హీరోయిన్ను చేస్తామని చెప్పి.. రేప్ చేశారు!
బాలీవుడ్ కలల పేరుతో ఓ యువతి అత్యాచారానికి గురైంది. ఈ దారుణం రాజస్థాన్లోని జైపూర్లో చోటుచేసుకుంది. సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్ చాన్సు ఇప్పిస్తానని చెప్పిన ఓ నగల వ్యాపారి.. ఆ అమ్మాయిపై అత్యాచారం చేశాడు. ముంబైకి చెందిన ఆ నగల వ్యాపారి జైపూర్లోని ఓ హోటల్ గదిలో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.
అత్యాచారం చేసిన నిందితుడు... దాన్ని వీడియోతీసి, వాట్సప్లో బాధితురాలికి పంపాడు. వాళ్లిద్దరూ కొంతకాలం క్రితం జైపూర్లో కలుసుకున్నారు. ఈ ఘటనపై జైపూర్లోని శ్యాంనగర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. నిందితుడిని పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు.