నిజామాబాద్: రాష్ట్రంలో చిన్నారులపై అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అభుం శుభం తెలియని చిన్నారులు కామాంధుల కబంధ హస్తాలలో చిక్కుకుంటున్నారు. ఒకవైపు అత్యాచార ఘటనలకు పాల్పడితే కఠిన శిక్షలు అమలు చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా వారికి చీమకుట్టినట్టైనా లేదు. నిర్భయలాంటి చట్టాలెన్ని వచ్చిన కామాంధుల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. కొందరు మృగాళ్లు మహిళలుపై, బాలికలపై ఇష్టారాజ్యంగా చెలరేగిపోతూ అత్యాచారాలకు తెగబడుతున్నారు. ఈ మృగాళ్ల చేతిలో చిన్నారులు నలిగిపోతూనే ఉన్నారు.
తాజాగా మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగిన ఘటన నిజామాబాద్ జిల్లాలో ఎల్లారెడ్డి మండలం మక్తల్ లో శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై కేసు నమోదు చేశారు.
నిజామాబాద్ జిల్లాలో మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం
Published Sat, Dec 21 2013 4:52 PM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
Advertisement
Advertisement