6 నెలల తర్వాత మళ్లీ దారుణం | 6 months after rape, 15-year-old victim raped again by the same boy | Sakshi
Sakshi News home page

6 నెలల తర్వాత మళ్లీ దారుణం

Published Fri, Sep 30 2016 11:55 AM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

6 నెలల తర్వాత మళ్లీ దారుణం - Sakshi

6 నెలల తర్వాత మళ్లీ దారుణం

లక్నో: ఉత్తరప్రదేశ్లో బదాన్ జిల్లాలో దారుణం జరిగింది. ఆరు నెలల క్రితం ఓ బాలికపై (15) లైంగికదాడి చేసి జువెనైల్ హోంకు వెళ్లిన ఓ మైనర్ బాలుడు (17) ఇటీవల విడుదలై ఆ అమ్మాయిపై మరోసారి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేగాక ఆ అమ్మాయిని తీవ్రంగా వేధించి కత్తితో పొడిచాడు.  

ఆరు నెలల క్రితం నమోదైన లైంగికదాడి కేసును పోలీసులు లైంగిక వేధింపుల కేసుగా మార్చారని, కేసు నుంచి నిందితుడిని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. నిందితుడు లైంగికదాడి చేయలేదని, లైంగికంగా వేధించాడని బాధితురాలు వాంగ్మూలం ఇచ్చినట్టు పోలీసులు కోర్టుకు సమర్పించని ఛార్జిషీటులో పేర్కొన్నారు. కాగా తనకు చదువు రాదని, పోలీసులు కొన్ని పేపర్లపై తన వేలిముద్రలు తీసుకున్నారని బాధితురాలి చెప్పింది. జువెనైల్ హోం నుంచి విడుదలయిన తర్వాత అతను మళ్లీ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు ఈ సారి కూడా నిందితుడిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితురాలు చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement