న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని ఏ మాత్రం మార్పు లేదని ఆర్మీ హాస్పటల్ వర్గాలు మంగళవారం పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్పై ఉన్నారని వెల్లడించింది. ఈ మేరకు ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిపై ఆర్మీ హాస్పటల్ హెల్త్ బులిటిన్ విడుదల చేసింది. ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ల బృందం ఎప్పటికపుడు పరిశీలిస్తున్నట్లు తెలిపింది. (విషమంగానే ప్రణబ్ ఆరోగ్యం)
ఈనెల 10వ తేదీన ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన పరీక్షల్లో ప్రణబ్‌కు కోవిడ్–19 పాజిటివ్‌గా నిర్ధారణైంది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్‌పైనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. . ప్రణబ్ ముఖర్జీ 2012 నుంచి 2017 వరకు భారతదేశ 13వ రాష్ట్రపతిగా ఉన్నారు. (కుదుటపడుతున్న ప్రణబ్ ఆరోగ్యం')
Comments
Please login to add a commentAdd a comment