Army Research and Referral Hospital
-
‘ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేదు’
న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని ఏ మాత్రం మార్పు లేదని ఆర్మీ హాస్పటల్ వర్గాలు మంగళవారం పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారని వెల్లడించింది. ఈ మేరకు ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిపై ఆర్మీ హాస్పటల్ హెల్త్ బులిటిన్ విడుదల చేసింది. ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ల బృందం ఎప్పటికపుడు పరిశీలిస్తున్నట్లు తెలిపింది. (విషమంగానే ప్రణబ్ ఆరోగ్యం) ఈనెల 10వ తేదీన ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన పరీక్షల్లో ప్రణబ్‌కు కోవిడ్–19 పాజిటివ్‌గా నిర్ధారణైంది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్‌పైనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. . ప్రణబ్ ముఖర్జీ 2012 నుంచి 2017 వరకు భారతదేశ 13వ రాష్ట్రపతిగా ఉన్నారు. (కుదుటపడుతున్న ప్రణబ్ ఆరోగ్యం') -
'కుదుటపడుతున్న ప్రణబ్ ఆరోగ్యం'
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ(84) ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రి ఆదివారం తెలిపింది. నేడు కూడా ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ మాత్రం ప్రణబ్ ఆరోగ్యం మెరుగవుతున్నట్లు పేర్కొన్నారు. "నిన్న ఆస్పత్రికి వెళ్లి నా తండ్రిని చూశాను. దేవుడి దయ, మీ ఆశీర్వాదాల వల్ల ఆయన ఆరోగ్యం కుదుటపడుతోంది. ముందుకన్నా ఇప్పుడు పరిస్థితి మెరుగవుతోంది. ఆయన కీలక అవయవాలన్నీ నిలకడగానే స్పందిస్తున్నాయి. చికిత్సకు కూడా స్పందిస్తున్నారు. ఆయన త్వరలోనే మన మధ్యకు వస్తారని విశ్వసిస్తున్నా" అని తెలిపారు. (ఇంకా వెంటిలేటర్‌పైనే ప్రణబ్) కాగా మెదడులో ఏర్పడ్డ అడ్డంకిని తొలగించేందుకు ప్రణబ్ ఆగస్టు 10న ఆస్పత్రిలో చేరగా కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. అదే రోజు ఆయనకు మెదడు శస్త్రచికిత్స కూడా జరిగింది. ఆరోజు నుంచి ఆయన వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు మరోవైపు సోషల్ మీడియాలో ప్రణబ్ మరణించారంటూ వదంతులు వ్యాపించడంతో ఆయన కుమారుడు వాటన్నింటినీ కొట్టిపారేసిన విషయం తెలిసిందే. (కోమాలోనే ప్రణబ్ ముఖర్జీ) -
ఇంకా వెంటిలేటర్‌పైనే ప్రణబ్
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రి వైద్య బృందం శనివారం తెలిపింది. ఆయన పరిస్థితి ఇంకా మెరుగుపడలేదని, వెంటిలేటర్‌పైనే ఉంచి చికిత్స అందిస్తున్నామని పేర్కొంది. ‘ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఆయనను ఇంటెన్సివ్ కేర్‌లో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నాం. వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణ కొనసాగుతోంది’ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. (చదవండి : ‘నాన్న కచ్చితంగా మళ్లీ జెండాను ఆవిష్కరిస్తారు’) ఈనెల 10వ తేదీన ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన పరీక్షల్లో ఆయనకు కోవిడ్–19 పాజిటివ్‌గా నిర్ధారణైంది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందుతోంది. -
వెంటిలేటర్‌పైనే ప్రణబ్
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ఆయన కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ తెలిపారు. ఈనెల 10వ తేదీన ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన పరీక్షల్లో ఆయనకు కోవిడ్–19 పాజిటివ్‌గా నిర్ధారణైంది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందుతోంది. అయితే, పరిస్థితి దిగజారలేదనీ, ఆయన కీలక అవయవాలన్నీ నిలకడగానే పనిచేస్తున్నాయని కుమార్తె శర్మిష్ఠ శుక్రవారం చెప్పారు. ‘వైద్యపరమైన అంశాల జోలికి వెళ్లడం లేదు. రెండు రోజులుగా మా నాన్న ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. అయితే, నిలకడగా మాత్రం ఉంది. ఆయన నేత్రాలు వెలుతురుకు కాస్తంత స్పందించడం కనిపిస్తోంది’అని ట్విట్టర్లో శర్మిష్ఠ ముఖర్జీ పేర్కొన్నారు. ‘ప్రణబ్ ముఖర్జీ బాహ్య స్పర్శకు, చికిత్సకు స్పందిస్తున్నారు. 96 గంటల అబ్జర్వేషన్ సమయం నేటితో పూర్తవుతోంది’అని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్విట్టర్లో తెలిపారు. ‘దేశ ప్రజల నుంచి నేను ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువగానే పొందాను..అని మా నాన్న ప్రణబ్ ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. దయచేసి ఆయన కోసం ప్రార్థించండి’అని అభిజిత్ కోరారు. -
కోమాలోనే ప్రణబ్ ముఖర్జీ
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, ప్రస్తుతం ఆయన కోమాలోకి వెళ్లిపోయారని న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరెల్ ఆసుపత్రి గురువారం తెలిపింది. ప్రణబ్ చికిత్సకు మెల్లిగా స్పందిస్తున్నారని, పరిస్థితి నిలకడగా ఉందని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ తెలిపారు. ‘నా తండ్రి ఒక పోరాటయోధుడు. చికిత్సకు నెమ్మదిగా స్పందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించాల్సిందిగా శ్రేయోభిలాషులను కోరుతున్నాను’అని అభిజిత్ ట్వీట్ చేశారు. మెదడులో ఏర్పడ్డ అడ్డంకిని తొలగించేందుకు ప్రణబ్ ఆగస్టు 10న ఆసుపత్రిలో చేరగా ఆయనకు కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అదే రోజు ఆయనకు మెదడు శస్త్రచికిత్స జరిగింది. మరోవైపు ప్రణబ్ మరణించారన్న వదంతులు ప్రబలడంతో ఆయన కుమారుడు అభిజిత్ వాటిని కొట్టిపారేశారు. ‘‘మా తండ్రి శ్రీ ప్రణబ్ బతికే ఉన్నారు. పేరు ప్రఖ్యాతులున్న జర్నలిస్టులే ఊహాగానాలు, తప్పుడు వార్తలు ప్రసారం చేయడం భారత మీడియా రంగం నకిలీ వార్తల ఫ్యాక్టరీగా మారిందన్న ఆరోపణలకు అద్దం పట్టేదిలా ఉంది’’అని ట్వీట్ చేశారు. ‘‘మా తండ్రికి సంబంధించి వస్తున్న వార్తలన్నీ వదంతులే. ఆసుపత్రి నుంచి వచ్చే సమాచారం కోసం ఫోన్ అందుబాటులో ఉంచాల్సిన అవసరమున్న నేపథ్యంలో ఎవరూ.. మరీ ముఖ్యంగా మీడియా మిత్రులు నన్ను సంప్రదించవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నా’’అని ప్రణబ్ కుమార్తె షర్మిష్ట ట్వీట్ చేశారు. -
ప్రణబ్ ఆరోగ్యం విషమమే
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతం లోని ఆసుపత్రిలో ప్రణబ్ 10వ తేదీన చేరిన విషయం తెలిసిందే. మొదడులో ఏర్పడ్డ ఒక అడ్డంకిని తొలగించేందుకు ఆయనకు శస్త్ర చికిత్స కూడా జరిగింది. అదే రోజు ఆయనకు కోవిడ్–19 పరీక్షలు జరపగా పాజిటివ్‌గా తేలింది. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆర్మీ ఆసుపత్రి బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. మాజీ రాష్ట్రపతి త్వరగా కోలుకోవా లని ఆయన స్వగ్రామమైన బెంగాల్‌లోని మిరిటీలో మూడు రోజులుగా మృత్యుంజయ మంత్ర జపం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా..ప్రణబ్ ముఖర్జీకి ఏది మంచిదైతే భగవంతుడు తనకు అదే ఇవ్వాలని కుమార్తె షర్మిష్ట ముఖర్జీ వ్యాఖ్యానించారు. దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’అందుకున్న ఏడాదికే ఆయన ఆరోగ్యం విషమంగా మారడం తనను బాధిస్తోందని కాంగ్రెస్ నేత కూడా అయిన షర్మిష్ట తెలిపారు. -
మరింత క్షీణించిన ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం
న్యూఢిల్లీ : బ్రెయిన్ సర్జరీ అనంతరం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ప్రణబ్‌కు చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ప్రణబ్ ఆరోగ్యంపై మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అయితే ఆయన ఆరోగ్యంపై నిపుణుల వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని అన్నారు. కాగా మాజీ రాష్ట్రపతికి సోమవారం బ్రెయిన్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. మెదడులో ఒక చోట రక్తం గడ్డకట్టడంతో ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. (ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం) అనారోగ్యానికి గురైన 84 ఏళ్ల ప్రణబ్ డాక్టర్ల సూచన మేరకు సోమవారం న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చేరారు. శస్త్ర చికిత్స నిర్వహించే ముందు చేసిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. (మాజీ రాష్ట్రపతికి కరోనా పాజిటివ్ ) -
ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సోమవారం బ్రెయిన్ సర్జరీ జరిగింది. మెదడులో ఒకచోట రక్తం గడ్డకట్టడంతో ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. అనారోగ్యానికి గురైన 84 ఏళ్ల ప్రణబ్ డాక్టర్ల సూచన మేరకు సోమవారం న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చేరారు. శస్త్ర చికిత్స నిర్వహించే ముందు చేసిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. ‘ప్రణబ్‌కు బ్రెయిన్ క్లాట్‌ను తొలగించేందుకు శస్త్రచికిత్స జరిగింది. ఆయన పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంది. వెంటిలేటర్‌పై ఉన్నారు’అని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. కీలక అవయవాల పనితీరు నిలకడగా ఉందని, నిపుణులైన వైద్య బృందం ఆయన్ను నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపాయి. దాదాకు కరోనా పాజిటివ్ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) కోవిడ్–19 బారిన పడ్డారు. ఈ విషయాన్ని సోమవారం ఆయనే స్వయంగా ట్వీట్ ద్వారా వెల్లడించారు. గత వారంలో తనను సంప్రదించిన వారందరూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లడం లేదా కోవిడ్–19 పరీక్షలు చేయించుకోవడమో చేయాలని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కూడా అయిన ఆయన విజ్ఞప్తి చేశారు. 2012–17 మధ్యకాలంలో ప్రణబ్ రాష్ట్రపతిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్ఆర్ ఆస్పత్రికి వెళ్లి ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఆయన కూతురు షర్మిష్టకు ఫోన్ చేసి ప్రణబ్ ఆరోగ్యం గురించి వాకబు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, అశోక్ గహ్లోత్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేంద్ర మంతి పీయూష్ గోయల్ తదితర నేతలు మాజీ రాష్ట్రపతికి త్వరగా స్వస్థత చేకూరాలని ఆకాంక్షించారు. -
ప్రణబ్ కు మోదీ పరామర్శ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పరామర్శించారు. జమ్మూ నుంచి ఢిల్లీకి తిరిగొచ్చిన మోదీ- విమానాశ్రయం నుంచి నేరుగా ఆర్మీ రీసెర్చ్ రెఫెరల్ ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రణబ్ ను పరామర్శించి, ఆయన ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రధాని కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రణబ్ ముఖర్జీ నాలుగు రోజులుగా ఆస్పత్రిలో ఉన్నారు. శనివారం ఆయనకు ఆంజియోప్లాస్టీ నిర్వహించి, స్టెంట్‌ను అమర్చారు. గుండె కండరాలకు రక్తాన్ని చేరవేసే ధమనిలో ఏర్పడిన అడ్డంకిని తొలగించేందుకు స్టెంట్‌ను అమర్చారు. ఆస్పత్రిలో ప్రణబ్ మెల్లగా కోలుకుంటున్నారు. -
అస్వస్థత నుంచి కోలుకున్నా:రాష్ట్రపతి
న్యూఢిల్లీ: అస్వస్థతకు గురైన తాను తిరిగి కోలుకున్నానని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. శనివారం ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ రెఫెరల్ ఆస్పత్రిలో ప్రణబ్ కు గుండె సంబంధమైన చికిత్స జరిగింది. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన 79ఏళ్ల రాష్ట్రపతికి, గుండె కండరాలకు రక్తాన్ని చేరవేసే ధమనిలో ఏర్పడిన అడ్డంకిని తొలగించేందుకు స్టెంట్‌ను అమర్చారు. దీంతో తిరిగి కోలుకున్న ఆయన త్వరలోనే రోజువారీ విధుల్లోకి హాజరవుతానని తెలిపారు. -
రాష్ట్రపతికి ఆంజియోప్లాస్టీ
స్టెంట్ అమర్చిన ఆర్మీ ఆసుపత్రి డాక్టర్లు న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి శనివారం ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ రెఫెరల్ ఆస్పత్రిలో గుండె సంబంధమైన చికిత్స జరిగింది. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన 79ఏళ్ల రాష్ట్రపతికి, గుండె కండరాలకు రక్తాన్ని చేరవేసే ధమనిలో ఏర్పడిన అడ్డంకిని తొలగించేందుకు స్టెంట్‌ను అమర్చారు. కడుపునొప్పి, ఉదర సంబంధమైన సమస్యలతో రాష్ట్రపతిని శనివారం ఉదయం ఆస్పత్రిలో చేర్చారు. ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ధమనిలో అడ్డంకి ఉన్నట్టు గుర్తించారు. ఆంజియోప్లాస్టీ నిర్వహించి, స్టెంట్‌ను అమర్చారు. ధమని ద్వారా జరగాల్సిన రక్తప్రసరణను ఈ చికిత్స మెరుగుపరుస్తుంది. రాష్ట్రపతికి ఆంజియోప్లాస్టీ జరిగిందన్న వార్తలను ఆయన ప్రెస్ సెక్రెటరీ రాజమొనీ ధ్రువీకరించలేదు, ఖండించనూ లేదు. ఆసుపత్రిలో రాష్ట్రపతి ఆరోగ్యంపై పూర్తి పర్యవేక్షణ కొనసాగుతోందని, సోమవారానికి కల్లా ఆయన ఆసుపత్రినుంచి తిరిగివస్తారని భావిస్తున్నామని రాజమొనీ చెప్పారు. -
ఇంట్లో తూలిపడ్డ కలాం: క్షేమమన్న వైద్యులు
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, 82 ఏళ్ల ఏపీజే అబ్దుల్ కలాం స్థానిక రాజాజీ మార్గ్‌లోని తన ఇంట్లో శుక్రవారం తూలిపడ్డారు. ఈ ఘటనలో ఆయన నుదిటికి గాయమైంది. దీంతో వెంటనే ఆర్మీ రిసెర్చ్ అండ్ రిఫెరల్ హాస్పిటల్లో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని కలాంకు చికిత్స అందిస్తున్న వైద్య బృందం సోమవారం వెల్లడించింది. ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని పేర్కొంది.