Deldhi
-
ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి జవాబు
సాక్షి, న్యూఢిల్లీ: పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను మిశ్రమం చేయాలన్న లక్ష్య సాధనలో 2జీ (రెండో తరం) ఇథనాల్ కీలకం కానున్నట్లు పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీ వెల్లడించారు. అందుకోసం 2జీ బయో ఇథనాల్ రిఫైనరీల ఏర్పాటుకు కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తుందని రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రశ్నకు రాతపూర్వకంగా బదులిస్తూ చెప్పారు. ప్రభుత్వ ఆయిల్ రంగ సంస్థలు ఈ ఏడాది నవంబర్ 15 నాటికి ఆంధ్రప్రదేశ్ నుంచి 16.19 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను కొనుగోలు చేసినట్లు ఆయన చెప్పారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి గడిచిన 5 సంవత్సరాలలో 385.92 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. 2025 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని సాధించేందుకు రెండో తరం ఇథనాల్ ఉత్పత్తిని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారన్న ప్రశ్నకు మంత్రి బదులిస్తూ ప్రధాన మంత్రి జేఐ-వన్ (జీవ్ ఇంధన్- వాతావరణ్ అనుకూల్ ఫసల్ అవశేష్ నివారణ్) యోజన పథకం కింద సెల్లులోసిక్, లింగో సెల్లులోసిక్ బయోమాస్ నుంచి అలాగే పెట్రో కెమికల్ మార్గం ద్వారా 2జీ ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు 2 జీ ఇథనాల్ బయో రిఫైనరీస్‌ను పెద్ద ఎత్తు ఏర్పాటు చేయాలని తలపెట్టినట్లు మంత్రి వెల్లడించారు. ఈ రిఫైనరీలకు తగిన విధంగా ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్రం నోటిఫికేషన్ కూడా విడుదల చేసినట్లు తెలిపారు. వరి దుబ్బు, ఇతర పంట వ్యర్థాల ఆధారిత 2జీ ఇథనాల్ బయో రిఫైనరీలు పంజాబ్, హర్యానా, ఒడిశా, అస్సాం రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. హర్యానాలోని పానిపట్‌లో నెలకొల్పిన బయో రిఫైనరీని జాతికి అంకితం చేసినట్లు తెలుపారు. బయోమాస్ సేకరణ కోసం ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు వివిధ రాష్ట్రాలు, రైతులు, ఇతర భాగస్వాములతో సమన్వయం చేసుకుంటోందని మంత్రి తెలిపారు ఏపీలో లక్షా 90 వేల వీధి వర్తకులకు స్వానిధి రుణాలు ప్రధానమంత్రి స్వానిధి పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 1,90,433 మంది వీధి వర్తకులకు రుణాలు మంజూరు చేసినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ 2020-21 ఆర్థిక సంవత్సరంలో 1,12,744 మందికి, 2021-22 లో 70,415 మందికి, 2022-23 లో 7,274 మందికి మొదటి దశ కింద ఒక్కొక్కరికి 10 వేల రూపాయల రుణం మంజూరు చేసినట్లు తెలిపారు. మొదటి తీసుకున్న రుణం సక్రమంగా చెల్లించిన వారికి రెండవ దఫా రుణం కింద 20 వేల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు. మూడవ దశ కింద 251 మందికి 50 వేల రూపాయల రుణం అందించినట్లు మంత్రి తెలిపారు. అలాగే వడ్డీ సబ్సిడీ కింద 3 కోట్ల రూపాయలు, క్యాష్ బ్యాక్ కింద కోటి 65 లక్షల రూపాయలు లబ్దిదారులకు అందజేసినట్లు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 4 నాటికి పీఎం స్వానిధి పథకం కింద రుణాల కోసం ఏపీ నుంచి 4 లక్షల దరఖాస్తులు అందగా అందులో 67,404 దరఖాస్తులు అర్హత లేనివిగా గుర్తించి తిరస్కరించినట్లు తెలిపారు. 16,118 దరఖాస్తులు మంజూరు దశలో ఉన్నాయని, 29,853 మంది బ్యాంకులకు అందుబాటులో లేని కారణంగా రుణాల పంపిణీ పెండింగ్‌లో ఉన్నట్లు మంత్రి వివరించారు. కోవిడ్ మహమ్మారి కారణంగా కుదేలైన వీధి వర్తకులు తిరిగి వారి వ్యాపార కార్యకలాపాలను కొనగించుకునేందుకు వర్కింగ్ కాపిటల్ కింద 10 వేల రూపాయలు రుణం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం స్వానిధి పథకాన్ని 2020 జూన్ 1న ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. తీసుకున్న రుణం సకాలంలో చెల్లించిన వారికి రెండవ దఫా రుణం కింద 20 వేలు, మూడవ దఫా కింద 50 వేల రూపాయలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. సకాలంలో రుణం చెల్లించిన వారికి తీసుకున్న రుణంపా 7 శాతం వడ్డీ రాయితీ, డిజిటల్ చెల్లింపులు చేసిన వారికి క్యాష్ బ్యాక్ కింద ఏడాదికి 1200 రూపాయలు చెల్లించినట్లు మంత్రి పేర్కొన్నారు. చదవండి: ఏపీలో భారీగా ఉద్యోగావకాశాలు.. వేల కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ -
విషమంగానే ప్రణబ్ ఆరోగ్యం
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆర్మీ ఆస్పత్రి అధికారులు సోమవారం వెల్లడించారు. ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య నిపుణుల బృందం నిశితంగా పరిశీలించిందని పేర్కొన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ ప్రణబ్ శరీరం వైద్యం అందించడానికి సహకరిస్తూ స్థిరంగా ఉందని తెలిపారు. ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలోని ఆర్మీ ఆసుపత్రిలో ప్రణబ్ ఈ నెల 10వ తేదీన చేరిన విషయం తెలిసిందే. మెదడులో ఏర్పడ్డ ఒక అడ్డంకిని తొలగించేందుకు ఆయనకు శస్త్ర చికిత్స కూడా జరిగింది. అదే రోజు ఆయనకు కోవిడ్–19 పరీక్షలు జరపగా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. -
బాకీలపై మరో మాట లేదు..
న్యూఢిల్లీ: సవరించిన స్థూల ఆదాయాల (ఏజీఆర్) ఆధారంగా టెల్కోలు కట్టాల్సిన బకాయిలకు సంబంధించి టెలికం శాఖ (డాట్) లెక్కలపై మరో మాట మాట్లాడటానికి లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వీటిని మరోసారి మదింపు చేయాలన్న టెల్కోల అభ్యర్థనను పట్టించుకునే ప్రసక్తే లేదని పేర్కొంది. ఏజీఆర్ బాకీల చెల్లింపునకు వ్యవధినిచ్చే అంశంపై తదుపరి విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది. వివరాల్లోకి వెళితే.. ఏజీఆర్ ఫార్ములా ప్రకారం స్పెక్ట్రం యూసేజీ చార్జీలు, లైసెన్సు ఫీజు బకాయిల కింద టెలికం సంస్థలు దాదాపు రూ. 1.6 లక్షల కోట్లు చెల్లించాల్సి రానున్న సంగతి తెలిసిందే. స్వీయ మదింపు ప్రకారం కొంత కట్టిన టెల్కోలు.. తమ బాకీలు డాట్ చెబుతున్నంత స్థాయిలో లేవని, పైగా ఆర్థిక పరిస్థితులు బాగా లేనందున బకాయిలను కట్టేందుకు 20 ఏళ్ల దాకా వ్యవధినివ్వాలని సుప్రీం కోర్టును కోరుతున్నాయి. దీనిపై సోమవారం విచారణ సందర్భంగా అటు ప్రభుత్వం, ఇటు టెలికం సంస్థల వాదనలను సుప్రీం కోర్టు విన్నది. బాకీల పునఃమదింపు అంశాన్ని టెల్కోలు ప్రస్తావించగా.. ‘రీ–అసెస్మెంట్ విషయంలో మరొక్క క్షణం కూడా వాదనలు వినే ప్రసక్తే లేదు. ఏజీఆర్ నిర్వచనం ఖరారు చేశాం. దాని ఆధారంగా డాట్ బాకీల నోటీసులు కూడా పంపింది. దీన్ని మళ్లీ తెరిచే ప్రశ్నే లేదు‘ అని స్పష్టం చేసింది. ఇక, దివాలా తీసే పరిస్థితులు ఉన్నాయంటున్న కంపెనీల వాదనల్లో వాస్తవాలను కూడా పరిశీలిస్తామని పేర్కొంది. -
‘ఎంపీ టికెట్‌కు సీఎం ఆరుకోట్లు డిమాండ్ చేశారు’
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై ఆప్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి వద్ద ఆరు కోట్ల రూపాయలను తీసుకుని టికెట్ ఇచ్చారని ఆప్ వెస్ట్ ఢిల్లీ లోక్‌సభ అభ్యర్థి బల్బీర్ జక్కర్ తనయుడు ఉదయ్ జక్కర్ ఆరోపించారు. మూడు నెలల కిత్రం తన తండ్రి ఆప్‌లో చేరారని, టికెట్ ఇచ్చే సమయంలో కేజ్రీవాల్ ఆరుకోట్లు డిమాండ్ చేశారని తెలిపారు. డబ్బు మొత్తం చెల్లించిన తరువాతనే తన తండ్రికి టికెట్ కేటాయించారని అన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తన వద్ద ఉన్నాయని ఉదమ్ వెల్లడించారు. కాగా ఆయన వ్యాఖ్యలు ఆప్ శ్రేణుల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. పోలింగ్‌కు ఒక్కరోజు ముందు ఆప్ అభ్యర్థి తనయుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఉదయ్ వ్యాఖ్యలు అవాస్తవం.. ఇదిలావుడంగా తన కుమారుడు చేసిన వ్యాఖ్యలు అవాస్తమని, కేజ్రీవాల్ తన వద్దనుంచి డబ్బు డిమాండ్ చేయలేదని స్పష్టంచేశారు. తన కుమారుడు తనతో చాలా తక్కువగా మాట్లాడుతాడని, ఆయన చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. తన భార్యకు 2008లో విడాకులు ఇచ్చానని కూడా బల్బీర్ ప్రకటించారు. #WATCH Aam Aadmi Party's West Delhi candidate, Balbir Singh Jakhar's son Uday Jakhar: My father joined politics about 3 months ago, he had paid Arvind Kejriwal Rs 6 crore for a ticket, I have credible evidence that he had paid for this ticket. pic.twitter.com/grlxoDEFVk — ANI (@ANI) 11 May 2019 -
80 కేజీల బంగారం మాయంపై సీబీఐ దర్యాప్తు
న్యూఢిల్లీ: ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న దాదాపు రూ.25 కోట్ల విలువైన బంగారం మాయమైన ఘటనలో సీబీఐ విచారణకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. గడిచిన నాలుగేళ్లలో కస్టమ్స్ అధికారుల ఆధీనంలో ఉన్న సుమారు 80 కేజీల బంగారు కడ్డీలు, ఆభరణాలు చోరీకి గురయ్యాయి. వీటి విలువ సుమారు రూ. 25 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. బంగారం మాయమవడంపై ఢిల్లీ పోలీసులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. 2012 నుంచి ఈ ఏడాది జూన్ వరకు స్వాధీనం చేసుకున్న బంగారంలో చాలా వరకు మాయమైందని ఫిర్యాదులు నమోదయ్యాయి. దీని వెనుక కస్టమ్స్ అధికారుల ప్రమేయం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆమోదం తెలిపారు.