
ఏఐని ఎక్కువగా విశ్వసించే ఎలాన్ మస్క్ (Elon Musk).. ఈసారి వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై విశ్వాసం వ్యక్తం చేశారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన వీడియోను టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ రీషేర్ చేస్తూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని మరింత నొక్కిచెప్పారు. "కృత్రిమ మేధ ప్రతిదాన్ని మెరుగుపరుస్తుంది" అని పేర్కొన్నారు.
రైతులు తక్కువ వనరుల వినియోగంతో ఉత్పాదకతను పెంచడానికి కృత్రిమ మేధ ఆధారిత పరిష్కారాలు ఎలా సహాయపడతాయో ఈ వీడియో చూపిస్తుంది. కృత్రిమ మేధ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గణనీయంగా ప్రయోజనం పొందిన భారతదేశంలోని బారామతి సహకార సంఘానికి చెందిన ఒక రైతు ఉదాహరణను సత్య నాదెళ్ల ఉదహరించారు.
తక్కువ భూమి ఉన్న రైతులు పంట దిగుబడిలో గణనీయమైన మెరుగుదలను చూశారని, రసాయనాల వాడకం తగ్గిందని, నీటి నిర్వహణ మెరుగైందని చెప్పుకొచ్చారు. జియోస్పేషియల్ డేటా, డ్రోన్లు, ఉపగ్రహాల నుంచి ఉష్ణోగ్రత డేటా, రియల్ టైమ్ సాయిల్ అనాలిసిస్ ద్వారా ఈ సమాచారం మొత్తాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనుసంధానం చేస్తుందని తెలిపారు. రైతులు వారి స్థానిక భాషలో ఈ సమాచారాన్ని పొందవచ్చు.
రియల్ టైమ్ అగ్రికల్చర్ డేటాతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మిళితం చేయడం ద్వారా రైతులు మరింత సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవచ్చని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ఇది సుస్థిర వ్యవసాయ పద్ధతులకు దారితీస్తుందని, సామర్థ్యాన్ని పెంచుతుందని వివరించారు.
ఆ వీడియో ఇదే.. మీరూ చూసేయండి..
A fantastic example of AI's impact on agriculture. pic.twitter.com/nY9o8hHmKJ
— Satya Nadella (@satyanadella) February 24, 2025
Comments
Please login to add a commentAdd a comment