కాన్పూర్: మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఆపై హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లోని బిధాన్ ప్రాంతంలో గురువారం వెలుగుచూసింది. బాలిక మృతదేహాన్ని బిధాన్కు సమీపాన మొక్కజోన్న పొలంలో గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పరిశీలించగా, ఆమె వస్త్రాలు చినిగిపోయి రక్తస్రావంతో పడివున్నాయి. దాంతో బాలికను అత్యాచారం.. అనంతరం హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చూరీకి తరలించారు.
పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాకే హత్యా? లేక అత్యాచారమా ? అనేది నిర్ధారిస్తామని కాన్పూర్ రూరల్ ఎస్పీ సురేంద్ర తివారీ వెల్లడించారు. ఈ కేసులో అనుమానితులుగా భావించిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని చెప్పారు. బాలిక తండ్రి దినేష్ కుమార్ తక్సింపూర్లోని ఓ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గతరాత్రి బాలిక కుటుంబం ఇంటిబయట నిద్రించగా.. ఉదయం లేచి చూసే సరికి వారికి బాలిక కనిపించలేదని ఎస్పీ తివారీ చెప్పారు.
మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఆపై హత్య!
Published Thu, Aug 20 2015 5:40 PM | Last Updated on Sun, Sep 3 2017 7:48 AM
Advertisement
Advertisement