
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆయన ఆరోగ్యంపై తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఆర్మీ ఆస్పత్రి వైద్యులు.. డీప్ కోమాలోకి ప్రణబ్ వెళ్లారని ప్రకటించారు. ఇప్పటి వరకు అందించిన వైద్య చికిత్సతో ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మార్పులేదని, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ పెరిగిందని వైద్యులు తెలిపారు. ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పైనే ప్రణబ్‌కు చికిత్స కొనసాగుతోందని ఆర్మీ ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. కాగా బ్రెయిన్ సర్జరీ తర్వాత కరోనా బారినపడటంతో ప్రణబ్ ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఆయన ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. (క్షీణిస్తున్న ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం)
Comments
Please login to add a commentAdd a comment