wrong call
-
నన్ను ప్రశంసించడానికి కాల్ చేస్తే.. రాంగ్ కాల్ అని పొరబడ్డా : సుధామూర్తి
‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత, రచయిత, రాజ్యసభ ఎంపీ, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య సుధామూర్తి తాజాగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. మాజీ రాష్ట్రపతి దివంగత డా. ఏపీజే అబ్దుల్ కలాం నుంచి తనకు పోన్ వస్తే రాంగ్ కాల్ అంటూ ఆపరేటర్‌కి చెప్పిన సంగతిని ప్రస్తావించారు. నిజానికి తన భర్త నారాయణ మూర్తికి ఉద్దేశించిన కాల్ ఏమో అనుకుని పొరపాటు పడ్డానని చెప్పారు. ఆ తరువాత విషయం తెలిసి చాలా సంతోషించానని ఆమె పేర్కొన్నారు.Once I received a call from Mr. Abdul Kalam, who told me that he reads my columns and enjoys them. pic.twitter.com/SWEQ6zfeu4— Smt. Sudha Murty (@SmtSudhaMurty) June 25, 2024 విషయం ఏమిటంటే..ఎక్స్ వేదికగా సుధామూర్తి దీనికి సంబంధించిన ఒక ఆడియో క్లిప్‌ను షేర్ చేశారు. ఇందులో అబ్దుల్ కలామ్ నుంచి తనకు ఫోన్ వచ్చినప్పుడు ఏం జరిగిందో వివరించారు. ‘ఐటీ డివైడ్' పేరుతో సుధామూర్తి ఒక కాలమ్ నడిపేవారు. దీన్ని అబ్దుల్ కలాం క్రమం తప్పకుండా చదివేవారట. అంతేకాదు ఈ రచనను బాగా ఆస్వాదించేవారు కూడా. ఇదే విషయాన్ని స్వయంగా ఆమెకు చెప్పేందుకు అబ్దుల్ కలాం ఫోన్ చేశారు. అయితే రాష్ట్రపతి భవన్ నుంచి తనకు ఫోన్ కాల్ వస్తే ‘రాంగ్ కాల్’ అని (ఆపరేటర్‌కి) తాను సమాధానం ఇచ్చానని సుధామూర్తి వెల్లడించారు. తన భర్త నారాయణమూర్తికి చేయబోయి తనకు చేశారేమో అనుకున్నానని, అందుకే అలా చెప్పినట్టు ఆమె పేర్కొన్నారు. అయితే ‘‘లేదు లేదు.. ఆయన (అబ్దుల్ కలాం) ప్రత్యేకంగా మీ పేరే చెప్పారు’ అని ఆపరేటర్ చెప్పడంతో ఆశ్చర్యపోవడం ఆమె వంతైంది. తాను కాలమ్‌ని చదివి ప్రశంసించడానికి కలాం ఫోన్ చేశారని తెలిసి చాలా సంతోషించాననీ, చాలా బావుందంటూ మెచ్చుకున్నారని సుధా మూర్తి ప్రస్తావించారు. ఈ సందర్బంగా కలాం నుంచి పౌరపురస్కారం అందుకుంటున్న ఫోటోని కూడా ఆమె పోస్ట్ చేశారు. కాగా రచయితగా పరోపకారిగా సుధామూర్తి అందరికీ సుపరిచితమే. బాల సాహిత్యంపై పలు పుస్తకాలు రాశారు. కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో ఆమె సాహిత్యానికి పలు అవార్డులు కూడా దక్కాయి. 73 ఏళ్ళ వయసులో సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం లభించింది. ఇంకా అత్యున్నత పౌరపురస్కారాలైన పద్మశ్రీ (2006), పద్మ భూషణ్ (2023) కూడా ఆమెను వరించాయి. కాగా ఈ ఏడాది ప్రారంభంలో సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. -
రాంగ్‌కాల్ పరిచయం.. బీటెక్ యువతి పాలిట శాపం
నెల్లూరు(క్రైమ్) : రాంగ్‌కాల్ పరిచయం ఓ యువతి పాలిట శాపంగా మారింది. సేకరించిన సమాచారం మేరకు.. కావలి పట్టణానికి చెందిన ఓ యువతి బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. యువతి సెల్‌ఫోన్‌కు కొంతకాలం కిందట ఓ నంబర్ నుంచి కాల్ వచ్చింది. వెంటనే సారీ.. రాంగ్ నంబర్ అంటూ యువకుడు మాటలు కలిపాడు. వారి పరిచయం సాన్నిహిత్యానికి దారితీసింది. రెండురోజుల కిందట ఇద్దరూ నెల్లూరులో కలుసుకున్నారు. అనంతరం ఓ లాడ్జికి వెళ్లారు. ఈ క్రమంలో యువకుడు ఆమె సెల్‌ఫోన్‌లోని వీడియోలు, ఫొటోలు చూసి ఎవరివని ప్రశ్నించాడు. దీంతో వారి మధ్య మాటామాటా పెరిగింది. కోపోద్రిక్తుడైన యువకుడు ఆమెపై దాడిచేసి సెల్‌ఫోన్‌తో పరారయ్యాడు. దీంతో యువతి అతని కోసం గాలించింది. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత యువతి, పరారైన యువకుని ఫోన్ నంబర్ల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (నీ న్యూడ్ వీడియో, ఫొటోలను బయట పెడతా.. సీఐ వేధింపులు) -
వీడిన వివాహిత హత్య మిస్టరీ
కూడేరు: శివరాంపేట వద్ద జాతీయరహదారి సమీపాన జరిగిన వివాహిత హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. కాల్ డేటా ఆధారంగా నిందితుడిని గుర్తించారు. రాంగ్ కాల్ ఆధారంగా పరిచయమైన వ్యక్తే ఆమెను పథకం ప్రకారం హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ ప్రసాద్‌రావు మంగళవారం కూడేరులో విలేకరులకు వెల్లడించారు. అనంతపురానికి చెందిన విజయలక్ష్మి (22) అనే వివాహిత సెల్‌కు నెలన్నర కిందట కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన రుద్రేశ్ నుంచి రాంగ్ కాల్ వచ్చింది. బ్రేకప్ కావాల్సిన కాల్‌ను వారు కొనసాగించడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. తరచూ వీరు ఫోన్ చేసుకుంటూ మాట్లాడుకునే వారు. విజయలక్ష్మి నుంచి అతడికి వాట్సప్ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ పెరిగాయి. ఈ క్రమంలో రుద్రేశ్ భార్యకు అనుమానం వచ్చింది. తరచూ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుండటం గమనించి ఆరా తీసింది. ఈ విషయమై ఇద్దరి మధ్య పదేపదే గొడవ జరిగేది. చివరకు విడిపోయే పరిస్థితికి దారి తీయడంతో రుద్రేశ్ ఆలోచనలో పడ్డాడు. ఇంతటి వివాదానికి కారణమైన విజయలక్ష్మిని దూరంగా ఉంచాలని అనుకున్నాడు. అది సాధ్యం కాకపోవడంతో ఎలాగైనా అంతమొందించాలనుకున్నాడు. ఇందుకు పక్కా ప్రణాళిక రచించాడు. ఈ నెల ఐదో తేదీన విజయలక్ష్మిని అనంతపురం నుంచి తన ద్విచక్రవాహనంలో కూడేరు మండలం శివరాంపేట వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ జాతీయరహదారి సమీపాన గుట్ట వద్ద మాటల్లో పెట్టి ఆమె గొంతుకు చున్నీతో బిగించి ఊపిరాడకుండా చేసి ప్రాణం తీశాడు. అనంతరం ఆమెను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు బండరాయిని ముఖం మీద వేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. హత్య ఘటన ఏడో తేదీ వెలుగు చూసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. కాల్ డేటాను పరిశీలించగా.. రుద్రేశ్ అనే వ్యక్తికి ఎక్కువగా ఫోన్ చేసినట్లు బయటపడింది. ఆ వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు. -
పెళ్లికి నిరాకరించాడని..
మారేడుపల్లి : ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేయడమేగాక పెళ్లికి నిరాకరించిన ప్రియుడి ఇంటిముందు ఓ యువతి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టింది. వివరాల్లోకి వెళితే... కొండాపూర్‌కు చెందిన శిరీషారాణి (24) ఎంబీఏ పూర్తిచేసింది. గత ఏడాది వాట్సాప్‌లో మారేడుపల్లి శేషాచలం కాలనీకి చెందిన నక్కా నితిన్‌యాదవ్ ఫోన్‌కు ఆమె ఫోన్ నుంచి రాంగ్‌కాల్ వెళ్లింది. ఇలా ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి తిరిగారు. మూడు నెలల క్రితం ఆమె పెళ్లి ప్రస్తావన తేగా నితిన్‌యాదవ్ అందుకు నిరాకరించాడు. దీంతో ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి మారేడుపల్లిలోని నితిన్‌యాదవ్ ఇంటికి వచ్చి పెళ్లి చేసుకోవాలని కోరారు. అయినా నితిన్‌యాదవ్, అతని కుటుంబసభ్యులు పెళ్లికి నిరాకరించడంతో మార్చి 14న మారేడుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించినా అతనిలో మార్పురాకపోవడంతో గత నెల 15న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై బయటికి వచ్చిన నితిన్‌తో తనకు వివాహం జరిపించాలని కోరుతూ బాధితురాలి బుధవారం రాత్రి నుంచి అతని ఇంటి వద్ద ఆమరణ నిరాహారదీక్షకు పూనుకుంది. గురువారం పలు మహిళాసంఘాల నేతలు ఆమెకు సంఘీభావం తెలిపారు. నితిన్‌యాదవ్ ఇంటికి తాళంవేసి ఉండడంతో ఇంటివద్దనే టెంటువేసుకుని దీక్షను కొనసాగిస్తుంది. ఎన్నిరోజులైనా దీక్షను కొనసాగిస్తానని, అతనితోనే జీవితాంతం కలిసి ఉంటానని ఆమె పేర్కొంటుంది. -
రాంగ్ కాల్ తెచ్చిన తంటా
కడప అర్బన్ : కడప నగరంలోని మారుతినగర్‌కు చెందిన ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌కు ఆదివారం రాంగ్ నెంబరుతోకాల్ వచ్చింది. ఆ సమయంలో ఎవరు మాట్లాడుతున్నారని సదరు వ్యక్తి అడిగితే, తాను దంత వైద్యకళాశాల విద్యార్థి అని చెప్పాడు. పొరపాటున వచ్చిందని అనడంతో సరిపెట్టుకోకుండా పరస్పరం ఫోన్లోనే వాగ్వివాదం జరిగింది. సవాళ్లు విసురుకున్నారు. దీంతో మారుతినగర్‌కు చెందిన సదరు వ్యక్తి పది మంది గుర్తు తెలియని వారిని వెంట తీసుకెళ్లి దంత వైద్య కళాశాల హాస్టల్ వద్దకు హుటాహుటిన వెళ్లాడు. ఆ సమయంలో విద్యార్థులు వీరిని చూసి పరారయ్యారు. అంతేకాకుండా పోలీసులకు సమాచారం ఇచ్చారు. రిమ్స్ ఎస్ఐ కుళాయప్ప కడప నగరం నుంచి దంత వైద్య కళాశాల హాస్టల్ వద్దకు మనుషులతో వచ్చినవారిలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎస్ఐని ఈ సంఘటనపై వివరణ కోరగా ఘర్షణ పడేందుకు వచ్చారని ప్రాథమికంగా తెలిసిందని, విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
ప్రియురాలి ఇంటికే కన్నం వేశాడు
చిలకలగూడ: ప్రియురాలి ఇంట్లో స్నేహితులతో కలిసి చోరీ చేసి.. చివరకు పోలీసులకు చిక్కాడో దొంగ ప్రియుడు. చిలకలగూడ పోలీసుల కథనం ప్రకారం.. పార్శిగుట్ట సంజీవపురానికి చెందిన వితంతువు ఇన్‌కమ్‌ట్యాక్స్ కార్యాలయంలో స్వీపర్. ఈమె మూడో కుమార్తె డిగ్రీ చదువుతోంది. ఈనెల 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు గుర్తుతెలియని దుండగులు వీరింట్లో రూ.లక్ష నగదు, 8 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. పోలీసుల దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టుచేశారు. జరిగిన కథ ఇదీ.. ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం రుద్రంపూర్ గ్రామానికి చెందిన ముజీబ్ (22), శివ (23), నరేష్ (22)లు బీటెక్ పూర్తిచేసి, ఉద్యోగాన్వేషణలో నగరానికి వచ్చారు. చోరీ జరిగిన ఇంటి యజమానురాలు మూడో కుమార్తె ఫోన్‌కు వచ్చిన రాంగ్‌కాల్ ద్వారా ముజీబ్ ఆమెకు పరిచయం అయ్యాడు. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆ యువతి ముజీబ్‌ను తన ఇంటికి పిలిచింది. పెళ్లి చేసుకుందాం.. మరి ఎలా జీవించేది అని ముజీబ్ అనడంతో ఆమె తమ ఇంట్లో ఉన్న నగలు, నగదు చూపించింది. వాటిని చూసిన ముజీబ్ తమ ఊరుకే చెందిన శివ, నరేష్‌లను కలిసి చోరీ పథకం వేశాడు. ఈనెల ఏడో తేదీన శివ, నరేష్‌లు యువతి ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని నగలు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సికింద్రాబాద్ జనరల్ బజార్లో నగలు విక్రయించేందుకు వచ్చిన ముజీబ్,శివ, నరేష్‌లను అదుపులోకి తీసుకొని వచారించగా.. అసలు విషయం బయటపెట్టారు. రూ. లక్ష నగదు, 8 తులాల నగలు స్వాధీనం చేసుకుని ముగ్గురినీ రిమాండ్‌కు తరలించారు. -
రాంగ్ కాల్‌తో నయవంచన
సెల్‌ఫోన్ రాంగ్ కాల్‌తో ఓ బాలికకు పరిచమయ్యాడు. ఆ పరిచయాన్ని ప్రేమ పేరుతో ఆ బాలికను ఏ మార్చారు. రాత్రికి రాత్రే ఆ బాలికను మదనపల్లికి తీసుకెళ్లి అక్కడ ఆరు నెలలుగా నిర్భందించాడు. అతడు, స్నేహితులు ఐదుగురు కలిసి సామూహికంగా అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు గూడూరు రూరల్ మండలం చెన్నూరు బీసీ కాలనీకి చెందిన బాలిక (16)కు రాంగ్ కాల్ ద్వా రా మదనపల్లి సమీపలోని ఎగువ కమ్మపల్లికి చెందిన హరిప్రసాద్‌నాయుడుతో పరిచయం ఏర్పడింది. దీంతో వారిద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవారు. హరిప్రసాద్‌నాయుడు ప్రేమిస్తున్నానంటూ ఆ బాలికకు మాయమాటలు చెప్పి తనతో వచ్చేయాలని చెప్పా డు. దీనికి ఆకర్షితురాలైన ఆ బాలిక అందుకు ఒప్పుకుంది. దీంతో హరిప్రసాద్‌నాయుడు తన స్నేహితులు దయాళ ఆంజనేయుడు అలియాస్ అంజి, పుట్టా రామచంద్రనాయుడు, రామరెడ్డయ్యనాయుడు, సురేంద్రనాయక్‌తో కలిసి గతేడాది ఆగస్టు 9వ తేదీన వాహనంలో చెన్నూరుకు వచ్చా రు. రాత్రి భోజనాలు చేశాక, కుటుంబ సభ్యులు నిద్రకు ఉపక్రమించాక ఆ బాలిక వారి తో కలిసి మదనపల్లికి వెళ్లిపోయింది. ఉదయం నిద్ర లేచి చూసేసరికి కుమార్తె ఇంట్లో కనిపించకపోవడంతో ఎక్కడకు వెళ్లిందోనని బంధువుల గ్రామాలకు వెళ్లి విచారించారు. ఎక్కడా బాలిక ఆచూకీ తెలియకపోవడంతో గతేడాది డిసెంబర్ 26న రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు ఆ బాలికను తీసుకెళ్లిన హరిప్రసాద్‌నాయుడు, అతని స్నేహితులు మదనపల్లి సమీపంలోని నీరుగట్టువారిపల్లిలో ఉ న్న పొలాల్లో పాడుబడిన ఇంట్లో నిర్బంధించారు. హరిప్రసాద్‌నాయుడు తో పాటు అతని స్నేహితులు అంజినాయుడు, రామచంద్రనాయుడు, శ్రీరాములరెడ్డయ్య నాయుడు, సురేంద్రనాయక్ నిత్యం ఆ బాలికపై అత్యాచారం చేస్తూ వచ్చారు. ఈ విషయాన్ని పసిగట్టిన అదే గ్రామానికి చెందిన మునిస్వామినాయక్ పోలీసులకు చెప్పేస్తానంటూ వారిని బ్లాక్మెయిల్ చేసి వారి తో పాటు అతను కూడా ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడేవాడు. అయితే వారు తరచూ మకాంను మారుస్తూ వచ్చారు. ఈ క్రమంలో వారు పూటుగా మద్యం సేవించి ఉండగా ఆ బాలిక వారి సెల్‌ఫోన్ నుంచి తన సోదరి సెల్‌కు కాల్ చేసి తను నిర్బంధానికి గురైనట్లు చెప్పింది. దీంతో బాధితులు ఆ సెల్‌ఫోన్ నంబరును గూడూరు రూరల్ పోలీసులకు అందజేశారు. పోలీసులు కాల్‌లిస్టు ఆధారంగా ఆ ఫోన్ నంబరు మదనపల్లి ప్రాంతానికి చెందిందని గుర్తించారు. ఈ మేరకు ఎస్సై ఎస్కే మహ్మద్ హనీఫ్, హెడ్ కానిస్టేబుల్ తిరుపాలయ్య, కానిస్టేబుళ్లు పీఎం రాజ, నాగరాజు, బాలిక సోదరుడుని వెంట బెట్టుకుని మదనపల్లిలోని రామారావుకాలనీకి చెందిన ఓరుగంటి సునీల్ ఇంట్లో ఉన్న నిందితులను అదుపులోలకి తీసుకున్నారు. నిర్భయ కేసు నమోదు బాలికను నిర్బంధించి అత్యాచారానికి పాల్పడిన హరిప్రసాద్‌నాయుడు, అంజినాయుడు, రాంచంద్రనాయుడు, శ్రీరామరెడ్డయ్య నాయుడు, సురేంద్రనాయక్‌తో పాటు మునుస్వామనాయక్‌పై నిర్భయ కేసును నమోదు చేసినట్లు ఎస్సై హనీఫ్ తెలిపారు. -
బాలికపై నాలుగు నెలలపాటు సామూహిక అత్యాచారం