three-year-old girl
-
సవతి తల్లి కాదు రాక్షసి
యశవంతపుర: తల్లి లేని పాపను అమ్మలా చూసుకోవాల్సిన సవతి తల్లి ఈర్ష అసూయతో రాక్షసిలా మారింది. మూడేళ్ల చిన్నారిని కొట్టి చంపిన ఘటన బెళగావి జిల్లా కంగ్రాళి గ్రామంలో జరిగింది. వివరాలు.. సీఆర్పీఎఫ్లో జవాన్‌గా పని చేస్తున్న రాయణ్ణ మొదటి భార్య గతంలో చనిపోయింది. వీరికి ఒక పాప ఉంది. సప్నా అనే యువతిని రాయణ్ణ రెండో పెళ్లి చేసుకున్నాడు. అతడు వేరే రాష్ట్రంలో డ్యూటీలో ఉన్నాడు. ఇంటి వద్ద సప్నా పసిపాపను నిత్యం హింసించేది. ఇదే రీతిలో సోమవారం కూడా పాపను తీవ్రంగా కొట్టడంతో ప్రాణాలు విడిచింది. పాప వాంతులు చేసుకుంటూ చనిపోయిందని సప్నా నాటకం ఆడింది. ఆమె హత్య చేసిందని పాప అవ్వ, చిన్నాన్న కేసు పెట్టారు. -
మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఆపై హత్య!
కాన్పూర్: మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఆపై హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని బిధాన్ ప్రాంతంలో గురువారం వెలుగుచూసింది. బాలిక మృతదేహాన్ని బిధాన్కు సమీపాన మొక్కజోన్న పొలంలో గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పరిశీలించగా, ఆమె వస్త్రాలు చినిగిపోయి రక్తస్రావంతో పడివున్నాయి. దాంతో బాలికను అత్యాచారం.. అనంతరం హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చూరీకి తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాకే హత్యా? లేక అత్యాచారమా ? అనేది నిర్ధారిస్తామని కాన్పూర్ రూరల్ ఎస్పీ సురేంద్ర తివారీ వెల్లడించారు. ఈ కేసులో అనుమానితులుగా భావించిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని చెప్పారు. బాలిక తండ్రి దినేష్ కుమార్ తక్సింపూర్లోని ఓ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గతరాత్రి బాలిక కుటుంబం ఇంటిబయట నిద్రించగా.. ఉదయం లేచి చూసే సరికి వారికి బాలిక కనిపించలేదని ఎస్పీ తివారీ చెప్పారు. -
మూడేళ్ల బాలికపై లైంగికదాడి.. నిందితుడి అరెస్టు
థానే : మూడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ కామాంధుడిని పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. నిందితుడిని షారుఖ్ సాహిద్గా గుర్తించారు. వివరాలు.. నాసిక్‌లోని అంబర్నాథ్ జిల్లాలో మూడేళ్ల బాలికకు స్నానం చేయించడానికి తల్లి ఇంటి బయటకు తీసుకు వచ్చింది. సబ్బు తీసుకురావడానికి తల్లి లోపలికి వెళ్లగా, నిందితుడు బాలిక వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించసాగాడు. ఇంటి నుంచి బయటకు వచ్చిన తల్లి విషయాన్ని గమనించి ఇరుగు పొరుగు వారిని పిలిచింది. స్థానికులు నిందితున్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆచూకీ లభించిన జహ్నవి
-
మింగేసిన బోరుబావి
సాక్షి, చెన్నై: బోరు బావుల రూపంలో చిన్నారులు విగత జీవులు అవుతున్నారు. శనివారం ఉదయాన్నే విల్లుపురం జిల్లా కళ్లకురిచ్చి సమీపంలోని త్యాగరాయ దురం పల్ల చేరి గ్రామానికి చెందిన రామచంద్రన్ కుమార్తె మధుమిత (3) తమ పొలంలోని బోరు బావిలో పడ్డ విషయం తెలిసిందే. ఈ పసిబిడ్డను ప్రాణాలతో రక్షించేందుకు అధికారులు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆ బోరు బావికి పీవీసీ పైప్‌లను అమర్చని దృష్ట్యా, చిన్నారి క్రమంగా జారుకుంటూ లోపలికి వెళ్తుండడం అధికారులను కలవరంలో పడేసింది. రోబోటిక్ యంత్రాన్ని ఉపయోగించినా ఫలితం శూన్యం. రాత్రంతా శ్రమించినా: చీకటి పడడంతో ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేశారు. ఎలాగైనా ప్రాణాలతో చిన్నారిని రక్షించి తీరుతామన్న ఆశతో అధికారులు రాత్రంతా శ్రమించారు. 30 అడుగుల లోతుకు నాలుగు వైపులా సమాం తరంగా గోతిని తీశారు. చిన్నారి మరింత కిందకు జారకుండా అందుకు తగ్గ చర్యలు తీసుకున్నారు. ఆదివారం వేకువ జామున నాలుగు గంటల సమయంలో అతి కష్టం మీద మధుమితను బయటకు తీశారు. అక్కడే వేచి ఉన్న వైద్యాధికారులు ఆ చిన్నారిని పరీక్షించి, శ్వాస పీల్చుకునే రీతిలో ఏర్పాట్లు చేశారు. ఆ చిన్నారి కొంత మేరకు స్పందించడంతో ప్రాణాలతో ఉన్నట్టు తేలి ఆనందంలో మునిగారు. అయినా, మెరుగైన వైద్యం నిమిత్తం హుటాహుటిన అంబులెన్స్‌ల ద్వారా కళ్లకురిచ్చి ఆస్పత్రికి తరలించారు. మృత్యు ఒడిలోకి : ఆ చిన్నారి ప్రాణాలతో ఉందన్న సమాచారంతో ఆనందంలో మునిగిన వారందరూ గంట వ్యవధిలో విషాద సమాచారాన్ని అందుకోవాల్సి వచ్చింది. సంఘటనా స్థలంలో అగ్నిమాపక సిబ్బంది తాము ఆ బిడ్డను రక్షించామని ఆనందంలో ఉండగా, ఆస్పత్రిలో చికిత్స ఫలించక చిన్నారి మృత్యుఒడిలోకి వెళ్లిన సమాచారం అక్కడున్న వారందరినీ కన్నీటి పర్యంతంలో ముంచేసింది. ఆస్పత్రిలో చేర్చిన ఐదు నిమిషాల్లో ఆ చిన్నారి తుదిశ్వాస విడవడం ఆ కుటుంబాన్ని కన్నీటి మడుగులో ముంచింది. విల్లుపురం జిల్లా పరిసర గ్రామాల ప్రజలందరూ ఆ బిడ్డ ప్రాణాలతో బయటపడాలని రాత్రంతా ప్రార్థనలు చేసినా ఫలితం దక్కలేదు. 20 గంటల పాటు తీవ్ర ఉత్కంఠతో అధికారుల సమష్టి శ్రమ వృథా అయింది. ఆ చిన్నారి అనంత లోకాలకు చేరడంతో విల్లుపురం జిల్లాలో విషాదచాయలు అలుముకున్నాయి. -
యూపీలో మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రుచ్ జిల్లాలో నర్సరీ చదువుతున్న మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన పాఠశాల వ్యాన్ డ్రైవర్ అనిల్ కుమార్ బెరియను శుక్రవారం అర్థరాత్రి అరెస్ట్ చేసినట్లు జిల్లా పోలీసు ఉన్నతాధికారి శనివారం వెల్లడించారు. స్కూల్ వ్యాన్ కూడా సీజ్ చేసినట్లు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. శుక్రవారం ఆ చిన్నారితోపాటు పలువురు విద్యార్థులను డ్రైవర్ వ్యాన్‌లో స్కూల్‌కు తీసుకువెళ్లాడు. అయితే విద్యార్థులందరిని స్కూల్ వద్ద దింపాడు. కానీ మూడేళ్ల చిన్నారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం జరిపాడు. అనంతరం ఆ చిన్నారిని ఇంటి వద్ద దింపాడు. ఆ చిన్నారి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దాంతో ఆ కుటుంబ సభ్యులకు ఆగ్రహాంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. గత అర్థరాత్రి నిందితుడిని పట్టుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. నిందితునిపై దాడికి ఆ చిన్నారి కుటుంబసభ్యులతోపాటు ఇరుగుపోరుగు వారి ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అత్యాచారం జరిగిందని వైద్యులు దృవీకరించారు.