
సాక్షి, గంగావతి (కర్ణాటక): కొప్పళ నగరసభలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న చైత్ర(28) సిరుగుప్పలోని స్వగృహంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆమెకు కొన్నేళ్ల క్రితం దంత వైద్యునితో వివాహమైంది. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆమె ఆత్మహత్యకు దారితీసిన కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.
తల్లి లేని జీవితం వద్దని ...
శివమొగ్గ: రెండు నెలల క్రితం తల్లి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె మరణాన్ని తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకాలోని మైదూళలు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సూరజ్ (28) తల్లి మరణంతో మనోవేదనలో ఉంటున్నాడు. సోమవారం ఉదయం తన తోటకు వెళ్లాడు. అక్కడే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. భద్రావతి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment