విశాఖపట్నం: అభం శుభం తెలియని ఓ బాలిక (15) పై ఓ మృగాడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తాతగారి ఇంటి నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తున్న బాలికపై అతను ఈ దారుణానికి పాల్పడ్డాడు. బుధవారం పద్మనాభం మండలం రేవిడి సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పద్మనాభం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
భీమునిపట్నం మండలం లక్ష్మీపురం పంచాయతీ ముగడపేటకు చెందిన పదిహేనేళ్ల బాలిక రేవిడి సమీపంలోని వెంకటాపురానికి చెందిన తన తాతగారి ఇంటి నుంచి తిరిగి వస్తుండగా దారి కాచి మరోవ్యక్తితో ఉన్న నింది తుడు పి.గంగరాజు రేవిడి దాటిన తరువాత తోట లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ సంగతి బాధితురాలు కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు వైద్యం నిమిత్తం భీమిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఆ బాలిక పద్మనాభం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె 7వ తరగతి చదివి మాని వేసింది. ప్రస్తుతం తగరపువలసలోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తోంది. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
దారికాచి బాలికపై అత్యాచారం
Published Thu, Jan 23 2014 6:41 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement
Advertisement