Tagarapuvasala
-
ప్రాణాలు తీసిన స్టాపర్
సాక్షి, తగరపువలస(విజయనగరం) : వేగ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన స్టాపర్‌ను బైక్‌తో ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన భీమిలి మండలం దాకమర్రి సమీపంలో విజయనగరం వెళ్లే రోడ్డులో ఆదివారం అర్థరాత్రి జరిగింది. భీమిలి ఎస్ఐ పాణిగ్రాహి తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం జిల్లా సాలూరు చింతల వీధికి చెందిన తిరుమలేశ(21), బాడాన హేమంత్ కుమార్(30) ఆదివారం ఉదయం విశాఖపట్నం ద్విచక్ర వాననంపై వచ్చా రు. తిరిగి ఆదివారం అర్ధరాత్రి తిరుగుప్రయాణమయ్యారు. విజయనగరం పట్టణంలోని ఉడాకాలనీలో ఉంటున్న తిరుమలేశ అమ్మమ్మ ఇంటి వద్ద రాత్రికి ఉండిపోయి తెల్లవారి స్వస్థలానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో రాత్రి 1:50 గంటల సమయంలో దాకమర్రి రఘు కళాశాల వద్ద వేగ నియంత్రణ కోసం రోడ్డుపై ఏర్పాటు చేసిన స్టాపర్‌ను బైక్‌తో ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో తిరుమలేశ సంఘటన స్థలంలోనే మరణించంగా, తీవ్రంగా గాయపడిన హేమంత కుమార్ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు సింహగిరి ప్రదక్షిణ బందోబస్తులో ఉండటంతో విషయం అలస్యంగా తెలిసింది. భీమిలి ఎస్ఐ పాణిగ్రాహి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దారికాచి బాలికపై అత్యాచారం
విశాఖపట్నం: అభం శుభం తెలియని ఓ బాలిక (15) పై ఓ మృగాడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తాతగారి ఇంటి నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తున్న బాలికపై అతను ఈ దారుణానికి పాల్పడ్డాడు. బుధవారం పద్మనాభం మండలం రేవిడి సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పద్మనాభం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. భీమునిపట్నం మండలం లక్ష్మీపురం పంచాయతీ ముగడపేటకు చెందిన పదిహేనేళ్ల బాలిక రేవిడి సమీపంలోని వెంకటాపురానికి చెందిన తన తాతగారి ఇంటి నుంచి తిరిగి వస్తుండగా దారి కాచి మరోవ్యక్తితో ఉన్న నింది తుడు పి.గంగరాజు రేవిడి దాటిన తరువాత తోట లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంగతి బాధితురాలు కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు వైద్యం నిమిత్తం భీమిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఆ బాలిక పద్మనాభం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె 7వ తరగతి చదివి మాని వేసింది. ప్రస్తుతం తగరపువలసలోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తోంది. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.