critical postion
-
చావు బతుకుల్లో పావని.. రెండు కిడ్నీలకు ఇన్ఫెక్షన్
ఒక కష్టం గుండె దిగక ముందే దేవుడు ఆ అమ్మాయిని మరో కొలిమిలోకి నెట్టేశాడు. అమ్మ అయ్యే క్షణం కోసం తొమ్మిది నెలలు ఎదురు చూస్తే.. పుట్టీ పుట్టగానే ఆ బిడ్డను దూరం చేశాడు. ఆ బాధ కంటి గడప దాటక ముందే ఆమె ప్రాణాన్ని ప్రమాదంలో పడేసి చోద్యం చూస్తున్నాడు. ఇరవై ఏళ్ల వయసులో రెండు కిడ్నీలు పాడైపోయి ఆ అమ్మాయి బతుకు కోసం పోరాడుతోంది. తల్లిదండ్రులు, భర్త అందరిదీ కూలి బతుకులే కావడంతో వైద్యానికి వారి ఆర్థిక స్థోమత సరిపోవడం లేదు. ఆ యువతి బతకాలంటే సాయం అవసరం. గత్యంతరం లేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు కూడా సమాజం నుంచి కాస్త ఆసరా ఆశిస్తున్నారు. వంగర: వంగర మండలం శివ్వాం గ్రామానికి చెందిన తొగరాపు త్రినాథ, పద్మల కుమార్తె పావని రెండు కిడ్నీలు కోల్పోయి ప్రాణాపాయ స్థితిలో ఉంది. త్రినాథ, పద్మలు విశాఖలో కూలి పనులు చేస్తుంటారు. గత ఏడాదే బిడ్డను రణస్థలంకు చెందిన పైడిపల్లి గోవిందరావుకు ఇచ్చి వివాహం చేశారు. గోవిందరావు పైడిభీమవరంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నారు. మూడు నెలల కిందట తొమ్మిది నెలల గర్భిణిగా ఉన్న పావనిని విశాఖలోని అగనంపూడి ప్రభు త్వ ఆస్పత్రికి ప్రసవం కోసం తీసుకెళ్లారు. కానీ ప్రసవ సమయంలోనే శిశువు మరణించింది. అమ్మ అయ్యాననే ఆనందం అనుభవించకుండానే ఆవిరైంది. ఆ కష్టం భరిస్తుండగానే మరో పిడుగు లాంటి వార్త వారి చెవిన పడింది. నీరసంగా ఉన్న పావనికి కిడ్నీ సమస్య ఉందని వైద్యులు నిర్ధారించారు. వెంటనే కేజీహెచ్‌కు తరలించారు. రెండు కిడ్నీలు పోయినట్లు వైద్యులు నిర్ధారించి డయాలసిస్ చేపట్టారు. అనంతరం ఆమె శివ్వాంలో ఉంటున్న అమ్మానాన్న ల వద్దకు చేరుకుంది. భర్త గోవిందరావు కూడా కూ లి పనులు చేస్తూ జీవనం సాగించడంతో పావని వైద్యం కోసం వారు నానా అగచాట్లు పడుతున్నారు. ఇరవై ఏళ్ల వయసులో కూతురు మంచానికి పరిమితం కావడం చూసి తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. కూలి పనులు చేస్తూనే ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఆమె బాగోగులు చూసుకోవడానికి ఇప్పుడు ఆ పనులకు కూడా వెళ్లడం లేదు. దీంతో ఆ కుటుంబానికి ఆర్థిక భారం అధికమవుతోంది. ఇలాంటి ఆపత్కాలంలో ఎవరైనా సాయం చేస్తే తమకు మేలు చేసిన వారవుతారని వారు కోరుతున్నారు. పింఛన్ కూడా ఇంకా మంజూరు కాలేదని, అధికారులు దయ చూపాలని కోరుతున్నారు. సాయం చేయాలనుకునే వారు 89781 63664 నంబర్‌ను సంప్రదించాలని కోరుతున్నారు. -
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్‌కు కరోనా: పరిస్థితి విషమం
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా కరోనా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సినీరంగాన్ని కోవిడ్-19 పట్టి పీడిస్తోంది. తాజాగా బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు శ్రావణ్ కరోనాతో అత్యంత "క్లిష్టమైన" స్థితిలో చికిత్స పొందుతున్నారు. దిగ్గజ సంగీత దర్శకుల ద్వయంలో ఒకరైన శ్రావణ్ రాథోడ్‌కు (నదీమ్- శ్రావణ్ ) ఇటీవల కరోనా సోకింది. ప్రస్తుతం ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రావణ్ (66) పరిస్థితి ఇప్పుడు అత్యంత విషమంగా ఉందని ఆయన కుమారుడు, మ్యూజిక్ కంపోజర్ సంజీవ్ రాథోడ్ వెల్లడించారు. ఎస్ఎల్ రహేజా హాస్పిటల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న, తన తండ్రి ఆరోగ్యపరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు. మరోవైపు దీర్ఘకాలంగా సుగర్ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు వైరస్ కారణంగా ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయాయని సంజీవ్ తెలిపారు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, ఇతర సంగీత దర్శకులు ఆకాంక్షిస్తున్నారు. శ్రావణ్, త్వరగా కోలుకోవాలంటూ మరో సంగీత దర్శకుడు నదీమ్ సైఫీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. తన భాగస్వామి శ్రావణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్నేహితులు,అభిమానులందరినీ వేడుకున్నారు. (కోరిక తీరకుండానే వెళ్లిపోయిన వివేక్) శ్రవణ్ రాథోడ్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని, పరిస్థితి విషమంగానే ఉన్నదని అతనికి చికిత్స అందిస్తున్న వైద్యులు కీర్తి భూషణ్ చెప్పారు. ఆయన చికిత్సం నిమిత్తం ప్రత్యేకంగా మెడికల్ టీమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. కాగా ఆషిఖీ, సాజన్, పర్దే, రాజా హిందుస్తానీ సూపర్ హిట్ పాటలతో నదీమ్-శ్రవణ్ జోడీ సంగీతాభిమానులను ఆకట్టుకున్నారు. 2000 ల మధ్య కాలంలో విడిపోయిన వీరిద్దరూ తిరిగి 2009లో డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వచ్చిన డు నాట్ డిస్టర్బ్ మూవీకి కలిసి పని చేశారు. (కరోనా రోగులకు డీఆర్డీవో అద్భుత పరికరం) -
విషమంగానే ప్రణబ్ ఆరోగ్యం
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆర్మీ ఆస్పత్రి అధికారులు సోమవారం వెల్లడించారు. ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య నిపుణుల బృందం నిశితంగా పరిశీలించిందని పేర్కొన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ ప్రణబ్ శరీరం వైద్యం అందించడానికి సహకరిస్తూ స్థిరంగా ఉందని తెలిపారు. ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలోని ఆర్మీ ఆసుపత్రిలో ప్రణబ్ ఈ నెల 10వ తేదీన చేరిన విషయం తెలిసిందే. మెదడులో ఏర్పడ్డ ఒక అడ్డంకిని తొలగించేందుకు ఆయనకు శస్త్ర చికిత్స కూడా జరిగింది. అదే రోజు ఆయనకు కోవిడ్–19 పరీక్షలు జరపగా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. -
లోకోపైలట్ ఆరోగ్య పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్: కాచిగూడ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎంఎంటీఎస్ లోకోపైలట్ ఎల్.చంద్రశేఖర్ (35) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు నాంపల్లి కేర్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేస్తున్నామన్నారు. ఎంఎంటీఎస్ కేబిన్‌లో ఇరుక్కొనిపోవడం వల్ల తీవ్రంగా గాయపడినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ సుష్మ తెలిపారు. ఈ మేరకు మంగళవారం చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. కిడ్నీ దెబ్బతినడంతో డయాలసిస్ చేస్తున్నట్లు చెప్పారు. కాళ్లకు రక్తప్రసరణ తగ్గిందని, ఇప్పటికిప్పుడు సర్జరీ చేసే పరిస్థితి లేనందున ప్రధాన విభాగాలకు చెందిన వైద్య నిపుణుల సలహా మేరకు ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. చంద్రశేఖర్ శరీరమంతా గాయాలతో నిండి ఉందని, పక్కటెముకలు విరిగాయని చెప్పారు. అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగానే ఒకసారి కార్డియాక్ అరెస్ట్ అయినట్లు తెలిపారు. మరో 48 గంటలు గడిస్తే తప్ప పరిస్థితి చెప్పలేమన్నారు. మరోవైపు రైలుప్రమాదంలో గాయపడి నాంపల్లి కేర్ ఆసుపత్రిలో మరో ఆరుగురు చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. బేబి సుష్మిత సహా సాజిద్ అబ్దుర్ రషీద్ షేక్, పి. శేఖర్, రాజ్‌కుమార్, పి.బాలేశ్వరమ్మ, మహ్మద్ ఇబ్రహీంకు వైద్యసేవలను అందజేస్తున్నట్లు తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం రైల్వేలో చేరిన చంద్రశేఖర్... పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫిరంగుల దిబ్బకు చెందిన లోకోపైలట్ ఎల్.చంద్రశేఖర్ డెక్కపాటి 2011లో ఉద్యోగంలో చేరాడు. కాచిగూడ నెహ్రూనగర్‌లో ఉంటున్నాడు. హైదరాబాద్ రైల్వే డివిజన్ మెకానిక్ విభాగంలో చేరి లోకోపైలట్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య సలై, కుమారుడు ఇమ్మాన్యుయెల్ రాజ్ (3) ఉన్నారు. 15 రోజుల క్రితం మరో బాబు పుట్టాడు. భార్య, పిల్లలు ఏలూరులో ఉన్నారు. -
లోక్‌సభ మాజీ స్పీకర్ ఆరోగ్య పరిస్థితి విషమం
కోల్కత్తా : లోక్‌సభ మాజీ స్పీకర్, సీపీఎం సీనియర్ నేత సోమనాథ్ చటర్జీ (89) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కిడ్ని సంబంధిత వ్యాధితో భాదపడుతున్న ఆయనను కోల్‌కత్తాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సోమ్‌నాథ్‌కు డయాలసిస్ నిర్వహించడంతో పాటు వెంటిలేటర్‌పై శ్వాస అందిస్తున్నామని ఆదివారం వైద్యులు పేర్కొన్నారు. బెంగాల్ నుంచి సీపీఎం తరుఫున పదిసార్లు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. యూపీఏ-1 ప్రభుత్వంలో 2004-2009 మధ్య కాలంలో ఆయన లోక్‌సభ స్పీకర్‌గా సేవలందించిన విషయం తెలిసిందే. ఆయన 1971 నుంచి 2009 వరకు ఆయన లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. కేవలం ఒక్కసారి మాత్రమే 1984 ఎన్నికల్లో మమతా బెనర్జీ చేతిలో ఓడిపోయారు. 1968లో సీపీఎంలో చేరిన సోమనాథ్ 2008 వరకు ఆ పార్టీలో కొనసాగారు. అయితే 2008లో యూపీఏ-1 ప్రభుత్వానికి సీపీఎం మద్దతు ఉపసంహరించుకున్నప్పటీకి స్పీకర్‌గా కొనసాగడంతో పార్టీలో నుంచి బహిష్కరించారు. -
ఏపీ మాజీ గవర్నర్ పరిస్థితి విషమం
న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ (91) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయనకు ఢిల్లీలోని సిటీస్ మాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గత నెల 26న తీవ్రజ్వరం, న్యూమోనియా రావడంతో కుటుంబసభ్యులు తివారీని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తివారీ ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లకు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. తివారీ ఆరోగ్యస్థితిపై ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్, మాజీ ఉత్తరాఖండ్ సీఎం విజయ్ బహుగుణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
క్షీణధార
► పాడిపరిశ్రమకు గడ్డురోజులు ► 8 బీఎంసీ కేంద్రాలు మూత ► రాయచోటిలో ఒంటిపూట పాలసేకరణ ► ఆందోళనలో పాడిరైతులు ► పట్టించుకోని ప్రభుత్వం పాడిని నమ్ముకున్న వారికి కూటికి కొదవ ఉండదని గతంలో పెద్దలు చెప్పేవారు. కానీ ఇప్పుడా కాలం చెల్లిపోయిందా అనిపిస్తోంది. వారికి పాలధారలు కాదు కన్నీళ్లే రాలుతున్నాయి. పాడి పెంపకాన్నే జీవనాధారం చేసుకున్న వారికి నష్టాలే మిగులుతున్నాయి. పరిస్థితి చేయిదాటిపోకుండా చూడాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కడప అగ్రికల్చర్ : భూమాతను నమ్మిన రైతుకు ప్రకృతి విపత్తులు శాపంగా మారాయి. వ్యవసాయంలో వరుస నష్టాలు కుంగదీస్తున్నాయి. వ్యవసాయం తర్వాత పాడిపరిశ్రమ ఆదుకుంటుందని అనుకున్న రైతన్నకు బలమైన నమ్మకం లేకుండాపోతోంది. ప్రభుత్వ తీరుతో పాడికి గడ్డురోజులు పొంచి ఉన్నాయి. 2004 తర్వాత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రైతులకు మేలు చేయాలని సంకల్పించి ముఖ్యమంత్రి, ప్రధాని పశుక్రాంతి పథకాన్ని ప్రవేశపెట్టి అర్హులైన వారికి రెండు పాడిపశువులను 50 శాతం సబ్సిడీతో అందజేశారు. అన్నదాతలు మరిన్ని పాడిపశువులను కొనుగోలు చేసి పాడిపరిశ్రమను విస్తృత పరచుకుని లబ్ధిపొందారు. అప్పట్లో ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా పశుసంవర్ధకశాఖతో కలసి మంచి కార్యక్రమాలు చేపట్టి పాడి రైతులకు వెన్నుదన్నుగా నిలిచింది. కేవలం పాడిపరిశ్రమతోనే కుటుంబాలను పోషించుకుంటున్న చాలామంది రైతులు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. వైఎస్ మరణం అనంతరం వచ్చిన ప్రభుత్వాలు ఏపీడీడీసీని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాయి. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఏపీడీడీసీని మరింత కుంగదీస్తోంది. సంస్థ కష్టాల్లో ఉందన్న ఇంగిత జ్ఞానం కూడా ప్రభుత్వానికి లేకుండా పోయిందని రైతులు, రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో ఉండిపోయిన సంస్థను ఏపీకి తెచ్చుకుని జవసత్వాలు పోస్తామన్న సదభిప్రాయం ప్రభుత్వానికి ఎందుకు కలుగలేదని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. జిల్లాలోని పాడిపశువుల నుంచి వచ్చే వేలాది లీటర్ల పాలు రైతులు ఎంతమందికి పోసినా ఇంకా మిగులే ఉంటాయని, అవి రోజుల తరబడి నిల్వ చేసేదానికి కూడా వీలుండదని, మరి వాటిని ఏం చేయాలో దిక్కుతోచక అవస్థలు పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని సంఘాల సభ్యులు అంటున్నారు. జిల్లాలో బల్క్‌మిల్క్ సెంటర్లు ఇవే: జిల్లాలో కొండాపురం, చక్రాయపేట, ప్రొద్దుటూరు, రాజంపేట, పులివెందుల, భాకరాపేట, రాయచోటి, తిమ్మంపల్లె,రాజుపాలెం, మైదుకూరు, వేంపల్లె, సింహాద్రిపురం, ఒంటిమిట్ట, రామాపురం, పెనగలూరు, రైల్వేకోడూరు కేంద్రాలను పాలసేకరణ కోసం డీఆర్డీఏ, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసింది. అయితే ఇందులో పాలసేకరణ డీఆర్డీఏలోని మహిళా సంఘాలు చేపట్టగా ఏపీడీడీసీ పాలబిల్లులు, అవసరమైన సామగ్రి సమకూర్చింది. ఏ సమస్య తలెత్తినా ఏపీడీడీసీ పరిష్కరిస్తూ ఉండేది. పాలసేకరణలో ఏవైనా లోపాలు ఉంటే డీఆర్డీఏ అధికారులు తక్షణమే సవరించేవారు. మహిళా సంఘాలు కూడా పాలసేకరణలో చాలా జాగ్రత్తలు పాటించి సంస్థకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూసుకునేవారు. మూతపడిన బీఎంసీలు ఇవే: జిల్లాలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన బల్క్ మిల్క్ సెంటర్లు(బీఎంసీలు) కొన్ని వెలవెలబోతున్నాయి. లీటర్ల కొద్దీ వచ్చే పాలను మేము కొలవలేకుపోతున్నామని నిర్వాహకులు చెబుతుంటే పాలకులు చాలా సంతోషించి రైతులకు మేలు జరుగుతుందని విశ్వసించారు. ఒక గేదెతో పోషణ ప్రారంభించిన రైతులు ఎంతో లబ్ధిపొందారు. ఇçప్పుడు ఆ పరిస్థితుల పూర్తిగా మారిపోయాయి. పాల సేకరణ కేంద్రాల నిర్వహకులు పాలు పట్టలేం..మేం మూతవేస్తున్నామని చెప్పి చాలా కేంద్రాలను మూసేశారు. జిల్లాలో 16 బీఎంసీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో రైల్వేకోడూరు, రాజంపేట, వేంపల్లె, మైదుకూరు,సింహాద్రిపురం రాజుపాలెం, ఒంటిమిట్ట, కొండాపురం కేంద్రాలు మూతపడ్డాయి. రాయచోటి సమీపంలోని బీఎంసీలో ఉదయం పాలసేకరణ చేపట్టి సాయంత్రం పూట చేపట్టడం లేదని పాడిరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొన్ని కేంద్రాలు రేపో, మాపో మూసివేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పాల సేకరణ చేయకపోవడం, బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం, నిర్వహణ ఖర్చులు భరించకపోవడం, పాలలో వెన్న తీసే యంత్రాల రిపేర్లు చేపట్టకపోవడమే దీనికి కారణం. ప్రభుత్వ తీరువల్ల సంస్థ కోలుకోలేని పరిస్థితికి చేరుకుంది. పాలసేకరణ పూర్తిగా ఆగిపోతున్న విషయం ప్రభుత్వానికి తెలియనిది కాదని పాడిరైతులు అంటున్నారు. రెండంకెల అభివృద్ధి ఎలా సాధ్యం: రాష్ట్రంలో వ్యవసాయం రెండంకెల అభివృద్ధి సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వ్యవసాయశాఖ మంత్రి పుల్లారావు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల సమావేశాలు, బహిరంగ సభల్లో ప్రగల్భాలు పలుకుతుంటారని, మరి పాడిపరిశ్రమ కోలుకోలేని విధంగా దెబ్బతింటుంటే ఎందుకు ఆలోచించలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. రెండంకెల అభివృద్ధి చేయాలన్నప్పుడు ఎక్కడ లోపం ఉందో గుర్తించి వాటిని సవరించాలనే విషయం తెలీదా? అని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వానికి నివేదించాం: జిల్లాలో వివిధ కారణాలతో బీఎంసీలు మూతపడిన మాట వాస్తమే. అయితే వాటిని తెరిపించాలని ప్రభుత్వానికి నివేదికలు పంపాం. సంస్థ చాలా ఇబ్బందులు పడుతున్న మాట వాస్తమే. తెలంగాణలో ఉన్న సంస్థకు ఏపీలో ప్రత్యామ్నాయం ఆలోచించాలని ఎండీకి వివరించాం. --- శ్రీనివాసులు, జిల్లా డిప్యూటీ డైరక్టర్, ఏపీడీడీసీ