రాజేంద్రనగర్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం గండిపేటలోని ఓ ఫామ్ హౌస్‌పై శనివారం దోపిడీ దొంగలు దాడి చేసి బీభత్సం సృష్టించారు. అక్కడున్న ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిపారు. అనంతరం ఫామ్‌హౌస్‌లోని రెండు ల్యాప్‌టాప్‌లు తీసుకుని... అక్కడి నుంచి పరారైయ్యారు. బాధితురాలు జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి....దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా దొంగల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.