
న్యూఢిల్లీ: మహిళలు, పిల్లలను సంరక్షించాల్సిన బాధ్యత గల పదవిలో ఉండి పశువులా వ్యవహరించాడొక కామాంధుడు.ఢిల్లీ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఒక అధికారి తన స్నేహితుడి టీనేజీ కూతురిపై ఎన్నో నెలలుగా అత్యాచారం చేస్తూ చివరికి పట్టుబడ్డాడు. అతనికి సహకరించినందుకు ఆతడి భార్య పైన కూడా కేసు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు.
ఢిల్లీ ప్రభుత్వంలో మహిళా శిశు సంక్షేమాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న ఒక సీనియర్ అధికారి తన స్నేహితుడు 2020లో మరణించడంతో అతడి మైనర్ కుమార్తె(14)ను తన ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటి నుండి ఆ బాలిక వారితోనే కలిసి ఉంటోంది. ఈ వ్యవధిలో ప్రభుత్వాధికారి ఆ అమ్మాయిపై అనేక మార్లు అత్యాచారం చేసినట్లు మధ్యలో తాను గర్భం దాల్చగా అతడి భార్య, కుమారుడు కొన్ని మందులిచ్చి గర్భాన్ని తొలగించారని బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టీనేజీ అమ్మాయి ప్రస్తుతం చికిత్స తీసుకుంటోందని ఆమె నుండి ఇంకా స్టేట్‌మెంట్ తీసుకోవాల్సి ఉందని అన్నారు. ప్రభుత్వాధికారిపై పోక్సో చట్టం తోపాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, నిందితుడికి సహకరించినందుకు అధికారి భార్యపైన కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: ఐదేళ్ల బాలుడిపై అమానుషం.. ఎత్తి నేలకేసి కొట్టి..
Comments
Please login to add a commentAdd a comment