మెదక్:మహిళలపై మృగాళ్ల ఆకృత్యాలు రోజు రోజుకూ శృతి మించుతూనే ఉన్నాయి. తాజాగా ఇద్దరు ఆటో డ్రైవర్లు ఓ యువతిపై అత్యాచారం చేసిన జిల్లాలోని సదాశివపేటలో శుక్రవారం చోటు చేసుకుంది. ఒంటరిగా వెళుతున్న యువతిపై ఆటో డ్రైవర్లు పైశాచికంగా అత్యాచారాకి ఒడిగట్టారు.అనంతరం ఈ ఘటనపై యువతి ఫిర్యాదు మేరకు ఇద్దరు ఆటోడ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.