఆ వైద్యుడు పార్క్ కు రాగా కొద్ది సేపటికి ఆయన కారు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. వెంటనే వాట్సాప్ ద్వారా పోలీసు బృందాలకు కారు ఫొటోను పంపించి వెతికే పని ప్రారంభించారు. ఉగ్రవాదులే ఆ కారును ఎత్తుకెళ్లి ఉండొచ్చని వారు అనుమానిస్తున్నారు. ఇటీవల కాలంలో వరుసగా ఉగ్రవాదుల దాడుల ఎక్కువవడం, రిపబ్లిక్ డే దగ్గరపడటంతో ఢిల్లీ పోలీసులు కంటిమీద కునుకు లేకుండా పనిచేస్తున్నారు.