రాంగ్ కాల్తో నయవంచన | Story on wrong call change her life | Sakshi
Sakshi News home page

రాంగ్ కాల్తో నయవంచన

Published Wed, Mar 12 2014 3:43 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM

రాంగ్ కాల్తో నయవంచన - Sakshi

రాంగ్ కాల్తో నయవంచన

సెల్‌ఫోన్ రాంగ్‌ కాల్‌తో ఓ బాలికకు పరిచమయ్యాడు. ఆ పరిచయాన్ని ప్రేమ పేరుతో ఆ బాలికను ఏ మార్చారు. రాత్రికి రాత్రే ఆ బాలికను మదనపల్లికి తీసుకెళ్లి అక్కడ ఆరు నెలలుగా నిర్భందించాడు. అతడు, స్నేహితులు ఐదుగురు కలిసి సామూహికంగా అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

పోలీసుల కథనం మేరకు గూడూరు రూరల్ మండలం చెన్నూరు బీసీ కాలనీకి చెందిన బాలిక (16)కు రాంగ్ కాల్ ద్వా రా మదనపల్లి సమీపలోని ఎగువ కమ్మపల్లికి చెందిన హరిప్రసాద్‌నాయుడుతో పరిచయం ఏర్పడింది. దీంతో వారిద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఉండేవారు. హరిప్రసాద్‌నాయుడు ప్రేమిస్తున్నానంటూ ఆ బాలికకు మాయమాటలు చెప్పి తనతో వచ్చేయాలని చెప్పా డు. దీనికి ఆకర్షితురాలైన ఆ బాలిక అందుకు ఒప్పుకుంది.

దీంతో హరిప్రసాద్‌నాయుడు తన స్నేహితులు దయాళ ఆంజనేయుడు అలియాస్ అంజి, పుట్టా రామచంద్రనాయుడు, రామరెడ్డయ్యనాయుడు, సురేంద్రనాయక్‌తో కలిసి గతేడాది ఆగస్టు 9వ తేదీన వాహనంలో చెన్నూరుకు వచ్చా రు. రాత్రి భోజనాలు చేశాక, కుటుంబ సభ్యులు నిద్రకు ఉపక్రమించాక ఆ బాలిక వారి తో కలిసి మదనపల్లికి వెళ్లిపోయింది. ఉదయం నిద్ర లేచి చూసేసరికి కుమార్తె ఇంట్లో కనిపించకపోవడంతో ఎక్కడకు వెళ్లిందోనని బంధువుల గ్రామాలకు వెళ్లి విచారించారు. ఎక్కడా బాలిక ఆచూకీ తెలియకపోవడంతో గతేడాది డిసెంబర్ 26న రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

ఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు

ఆ బాలికను తీసుకెళ్లిన హరిప్రసాద్‌నాయుడు, అతని స్నేహితులు మదనపల్లి సమీపంలోని నీరుగట్టువారిపల్లిలో ఉ న్న పొలాల్లో పాడుబడిన ఇంట్లో నిర్బంధించారు. హరిప్రసాద్‌నాయుడు తో పాటు అతని స్నేహితులు అంజినాయుడు, రామచంద్రనాయుడు, శ్రీరాములరెడ్డయ్య నాయుడు, సురేంద్రనాయక్ నిత్యం ఆ బాలికపై అత్యాచారం చేస్తూ వచ్చారు. ఈ విషయాన్ని పసిగట్టిన అదే గ్రామానికి చెందిన మునిస్వామినాయక్ పోలీసులకు చెప్పేస్తానంటూ వారిని బ్లాక్‌మెయిల్ చేసి వారి తో పాటు అతను కూడా ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడేవాడు.

అయితే వారు తరచూ మకాంను మారుస్తూ వచ్చారు. ఈ క్రమంలో వారు పూటుగా మద్యం సేవించి ఉండగా ఆ బాలిక వారి సెల్‌ఫోన్ నుంచి తన సోదరి సెల్‌కు కాల్ చేసి తను నిర్బంధానికి గురైనట్లు చెప్పింది. దీంతో బాధితులు ఆ సెల్‌ఫోన్ నంబరును గూడూరు రూరల్ పోలీసులకు అందజేశారు. పోలీసులు కాల్‌లిస్టు ఆధారంగా ఆ ఫోన్ నంబరు మదనపల్లి ప్రాంతానికి చెందిందని గుర్తించారు. ఈ మేరకు ఎస్సై ఎస్‌కే మహ్మద్ హనీఫ్, హెడ్ కానిస్టేబుల్ తిరుపాలయ్య, కానిస్టేబుళ్లు పీఎం రాజ, నాగరాజు, బాలిక సోదరుడుని వెంట బెట్టుకుని మదనపల్లిలోని రామారావుకాలనీకి చెందిన ఓరుగంటి సునీల్ ఇంట్లో ఉన్న నిందితులను అదుపులోలకి తీసుకున్నారు.

 నిర్భయ కేసు నమోదు

బాలికను నిర్బంధించి అత్యాచారానికి పాల్పడిన హరిప్రసాద్‌నాయుడు, అంజినాయుడు, రాంచంద్రనాయుడు, శ్రీరామరెడ్డయ్య నాయుడు, సురేంద్రనాయక్‌తో పాటు మునుస్వామనాయక్‌పై నిర్భయ కేసును నమోదు చేసినట్లు ఎస్సై హనీఫ్ తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement