సాక్షి, న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రి వైద్య బృందం శనివారం తెలిపింది. ఆయన పరిస్థితి ఇంకా మెరుగుపడలేదని, వెంటిలేటర్‌పైనే ఉంచి చికిత్స అందిస్తున్నామని పేర్కొంది. ‘ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఆయనను ఇంటెన్సివ్ కేర్‌లో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నాం. వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణ కొనసాగుతోంది’ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. (చదవండి : ‘నాన్న కచ్చితంగా మళ్లీ జెండాను ఆవిష్కరిస్తారు’)
ఈనెల 10వ తేదీన ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన పరీక్షల్లో ఆయనకు కోవిడ్–19 పాజిటివ్‌గా నిర్ధారణైంది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందుతోంది.
Comments
Please login to add a commentAdd a comment