రాంగ్‌ కాల్‌ తెచ్చిన తంటా | Wrong call in dental doctor | Sakshi
Sakshi News home page

రాంగ్‌ కాల్‌ తెచ్చిన తంటా

Published Mon, Feb 12 2018 12:10 PM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM

Wrong call in dental doctor - Sakshi

కడప అర్బన్‌ : కడప నగరంలోని మారుతినగర్‌కు చెందిన ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌కు ఆదివారం రాంగ్‌ నెంబరుతోకాల్‌ వచ్చింది. ఆ సమయంలో ఎవరు మాట్లాడుతున్నారని  సదరు వ్యక్తి అడిగితే, తాను దంత వైద్యకళాశాల విద్యార్థి అని చెప్పాడు. పొరపాటున వచ్చిందని అనడంతో సరిపెట్టుకోకుండా పరస్పరం ఫోన్‌లోనే వాగ్వివాదం జరిగింది. సవాళ్లు విసురుకున్నారు. దీంతో మారుతినగర్‌కు చెందిన సదరు వ్యక్తి పది మంది గుర్తు తెలియని వారిని వెంట తీసుకెళ్లి దంత వైద్య కళాశాల హాస్టల్‌ వద్దకు హుటాహుటిన వెళ్లాడు. ఆ సమయంలో విద్యార్థులు వీరిని చూసి పరారయ్యారు. అంతేకాకుండా పోలీసులకు సమాచారం ఇచ్చారు. రిమ్స్‌ ఎస్‌ఐ కుళాయప్ప కడప నగరం నుంచి దంత వైద్య కళాశాల హాస్టల్‌ వద్దకు మనుషులతో వచ్చినవారిలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎస్‌ఐని ఈ సంఘటనపై వివరణ కోరగా ఘర్షణ పడేందుకు వచ్చారని ప్రాథమికంగా తెలిసిందని, విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement