girl raped
-
బాలికపై హత్యాచారం కేసులో... 61 రోజుల్లోనే మరణశిక్ష
కోల్‌కతా: ఈ ఏడాది అక్టోబర్‌లో 9 ఏళ్ల బాలికపై అత్యాచారంచేసి హత్యకు పాల్పడిన 19 ఏళ్ల వ్యక్తికి బెంగాల్‌లోని కోర్టు మరణ శిక్ష విధించింది. నేరం చోటుచేసుకున్న నాటి నుంచి కేవలం 61 రోజుల్లోనే విచారణ పూర్తవడం రికార్డు సృష్టించింది. దక్షిణ 24 పరగణాల జిల్లా జయ్‌నగర్‌లో అక్టోబర్ 4న ట్యూషన్ నుంచి వస్తున్న 9 ఏళ్ల బాలికను ముస్తాకిన్ సర్దార్ నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై చంపేశాడు. అప్పటికే ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రెయినీ వైద్యురాలి హత్యాచార ఘటనతో రాష్ట్రం అట్టుడుకుతోంది. దాంతో బాలిక హత్యాచార కేసులో పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంతో నిందితుడిని కేవలం రెండున్నర గంటల్లోనే అరెస్ట్ చేశారు. అతడిచ్చిన వివరాలతో బాలిక మృతదేహాన్ని అదే రోజు రాత్రి స్వాధీనం చేసుకున్నారు. మిగతా ఆధారాలతో 25 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి బారుయిపూర్ పోక్సో కోర్టులో అక్టోబర్ 30న చార్జిషీట్ వేశారు. కోర్టు విచారణ నవంబర్ 4న మొదలై 26న పూర్తయింది. మొత్తం 36 మంది సాక్షులను విచారించారు. దోషి ముస్తాకిన్ సర్దార్కు మరణ శిక్ష విధిస్తూ శుక్రవారం జస్టిస్ సుబ్రతా చటర్జీ తీర్పు వెలువరించారు. రాష్ట్ర చరిత్రలోనే ఇదో రికార్డని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. పోలీసులు, న్యాయాధికారుల కృషిని ప్రశంసించారు. -
ఢిల్లీలో ప్రభుత్వాధికారి నిర్వాకం.. స్నేహితుడి కుమార్తెను..
న్యూఢిల్లీ: మహిళలు, పిల్లలను సంరక్షించాల్సిన బాధ్యత గల పదవిలో ఉండి పశువులా వ్యవహరించాడొక కామాంధుడు.ఢిల్లీ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఒక అధికారి తన స్నేహితుడి టీనేజీ కూతురిపై ఎన్నో నెలలుగా అత్యాచారం చేస్తూ చివరికి పట్టుబడ్డాడు. అతనికి సహకరించినందుకు ఆతడి భార్య పైన కూడా కేసు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. ఢిల్లీ ప్రభుత్వంలో మహిళా శిశు సంక్షేమాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న ఒక సీనియర్ అధికారి తన స్నేహితుడు 2020లో మరణించడంతో అతడి మైనర్ కుమార్తె(14)ను తన ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటి నుండి ఆ బాలిక వారితోనే కలిసి ఉంటోంది. ఈ వ్యవధిలో ప్రభుత్వాధికారి ఆ అమ్మాయిపై అనేక మార్లు అత్యాచారం చేసినట్లు మధ్యలో తాను గర్భం దాల్చగా అతడి భార్య, కుమారుడు కొన్ని మందులిచ్చి గర్భాన్ని తొలగించారని బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టీనేజీ అమ్మాయి ప్రస్తుతం చికిత్స తీసుకుంటోందని ఆమె నుండి ఇంకా స్టేట్మెంట్ తీసుకోవాల్సి ఉందని అన్నారు. ప్రభుత్వాధికారిపై పోక్సో చట్టం తోపాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, నిందితుడికి సహకరించినందుకు అధికారి భార్యపైన కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: ఐదేళ్ల బాలుడిపై అమానుషం.. ఎత్తి నేలకేసి కొట్టి.. -
దివ్యాంగురాలిపై లైంగిక దాడి, చూపు కోల్పోయిన బాలిక
బిహార్: దివ్యాంగురాలు అని కూడా చూడకుండా 15 ఏళ్ల బాలికపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను తీవ్రంగా గాయపర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన బిహార్‌లోని మధుబాన్ జిల్లాలో బుధవారం జరిగింది. మధుబాన్ జిల్లా ఎస్పీ సత్యప్రకాశ్ తెలిపిన వివరాల ప్రకారం.. హర్లకి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కౌవహ బర్హి గ్రామానికి చెందిన దివ్యాంగురాలైన (చెవిటి, మూగ) బాలిక (15) తన స్నేహితులతో కలిసి మేకల్ని తోలుకొని అటవీ ప్రాంతానికి వెళ్లింది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన ముగ్గురు వెంట పడి బాలికను లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. దాంతో తోటి బాలికలు వెంటనే బాధితురాలి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబసభ్యులు వెళ్లి చూసేసరికి ఆ బాలిక తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉంది. దుండగుల దాడిలో ఆ బాలిక కంటిచూపు కోల్పోయింది. బాధితురాలిని మధుబానీలోని సదర్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ పాశవిక దాడి ఘటనపై బిహార్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహిళా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఘటనను ఖండిస్తున్నాయి. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. -
రెండున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి
-
చిన్నారిపై బాలుడి అఘాయిత్యం
నెక్కొండ(నర్సంపేట) వరంగల్ : అభం, శుభం తెలియని ఓ చిన్నారిపై ఆటలాడిస్తానంటూ నమ్మబలికి ఓ బాలుడు అఘాయిత్యానికి ఒడిగట్టిన సంఘటన మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెక్కొండ మండలంలోని రెడ్లవాడ శివారు విద్యుత్ సబ్‌స్టేషన్ తండాకు చెందిన 16 ఏళ్ల బాలుడు అదే తండాకు చెందిన నాలుగేళ్ల చిన్నారి ఇంటికి తరచూ వస్తుంటారన్నారు. బాలిక తండ్రి బట్టల వ్యాపారం చేసేందుకు వెళ్లగా, ఆమె తల్లి వ్యవసాయ పనులకు వెళ్లింది. ఈ క్రమంలో ఈ నెల 17న ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలుడు వచ్చి తండా సమీపంలోని ఓ గుడి వద్దకు బాలికను తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపారు. అనంతరం ఇంటికి వచ్చిన తండ్రి ఏ డ్చుకుంటూ ఉన్న బాలికను గమనించి వ్యవసా య పనులకు పోయిన తల్లి దగ్గరకు తీసుకువెళ్లా డు. దీంతో కడుపు నొప్పిగా ఉందని చెప్పడంతో జరిగిన విషయాన్ని గమనించింది. పెద్ద మనుషులు జోక్యం చేసుకొని బాలుడి కుటుంబ సభ్యుల ను నిలదీశారు. పెద్ద మనుషుల సలహాతో సోమవారం చిన్నారి తల్లి సుజాత పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం వెలుగు చూసింది. దీంతో ఏసీపీ సునీతామోహన్ తండాకు చేరుకొని దర్యాప్తు చేసి, చిన్నారిని వైద్య పరీక్షలకు పంపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆరేళ్ల బాలికపై యువకుడి అత్యాచారం
తాళ్లపూడి: పశ్చిమగోదావరి జిల్లా పెద్దేవం గ్రామంలో ఆరేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తాళ్లపూడి ఎస్సై కె.అశోక్‌కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దేవం గ్రామానికి చెందిన 3వ తరగతి చదువుతున్న ఆరేళ్ల బాలికపై ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంగళవారం మధ్యాహ్నం ఎం.ఉదయ్‌కిరణ్ (20) అత్యాచారం చేశాడు. యువకుడిది బుట్టాయగూడెం కాగా అమ్మమ్మ గారింట్లో పెద్దేవం వచ్చి ఉంటున్నాడు. బాలిక ఇంటి సమీపంలోనే ఉదయ్‌కిరణ్ ఉంటున్నాడు. బాలిక తల్లి బయటకు వెళ్లిన సమయంలో బాలిక ఒంటరిగా ఉండడం చూసి ఈ దారుణానికి ఒడి గట్టాడు. తల్లి ఇంటికి వచ్చే సరికి బాలిక ఏడుస్తూ విషయం చెప్పింది. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. కొవ్వూరు డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కథువా కేసులో జమ్మూ పోలీస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల చిన్నారి అసిఫాపై లైంగిక దాడి, హత్యోదంతం క్రమంగా రాజకీయ, మత రంగు పులుముకోవడంపై జమ్మూ కాశ్మీర్ పోలీస్ చీఫ్ ఎస్పీ వైద్ ఆందోళన వ్యక్తం చేశారు. కథువా జిల్లాలోని ఓ గ్రామం నుంచి అసిఫాను కిడ్నాప్ చేసిన దుండగులు వారం రోజుల పాటు ఆమెకు నరకం చూపారు. మత్తుమందులిచ్చి సామూహిక లైంగిక దాడి జరిపి, రాళ్లతో కొట్టి దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ కేసు దర్యాప్తుపై వస్తున్న విమర్శలను రాష్ట్ర పోలీస్ చీఫ్ వైద్ తోసిపుచ్చారు. పోలీసు అధికారులు హిందువులుగానో..ముస్లింలుగానో పనిచేయరని..వృత్తిపరంగా విధులు నిర్వర్తిస్తారని ఆయన స్పష్టం చేశారు. స్ధానిక పోలీసులపై తమకు విశ్వాసం లేదని, సీబీఐ దర్యాప్తును కోరుతూ పలువురు నేతలు, జమ్మూకాశ్మీర్ బార్ అసోసియేషన్ చేసిన డిమాండ్లపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో స్ధానిక పోలీసులు సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో ముఫ్తీ మెహబూబా ప్రభుత్వం క్రైమ్ బ్రాంచ్‌కు కేసును అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే హిందూ ప్రాబల్య కథువా ప్రాంతంలో ముస్లింలను భయభ్రాంతులను చేసేందుకు ఈ ఘాతుకం జరిగిందని కొన్ని వర్గాలు ఆరోపిస్తుండగా, ఈ ఘటనలో అమాయకులను లక్ష్యంగా చేసుకుని అరెస్ట్‌లు చేయరాదని బీజేపీ నేతలు కోరుతున్నారు. పోలీసులపై స్ధానిక రాజకీయ నేతలు విమర్శలతో విరుచుకుపడుతుండగా, జమ్మూ సర్కార్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు బీజేపీ మంత్రులు వారికి వత్తాసు పలుకుతున్నారు. మరోవైపు ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ఓ వర్గాన్నే టార్గెట్ చేస్తున్నారని ముస్లింలు పోలీసులపై దాడులకు తెగబడుతుండటంతో పోలీస్ ఉన్నతాధికారి వైద్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. పోలీసు అధికారులకు మతంతో సంబంధం ఉండదని, వృత్తిపరమైన బాధ్యతలను వారు నిర్వర్తిస్తారని ఆయన చెప్పుకొచ్చారు. విచారణ బృందానికి కాశ్మీరీ పండిట్ నేతృత్వం వహిస్తుంటే కాశ్మీరీ ముస్లిం అధికారి సభ్యులుగా ఉన్నారని, విచారణలో సిక్కు వర్గానికి చెందిన వారిని ప్రాసిక్యూటర్లుగా నియమించాలని నిష్పాక్షిక విచారణ కోసం పోలీసులు ప్రభుత్వాన్ని కోరారు. దేశాన్ని నివ్వెరపరిచిన మైనర్ బాలికపై లైంగిక దాడి, హత్య కేసును క్రైమ్ బ్రాంచ్, ప్రత్యేక బృందాలు సమర్ధంగా చేపడుతున్నాయని, కేసులో ప్రమేయం ఉన్న సహచర పోలీసులనూ విడిచిపెట్టలేదని ఎస్పీ వైద్ చెప్పారు. సాక్ష్యాలను తారుమారు చేసి కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించిన ఇద్దరు ప్రత్యేక పోలీసు అధికారులను అరెస్ట్ చేశామని తెలిపారు. జమ్మూ బార్ అసోసియేషన్‌తో పాటు రాజకీయ పార్టీల నేతలు సీబీఐ విచారణ కోరడాన్ని ప్రస్తావిస్తూ ఎన్నో కేసులను సమర్థవంతంగా చేపట్టిన జమ్మూ పోలీసులపై వారికి విశ్వాసం లేదనడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. -
నా తండ్రిని అడ్డుపెట్టి అఘాయిత్యానికి పాల్పడ్డాడు
సాక్షి, న్యూఢిల్లీ : తండ్రి అనారోగ్యాన్ని అడ్డుపెట్టుకుని కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. పైగా ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయాక వారిని ఆదుకుంటానని నమ్మబలికి ఆర్థికంగా దోచుకున్నాడు. చివరకు యువతి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దక్షిణ ఢిల్లీలో 12వ తరగతి చదవుతున్న సదరు యువతి తండ్రి మద్యానికి బానిసై ఆరోగ్యం పాడు చేసుకున్నాడు. దీంతో ఆయన్ని గతేడాది జూలైలో ఘజియాబాద్‌లోని హ్యాపీ హోమ్స్ రిహాబ్ సెంటర్‌కు తరలించి చికిత్స అందించటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో దాని నిర్వాహకుడి కన్ను యువతిపై పడింది. ఆ వ్యక్తిని చేర్చిన రెండు రోజుల తర్వాత వారి ఇంటికి ఫోన్ చేసి ‘‘నీ తండ్రి మానసిక స్థితి బాగోలేదు. మాట్లాడాలి వెంటనే రావాలి’’ అంటూ యువతిని కోరాడు. తన తల్లి ఇంట్లో లేదని.. ఒక్కదాన్ని అంత దూరం రాలేనని యువతి చెప్పటంతో, దగ్గర్లోని మహిపాల్‌పూర్‌లోని హోటల్‌కు వెళ్లి అక్కడ మానసిక వైద్యుడ్ని కలవాలంటూ సూచించాడు. అత్యవసర పరిస్థితి కావటంతో యువతి అతను చెప్పినట్లే వెళ్లి ఆ వైద్యుడ్ని కలిసింది. మాటల మధ్యలో ఆమెకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇవ్వటంతో స్పృహ కోల్పోగా.. రిహాబ్ సెంటర్ నిర్వాహకుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. విషయం ఎవరికైనా చెబితే ఆమె తండ్రిని చంపేస్తానని.. నగ్న ఫోటోలు బయటపెడతానని యువతిని బెదిరించాడు. ఆపై వాటి సాకుతో మరికొంత కాలం ఆమెపై అత్యాచార పర్వం కొనసాగించాడు. ఈ ఏడాది జనవరిలో చికిత్స పొందుతూ ఆమె తండ్రి చనిపోవటంతో.. ఈసారి ఆ నిర్వాహకుడు కొత్త డ్రామా మొదలుపెట్టాడు. వారి కుటుంబానికి అండగా ఉంటానని నమ్మబలికి వారి రవాణా వ్యాపారాన్ని చూసుకోవటం ప్రారంభించాడు. అయితే వచ్చే ఆదాయంలో పైసా కూడా వారికి ఇవ్వకుండా సతాయించటంతో మోసపోయామన్న విషయం ఆ కుటుంబానికి ఆలస్యంగా అర్థమైంది. చివరకు ధైర్యం చేసిన యువతి తనపై జరిగిన దాష్టీకాన్ని తల్లికి వివరించటంతో వారు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇంతవరకు అతన్ని అరెస్ట్ చేయకపోవటం గమనార్హం. -
వికారాబాద్ జిల్లాలో దారుణం
వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన జిల్లాలోని కోటాలగూడలో గురువారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలుడు చాక్లెట్ ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలు తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పడంతో విషయం బయటకు తెలసింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. girl raped, vikarabad, చిన్నారిపై అత్యాచారం, వికారాబాద్, -
14 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య
ముంబై: మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా భిలావడిలో గుర్తుతెలియని వ్యక్తులు 14 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మాలావలి గ్రామంలో రోడ్డు పక్కన బాధితురాలి మృతదేహం కనిపించడంతో జనవరి 5న ఈ సంఘటన వెలుగుచూసింది. ఆమెను అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో స్పష్టమైనట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలి ఇంటి దగ్గర్లో నివసిస్తున్న కొందరు అనుమానితులను ప్రశ్నిస్తున్నామని, గుర్తుతెలియని నిందితులపై అత్యాచారం, హత్య కేసులు నమోదుచేశామని చెప్పారు. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ భిలావడి పోలీస్ స్టేషన్ బయట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నిందితులు పలానా కులం, మతానికి చెందిన వారని సామాజిక మాధ్యమాల్లో సందేశాలు వెల్లువెత్తాయి. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలను నమ్మొద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. శాంతి భద్రతలకు ముప్పు తలెత్తే పరిస్థితులు కనిపించడంతో భిలావడిలో భద్రతా సిబ్బందిని మోహరించారు. -
6 నెలల తర్వాత మళ్లీ దారుణం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బదాన్ జిల్లాలో దారుణం జరిగింది. ఆరు నెలల క్రితం ఓ బాలికపై (15) లైంగికదాడి చేసి జువెనైల్ హోంకు వెళ్లిన ఓ మైనర్ బాలుడు (17) ఇటీవల విడుదలై ఆ అమ్మాయిపై మరోసారి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేగాక ఆ అమ్మాయిని తీవ్రంగా వేధించి కత్తితో పొడిచాడు. ఆరు నెలల క్రితం నమోదైన లైంగికదాడి కేసును పోలీసులు లైంగిక వేధింపుల కేసుగా మార్చారని, కేసు నుంచి నిందితుడిని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. నిందితుడు లైంగికదాడి చేయలేదని, లైంగికంగా వేధించాడని బాధితురాలు వాంగ్మూలం ఇచ్చినట్టు పోలీసులు కోర్టుకు సమర్పించని ఛార్జిషీటులో పేర్కొన్నారు. కాగా తనకు చదువు రాదని, పోలీసులు కొన్ని పేపర్లపై తన వేలిముద్రలు తీసుకున్నారని బాధితురాలి చెప్పింది. జువెనైల్ హోం నుంచి విడుదలయిన తర్వాత అతను మళ్లీ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు ఈ సారి కూడా నిందితుడిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితురాలు చెప్పింది. -
'అమ్మా'నుషం
11 ఏళ్ల బాలికను వ్యభిచార కేంద్రానికి విక్రయించిన తల్లి చిన్నారిపై పలుసార్లు ఆమె ప్రియుని లైంగిక దాడి పశువాంఛ తీర్చుకున్న హోంగార్డుతో పాటు మరొకడు మొత్తం వ్యవహారంలో ప్రస్తుతానికి ఐదుగురు అరెస్టు పరారీలో మరో ముగ్గురు నిందితులు వివరాలు వెల్లడించిన చీరాల డీఎస్పీ ప్రేమ్‌కాజల్ చీరాల : ముక్కు పచ్చలారని 11 ఏళ్ల బాలికను కడుపులో పెట్టుకుని చూడాల్సిన అమ్మే.. ప్రియునితో కలిసి వ్యభిచార కేంద్రానికి అమ్మేసింది. మూడు నెలల వ్యవధిలో కుమార్తెను రెండు వ్యభిచార కేంద్రాలకు విక్రయించింది. తండ్రి సమానుడైన వ్యక్తితో పాటు మరో ఇద్దరు ఆ చిన్నారిపై పశువాంఛ తీర్చుకున్నారు. ఐసీడీఎస్ సీడీపీవో నాగమణి, బాధిత బాలిక ఫిర్యాదు మేరకు తల్లి, ఆమె ప్రియునితో పాటు మరో ముగ్గరుని అరెస్టు చేశారు. నిందితులపై నిర్భయ, ఫోక్సా, వ్యభిచార నిరోధక చట్టం, మానవ రవాణా సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ డాక్టర్ జి.ప్రేమ్‌కాజల్ గురువారం కొత్తపేటలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. హైదరాబాద్ టూ చీరాల డీఎస్పీ కథనం ప్రకారం.. సికింద్రాబాద్ షామీర్పేట బాలాజీనగర్‌కు చెందిన గజ్జల దీపిక అలియాస్ పూజ తన భర్త రాజును వదిలేసి అదే ప్రాంతానికి చెందిన వేల్పుల విల్సన్‌తో సహజీవనం చే సింది. పూజ కుమార్తె 11 ఏళ్ల చిన్నారిపై తండ్రి వరుసైన విల్సన్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బిత్తరపోయిన చిన్నారి జరిగిన ఘోరాన్ని పలుసార్లు తల్లికి చెప్పేందుకు ప్రయత్నించింది. తల్లి నుంచి సానుభూతి వ్యక్తంకాక పోగా విషయం బయటకు చెబితే చంపేస్తానని కుమార్తెను బెదిరించింది. కొద్ది రోజుల తర్వాత పూజ, విల్సన్ కలిసి విజయవాడలోని ఓ మహిళకు కుమార్తెను అమ్మేశారు. రెండు నెలల తర్వాత విజయవాడకు చెందిన మహిళ మంగళగిరిలో వ్యభిచారం నిర్వహించే మరో మహిళకు ఆ చిన్నారిని విక్రయించింది. మంగళగిరికి చెందిన మహిళ.. చీరాల జాండ్రపేట గుమ్మస్తాల కాలనీ బోడిపాలెంలో వ్యభిచార కేంద్రం నిర్వహించే అన్నపురెడ్డి సాంబ అలియాస్ ప్రేమవాణికి ఆ బాలికను అమ్మేసింది. బోడిపాలెంలో వ్యభిచార కేంద్రం నిర్వహించే ప్రేమవాణి ప్రియుడు జయశంకర్‌నగర్‌కు చెందిన పారాబత్తిన జతిన్‌లాల్ కూడా పలుమార్లు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తరచూ ప్రేమవాణి వద్దకు వెళ్లే హోంగార్డు షేక్ అజీజ్‌బాషా కూడా ఆ బాలికపై పశువాంఛ తీర్చుకున్నాడు. ఐసీడీఎస్ అర్బన్ సీడీపీవో నాగమణి, మైనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 8 తేదీన కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. ఆ విచారణలో మానవ మృగాల ఆకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమవాణి, పారాబత్తిన జతిన్‌లాల్, హోంగార్డు అజీజ్‌బాషా, తల్లి గజ్జల దీపిక (పూజ), ప్రియడు వేల్పుల విల్సన్‌లను పలు ప్రాంతాల్లో అరెస్టు చేశామని డీఎస్పీ చెప్పారు. ఇదే కేసులో మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని, వారిని త్వరలో అరెస్టు చేస్తామని వెల్లడించారు. నిందితులకు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. కేసును త్వరగా ఛేదించి నిందితులను అరెస్టు చేసిన ఒన్‌టౌన్ సీఐ నిమ్మగడ్డ సత్యనారాయణను డీఎస్పీ ప్రేమ్‌కాజల్ అభినందించారు. -
తండ్రి ఆఫీసులో కూతురిపై దారుణం
న్యూఢిల్లీ: ఉత్తర ఢిల్లీలోని బురారి ప్రాంతంలోని ఓ ఆఫీసులో యజమాని కూతురి (7)పై ఓ పెయింటర్ (35) లైంగికదాడికి పాల్పడ్డాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. పెయింటర్ అయిన నిందితుడు తాత్కాలికంగా పొరుగున్న ఉన్న బాధితురాలి తండ్రి ఆఫీసులో పనిచేశాడు. గత శుక్రవారం చిన్నారి తన స్నేహితులతో కలసి ఆడుకోవడానికి తండ్రి లేని సమయంలో ఆఫీసుకు వెళ్లింది. ఆ సమయంలో ఆఫీసులో పనిచేస్తున్న పెయింటర్ బాలిక స్నేహితులను అక్కడి నుంచి పంపేసి, ఆమెపై దారుణానికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలు జరిగిన దుశ్చర్య గురించి కుటుంబ సభ్యులకు చెప్పింది. స్థానికులు నిందితుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. -
చనిపోయినట్లు నటించి.. రేపిస్టు నుంచి తప్పించుకుంది
ఆ అమ్మాయి వయసు కేవలం ఎనిమిదేళ్లు. ఢిల్లీలోని కిరారి అనే ప్రాంతంలో అత్యాచారానికి గురైంది. ఆ తర్వాత చనిపోయినట్లు నటించి, రేపిస్టు బారి నుంచి తప్పించుకుంది. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఆరుబయట మంచం మీద పడుకొని ఉన్న చిన్నారిని ఓ దుర్మార్గుడు ఎత్తుకుపోయాడు. ఆమెకు తర్వాత మెలకువ వచ్చి చూసేసరికి ఇంట్లో కాకుండా వేరే ఎక్కడో.. ఎవరి పక్కనో ఉన్నట్లు గమనించి గట్టిగా అరిచేందుకు ప్రయత్నించింది. కానీ, అతడు ఆమె నోరు మూసేశాడు. తర్వాత అతడు తనను చంపేస్తాడేమోనన్న భయంతో ఆమె కదలకుండా ఉండిపోయి, చనిపోయినట్లు నటించింది. దాంతో నిందితుడు బాగా భయపడ్డాడు. ఆమెను గిల్లి చూశాడు. అయినా ఆమె కదల్లేదు. అతడు దూరంగా వెళ్లగానే ఆమె లేచి ఇంటివైపు పరుగు తీసింది. అది చూసి అతడు కూడా ఆమెను పట్టుకునే ప్రయత్నం చేశాడు గానీ, రాయి తగిలి కింద పడిపోయాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత చిన్నారి దుస్తుల మీద రక్తపు మరకలు చూసి తల్లిదండ్రులు హడలిపోయారు. తనకు పొత్తికడుపులో నొప్పిగా ఉందని చెప్పి, తర్వాత ఏడుస్తూ జరిగిన ఘోరం వివరించింది. ఆ చిన్నారి ఓ ప్రైవేటు స్కూల్లో మూడో తరగతి చదువుతోంది. -
ఫామ్‌హౌస్‌పై దాడి: బాలికపై అత్యాచారం
రాజేంద్రనగర్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం గండిపేటలోని ఓ ఫామ్ హౌస్‌పై శనివారం దోపిడీ దొంగలు దాడి చేసి బీభత్సం సృష్టించారు. అక్కడున్న ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిపారు. అనంతరం ఫామ్‌హౌస్‌లోని రెండు ల్యాప్‌టాప్‌లు తీసుకుని... అక్కడి నుంచి పరారైయ్యారు. బాధితురాలు జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి....దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా దొంగల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
ఫిర్యాదు చేసిన మరునాడే రేప్ చేసి..
బికనీర్: రోజులు గడుస్తున్న కొద్ది విద్యార్థులపట్ల ఉపాధ్యాయుల తీరు ఏవగింపు తెచ్చేలా మారుతోంది. విద్యాబుద్ధులు నేర్పించి తనంతవారిగా తీర్చిదిద్దాల్సినవారు కామాంధుల్లా తయారవుతున్నారు. రాజస్థాన్ లోని బికనీర్ లో వ్యాయామ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి కామంతో పది హేడేళ్ల విద్యార్థినిపై లైంగిక దాడి చేసి అనంతరం చంపేశాడు. హాస్టల్ దగ్గర ఉన్న నీళ్ల ట్యాంకులో ఆమె మృతదేహాన్ని పడేశాడు. కానీ, అతడు మాత్రం అలా చేయలేదని చెప్తున్నాడు. కాలేజీ యాజమాన్యం కూడా ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని అంటోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెండు రోజుల కిందటే ఆ బాలిక తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయుడు తనపై కొద్ది రోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేసింది. వారు స్పందించేలోగానే అతడు శుక్రవారం మరోసారి ఆ బాలిక లైంగిక దాడిజరిపి అనంతరం హత్య చేసి హాస్టల్ దగ్గర నీటి ట్యాంకులో పడేశాడు. పూర్తి వివరాల కోసం బాలిక మృతదేహాన్ని శవపరీక్ష కోసం పంపారు. -
బాలికపై అత్యాచారం.. సజీవదహనం
దేశ రాజధాని పరిసరాల్లో ఆడవాళ్లకు భద్రత లేకుండా పోతోంది. ఢిల్లీ శివార్లలోని నోయిడాలో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆమెను సజీవదహనం చేశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో తమ ఇంటి మేడ మీదే ఆమె అరుపులు వినిపించడంతో తల్లిదండ్రులు పరుగున అక్కడకు వెళ్లేసరికి ఆమె అగ్నికీలలకు ఆహుతవుతూ ఉంది. 95 శాతం వరకు కాలిన గాయాలు కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమెపై అత్యాచారం చేశాడని భావిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వైద్య నివేదికల కోసం తాము ఎదురుచూస్తున్నామని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. పదోతరగతి చదువుతున్న ఆ అమ్మాయి.. 20 ఏళ్ల వ్యక్తి తనను వేధిస్తుండటంతో స్కూలుకు వెళ్లడం కూడా మానేసింది. అయినా ఆమెపై వేధింపులు ఆగలేదు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు చికిత్స చేయడం కూడా కష్టంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆమెకు పెద్దడోసులో యాంటీబయాటిక్స్ ఇస్తున్నామని, శరీరంలో ఇన్ఫెక్షన్ వ్యాపిస్తే మల్టీఆర్గాన్ ఫెయిల్యూర్ ఏర్పడే ప్రమాదం ఉన్నందున అలా జరగకుండా ప్రయత్నిస్తున్నామని ఓ వైద్యుడు చెప్పారు. -
6 నెలలు అత్యాచారం.. ప్రాణాలతో పోరాటం
దేశ రాజధానిలో కూడా అమ్మాయిలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోతోంది. 18 ఏళ్ల యువతిపై పలువురు వ్యక్తులు ఆరు నెలల పాటు అత్యాచారం చేస్తూ ఉండటంతో ఆమె ఇప్పుడు ప్రాణాల కోసం ఆస్పత్రిలో పోరాడుతోంది. ఆమె తన బంధువని చెబుతూ ఓ వ్యక్తి ఈ బాధితురాలిని ఢిల్లీలోని గురు తేజ్ బహదూర్ ఆస్పత్రిలో చేర్చాడు. కానీ, చేర్చిన తర్వాత వెంటనే వెళ్లిపోయాడు. కనీసం కాళ్ల మీద నిలబడే పరిస్థితిలో కూడా ఆమె లేకపోవడంతో.. బాధితురాలిని చూసి వైద్యులు నిర్ఘాంతపోయారు. ఆమెపై పదే పదే అత్యాచారాలు జరగడం వల్లే ఆమె తీవ్రంగా గాయపడిందని చెబుతున్నారు. గత సంవత్సరం ఆమెను పశ్చిమబెంగాల్ నుంచి తీసుకొచ్చారని, తర్వాత రిషికేశ్, హరిద్వార్, మనాలి, మంగళూరు తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి ఆమెపై పలువురు వ్యక్తులు అత్యాచారం చేశారని తెలిసింది. ఈమె జాడ తెలుసుకోడానికి ఏప్రిల్ నెల నుంచి శక్తివాహిని అనే స్వచ్ఛంద సంస్థ ప్రయత్నించింది కానీ, కోల్‌కతా పోలీసుల ద్వారా ఆమె వివరాలు సోమవారమే తెలిశాయి. ఆమెను ఈ స్థితికి తీసుకొచ్చిన వ్యక్తిని గుర్తించడంలో శక్తివాహిని సంస్థ కోల్‌కతా పోలీసులకు సాయపడింది. ఆమెను ఆస్పత్రికి తెచ్చిన వ్యక్తి వివరాలు తెలుసుకోడానికి ఆస్పత్రి సీసీటీవీ ఫుటేజి పరిశీలించాలని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కోరుతున్నారు. -
మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఆపై హత్య!
కాన్పూర్: మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఆపై హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని బిధాన్ ప్రాంతంలో గురువారం వెలుగుచూసింది. బాలిక మృతదేహాన్ని బిధాన్కు సమీపాన మొక్కజోన్న పొలంలో గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పరిశీలించగా, ఆమె వస్త్రాలు చినిగిపోయి రక్తస్రావంతో పడివున్నాయి. దాంతో బాలికను అత్యాచారం.. అనంతరం హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చూరీకి తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాకే హత్యా? లేక అత్యాచారమా ? అనేది నిర్ధారిస్తామని కాన్పూర్ రూరల్ ఎస్పీ సురేంద్ర తివారీ వెల్లడించారు. ఈ కేసులో అనుమానితులుగా భావించిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని చెప్పారు. బాలిక తండ్రి దినేష్ కుమార్ తక్సింపూర్లోని ఓ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గతరాత్రి బాలిక కుటుంబం ఇంటిబయట నిద్రించగా.. ఉదయం లేచి చూసే సరికి వారికి బాలిక కనిపించలేదని ఎస్పీ తివారీ చెప్పారు. -
ఆడపిల్లలు పుట్టడమే పాపమా?
కర్నూలు: కఠిన శిక్షలు లేకపోవడం వల్లే మహిళలపై అత్యాచార ఘటనలు ఎక్కువయ్యాయని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు. పెచ్చుమీరుతున్న అత్యాచార ఘటనల అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తుతామని చెప్పారు. కర్నూలు పట్టణంలో అత్యాచారానికి గురైన ఏడేళ్ల బాలికను మంగళవారం ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇది బాధకరమైన విషయం అన్నారు. ఏ ఇంట్లో కూడా ఇలాంటి దారుణం జరగకూడదన్నారు. ఆడపిల్లలు పుట్టడమే పాపం అన్నట్టు పరిస్థితి తయారు చేస్తున్నారు. ఆడపిల్లలను ఎలా రక్షించుకోవాలన్న భయంతో తల్లిదండ్రులు భయపడుతున్నారన్నారు. ఆడుకోవడానికి పిల్లలకు బయటకు పంపించాలన్నా భయపడాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రేపిస్టులను కఠిన శిక్షలు అమలు చేసినప్పుడే మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడుతుందని చెప్పారు. కొన్ని దేశాల్లో రేపిస్టులను బహిరంగంగా ఉరి తీస్తారు కాబట్టే అక్కడ ఇలాంటి నేరాలు తక్కువని గుర్తు చేశారు. మన చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కర్నూలులోని కడగ్ పూరా కాలనీకి చెందిన ఖాజా భాషా అనే వ్యక్తి శనివారం రాత్రి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. కర్నూలు పెద్దాసుపత్రిలో ఉన్న నిందితుడిపై పాతబస్తీ వాసులు సోమవారం దాడికి యత్నించారు. నిందితున్ని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. -
నాన్నే యముడు
-
బాలికపై హత్యాచారం కేసు: కన్నతండ్రే నిందితుడు
రంగారెడ్డి జిల్లాలో గిరిజన బాలికపై అత్యాచారం, హత్యకేసు మిస్టరీ వీడింది. ఈ ఘోరమైన కేసులో ఆమె కన్నతండ్రే నిందితుడని పోలీసులు తేల్చారు. ఐదుగురు వ్యక్తులు తనను కొట్టి, ఆమెపై సామూహిక అత్యాచారం చేసి హతమార్చారంటూ కట్టుకథలు అల్లి.. ఈ ఘోరానికి పాల్పడ్డాడని చెప్పారు. మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టెంపల్లి తండాకు చెందిన సిమ్రాన్ (14) తండ్రితో కలిసి గురువారం రాత్రి 8 గంటల సమయంలో గ్రామానికి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. కస్తూరిబా గాంధీ పాఠశాలలో చదువుతున్న సిమ్రాన్‌ను బంధువుల ఇంటి నుంచి తీసుకొస్తానంటూ ఆమె తండ్రి మెగావత్ కమాల్ తన మోపెడ్ మీద వెళ్లాడు. (చదవండి - 'తల్లి'డిల్లిన తండా... యాడియే..) రాత్రి తాము తిరిగి వస్తుండగా ఆటోలోంచి గుర్తు తెలియని దుండగులు వచ్చి తనపై దాడి చేసి.. ఆమెను అపహరించారని, తర్వాత సామూహిక అత్యాచారం చేసి హతమార్చారని అందరినీ నమ్మించాడు. ఈ విషయంలో ఎవరూ తనను అనుమానించకూడదని తలమీద గాయం చేసుకున్నట్లు చూపించాడు. తర్వాత కమాల్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా అదే చెప్పడంతో తండావాసులు, బంధువులు అంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, కమాల్ మెగావత్ వ్యవహారశైలిపై పోలీసులకు ముందునుంచి అనుమానంగానే ఉంది. తనను కొట్టి అమ్మాయిని తీసుకెళ్లిపోయారని ఒకసారి, కాదు తాను వాళ్లను ఎదిరించానని మరోసారి చెప్పడం, అతడి తీరు కూడా తేడాగా ఉండటంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో.. తానే మద్యం మత్తులో కన్నకూతురిపై అత్యాచారం చేసినట్లు అంగీకరించాడు. ప్రస్తుతం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
హీరోయిన్ను చేస్తామని చెప్పి.. రేప్ చేశారు!
బాలీవుడ్ కలల పేరుతో ఓ యువతి అత్యాచారానికి గురైంది. ఈ దారుణం రాజస్థాన్‌లోని జైపూర్‌లో చోటుచేసుకుంది. సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్ చాన్సు ఇప్పిస్తానని చెప్పిన ఓ నగల వ్యాపారి.. ఆ అమ్మాయిపై అత్యాచారం చేశాడు. ముంబైకి చెందిన ఆ నగల వ్యాపారి జైపూర్‌లోని ఓ హోటల్ గదిలో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. అత్యాచారం చేసిన నిందితుడు... దాన్ని వీడియోతీసి, వాట్సప్‌లో బాధితురాలికి పంపాడు. వాళ్లిద్దరూ కొంతకాలం క్రితం జైపూర్‌లో కలుసుకున్నారు. ఈ ఘటనపై జైపూర్‌లోని శ్యాంనగర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. నిందితుడిని పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు. -
కిరాతకం
కరాచీ: 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, సజీవ దహనం చేసిన దారుణ ఘటన పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో చోటుచేసుకుంది. ఘోట్కి జిల్లాలోని దాహార్కి పట్టణంలో గతవారాంతంలో ఈ కిరాతక ఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తులు తన కుమార్తెను లాక్కెళ్లి అత్యాచారం చేశారని, తర్వాత పెట్రోల్ పోసి ఆమెను సజీవదహనం చేశారని బాలిక తల్లి(40) స్థానిక మీడియాతో చెప్పింది. తనను కూడా లాక్కెళ్లి విచక్షణారహితంగా కొట్టారని ఆమె తెలిపింది. స్పృహలోకి వచ్చిన తర్వాత ఆదివారం ఆమె తొలిసారిగా మీడియాతో మాట్లాడింది. ఈ ఘోరకృత్యంపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించడంతో బాలిక సోదరుడు సోమవారం ఘోట్కి సెషన్స్ కోర్టులో ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన న్యాయస్థానం బాధితురాలి వాంగ్మూలం నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. -
బాలికపై అత్యాచారం.. హత్య
లింగసూగూరు(కర్ణాటక): ఓ బాలికపై ఇద్దరు మైనర్ బాలురు అత్యాచారం చేసి.. హత్య చేసిన దారుణ ఘటన కర్ణాటకలోని లింగసూగూరు తాలూకాలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. తాలూకాలోని గొనవాట్ల తండాకు చెందిన కవిత(8) గొర్రెలను మేపడానికి ఆదివారం ఉదయం వెళ్లింది. సాయంత్రం ఆ గొర్రెలు మాత్రమే ఇంటికి తిరిగొచ్చాయి. కవిత రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు చుట్టుపక్కల పొలాల్లో వెతికినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు బాలురపై(14),(15) అనుమానం రావడంతో సోమవారం ఉదయం వారిని నిలదీశారు. కవితపై అత్యాచారం చేసి.. రాళ్లతో కొట్టి చంపి.. మృతదేహాన్ని ముళ్లకంపల్లో పారేసినట్లు ఆ బాలురు ఒప్పుకున్నారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు వెళ్లి.. ముళ్లకంపల్లో పడివున్న బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ తండా వాసులు చితకబాది పోలీసులకు అప్పగించారు.