మోదీ, ప్రణబ్(ఫైల్)
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పరామర్శించారు. జమ్మూ నుంచి ఢిల్లీకి తిరిగొచ్చిన మోదీ- విమానాశ్రయం నుంచి నేరుగా ఆర్మీ రీసెర్చ్ రెఫెరల్ ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రణబ్ ను పరామర్శించి, ఆయన ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ప్రధాని కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రణబ్ ముఖర్జీ నాలుగు రోజులుగా ఆస్పత్రిలో ఉన్నారు. శనివారం ఆయనకు ఆంజియోప్లాస్టీ నిర్వహించి, స్టెంట్‌ను అమర్చారు. గుండె కండరాలకు రక్తాన్ని చేరవేసే ధమనిలో ఏర్పడిన అడ్డంకిని తొలగించేందుకు స్టెంట్‌ను అమర్చారు. ఆస్పత్రిలో ప్రణబ్ మెల్లగా కోలుకుంటున్నారు.