న్యూఢిల్లీ: అస్వస్థతకు గురైన తాను తిరిగి కోలుకున్నానని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. శనివారం ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ రెఫెరల్ ఆస్పత్రిలో ప్రణబ్ కు గుండె సంబంధమైన చికిత్స జరిగింది. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన 79ఏళ్ల రాష్ట్రపతికి, గుండె కండరాలకు రక్తాన్ని చేరవేసే ధమనిలో ఏర్పడిన అడ్డంకిని తొలగించేందుకు స్టెంట్‌ను అమర్చారు. దీంతో తిరిగి కోలుకున్న ఆయన త్వరలోనే రోజువారీ విధుల్లోకి హాజరవుతానని తెలిపారు.