heroine chance
-
దుల్కర్‌కు జోడీగా..?
తెలుగు పరిశ్రమలో కథానాయికగా మీనాక్షీ చౌదరికి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’, వరుణ్‌తేజ్ ‘మట్కా’, విశ్వక్ సేన్ సినిమాల్లో హీరోయిన్గా చేస్తున్నారీ బ్యూటీ. తాజాగా దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందనున్న ‘లక్కీభాస్కర్’ చిత్రంలోని హీరోయిన్ చాన్స్ కూడా మీనాక్షీకే లభించిందని టాలీవుడ్ లేటెస్ట్ సమాచారం. పాన్ ఇండియా ఫిల్మ్‌గా ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. నవంబరులో షూటింగ్ ప్రారంభం కానుందట. -
కోలీవుడ్ హీరోయిన్ గా బుల్లితెర నటి
-
హీరోయిన్గా ఉన్నప్పుడు కంఫ్టర్ ఉండేది: చార్మీ
Charmy Kaur: అతి తక్కువ కాలంలోనే నటిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ చార్మీ. దాదాపు స్టార్ హీరోలందరితో నటించిన చార్మీ ఆ తర్వాత సినిమాలకు గుడ్‌డై చెప్పి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె నిర్మించిన రొమాంటిక్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. 'హీరోయిన్గా ఉన్న సమయంలో ఎక్కువ కంఫర్ట్ ఉండేది. ఫిటినెస్‌పై మాత్రమే దృష్టి పెడితే సరిపోయేది. కానీ నిర్మాతగా బాధ్యతలు స్వీకరించడం అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడు అందరి కంఫర్ట్ చూసుకోవాల్సి వస్తుంది. అయినా నాకేమీ విసుగు అనిపించడం లేదు. ఇప్పటికీ నటిగా అవకాశాలు వస్తున్నాయి. కానీ నాకు ఇక నటించే ఆలోచన మాత్రం లేదు. అని చెప్పుకొచ్చింది. చదవండి: పూరి జగన్నాథ్ కన్నీళ్లు పెట్టుకున్నారు : డైరెక్టర్ టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత -
పడినా లేచింది!
సినిమాల్లో హీరోయిన్గా చాన్స్ రావడం అంత తేలిక కాదు. ఒకవేళ వచ్చినా... హీరోయిన్గా స్థిరపడటం అన్నది అంత సులువూ కాదు. అందుకే ఎంతోమంది అమ్మాయిలు ఒకట్రెండు సినిమాలు చేసి మాయమైపోతుంటారు. సుహాసిని విషయంలోనూ అదే జరిగింది. ‘చంటిగాడు’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. సక్సెస్‌ను చవి చూసింది. కొన్ని అవకాశాలనూ అందుకుంది. కానీ నిలదొక్కుకోలేకపోయింది. అయితే తను చాలామంది లాగా ఇంకా అవకాశాలు వస్తాయేమో అని చూస్తూ కూచో లేదు. సినిమాలు మాత్రమే చేస్తానంటూ మడి కట్టుకు కూర్చోలేదు. బుల్లితెర వైపు దృష్టి సారించింది. వచ్చిన అవకాశాలను అంది పుచ్చుకుంది. సీరియళ్లలో బిజీ అయి పోయింది. ‘అపరంజి’తో మొదలైన ఆమె టెలివిజన్ విజయ ప్రస్థానం... నిరాటంకంగా కొనసాగిపోతూనే ఉంది. ఒకే సమయంలో రెండు మూడు సీరియళ్లలో పని చేస్తూ... తన కెరీర్‌గ్రాఫ్ ఇక్కడ కూడా పడిపోకుండా చక్కగా నిలబెట్టుకుంటోంది సుహాసిని. పడినా లేవడం అంటే ఏమిటో మిగతా వాళ్లకి చూపిస్తోంది! -
హీరోయిన్ను చేస్తామని చెప్పి.. రేప్ చేశారు!
బాలీవుడ్ కలల పేరుతో ఓ యువతి అత్యాచారానికి గురైంది. ఈ దారుణం రాజస్థాన్‌లోని జైపూర్‌లో చోటుచేసుకుంది. సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్ చాన్సు ఇప్పిస్తానని చెప్పిన ఓ నగల వ్యాపారి.. ఆ అమ్మాయిపై అత్యాచారం చేశాడు. ముంబైకి చెందిన ఆ నగల వ్యాపారి జైపూర్‌లోని ఓ హోటల్ గదిలో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. అత్యాచారం చేసిన నిందితుడు... దాన్ని వీడియోతీసి, వాట్సప్‌లో బాధితురాలికి పంపాడు. వాళ్లిద్దరూ కొంతకాలం క్రితం జైపూర్‌లో కలుసుకున్నారు. ఈ ఘటనపై జైపూర్‌లోని శ్యాంనగర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. నిందితుడిని పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు. -
ఆ పేరు చెబితే వైబ్రేషన్సే!
మదిరాక్షి... ‘ఓరి దేవుడోయ్’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన మధ్యప్రదేశ్ మగువ. వృత్తిరీత్యా ఇంటీరియర్ డిజైనర్ అయిన ఈ సోగకళ్ల సుందరి... సంగీత దర్శకుడు కోటి తనయుడి పక్కన హీరోయిన్ చాన్స్ కొట్టేసింది. నగరంలో ఉన్నది ఏడునెలలే అయినా ఎంతో ఎమోషనల్ బాండ్ ఏర్పడిందంటున్న భోపాల్ బొమ్మ పరిచయం ఆమె మాటల్లోనే... - శిరీష చల్లపల్లి నేను పుట్టింది భోపాల్‌లో అయినా పెరిగింది, చదివింది పుణేలో. నాన్న బిజినెస్‌మ్యాన్. అమ్మ అడ్వకేట్. ఒక అక్క. ఇంట్లో చిన్నదాన్ని కావడంతో గారాబం ఎక్కువ. అందుకే ఎడ్యుకేషన్ విషయంలోనూ డాక్టరో, ఇంజనీరో కావాలని పట్టుబట్టలేదు. నాకు ఇష్టమైన ఇంటీరియర్ డిజైనింగ్‌లో సెటిలయ్యాను. ప్రొఫెషనల్ ఇంటీరియర్ డిజైనర్‌గా ఓ కంపెనీ కూడా నిర్వహిస్తుండగా... అందాలపోటీల్లో పాల్గొనవచ్చు కదా అని ఫ్రెండ్స్ సల హా ఇచ్చారు. వారి సూచనల మేరకు అందాల పోటీల్లో పాల్గొన్న. అప్పుడు మొదలైంది ఈ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్. నన్ను నేను కెమెరాలో చూసుకున్నాక కాన్ఫిడెన్స్ పెరిగింది. ఈ ఫీల్డ్‌లో రాణించగలననిపించింది. చాలా నేర్చుకున్నా... అలా ఇప్పుడు కోటి కుమారుడు రాజీవ్ హీరోగా చేస్తున్న ‘ఓరి దేవుడా’ సినిమాలో లీడ్‌రోల్ చాన్స్ వచ్చింది. లంగావోణీలో, చీరల్లో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే పాత్ర. నాకు చాలా నచ్చింది. మొదటిసారి నేను హైదరాబాద్ వ చ్చినప్పుడు కాస్త కంగారు పడ్డాను. కానీ యూనిట్ అంతా నన్ను ఆదరించిన తీరు చూశాక నాకు ఒక ఎమోషనల్ బాండ్ ఏర్పడింది. అసలు తెలుగురాని నేను... ఈ సినిమాతో తెలుగు పూర్తిగా మాట్లాడగలుగుతున్నాను. చెప్పడం మర్చిపోయాను... ఈ సినిమా కేవలం 30 రోజుల్లోనే పూర్తి చేశారు. డే అండ్ నైట్ షూటింగ్. కష్టమనిపించినా ఇష్టంగా చేశాను. నాకైతే ఇదో కాలేజీలాగా అనిపించింది. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నెక్లెస్‌రోడ్‌లో రైడ్... నాకు హైదరాబాద్ పరిచ యమై ఏడు నెలలే అయినా.. ఇక్కడ సిటీలో కొన్ని ప్లేసెస్ నా మనసుకు ఎంతో చేరువయ్యాయి. ముఖ్యంగా హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహం చూస్తే ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ప్రతిరోజూ షూటింగ్ పూర్తయిన తరువాత కనీసం పది నిమిషాలైనా నె క్లెస్ రోడ్లో అలా రైడ్‌కి వెళ్లి వచ్చేదాన్ని. రోజంతా పడ్డ కష్టాన్ని ఆ పదినిమిషాల్లో మరిచిపోయేదాన్ని. నాకు మహేష్‌బాబు అంటే బాగా ఇష్టం. అదేదో సినిమాలో చెప్పినట్టు... నాకు కూడా మహేష్ అన్న పేరు వినగానే వైబ్రేషన్స్ మొదలవుతాయి. సో... తనతో హీరోయిన్గా చేసే చాన్స్ వస్తే అంతకు మించిన ఆనందమే లేదు! -
హీరోయిన్ చేస్తానని.... గర్భవతిని చేశాడు
-
హీరోయిన్ చేస్తానని చెప్పి.. గర్భవతిని చేశాడు
సినిమాల్లో హీరోయిన్ చేస్తానంటూ సినిమా దర్శకుడు చాంద్ పాషా మోసం చేసి.. తనను గర్భవతిని చేశాడని శ్రీజ అనే సీరియల్ కళాకారిణి నాచారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత ఆరు నెలలుగా తనను మోసం చేశాడని తెలిపింది. చాంద్ పాషాకు గతంలోనే పెళ్లయ్యి, ఇద్దరు పిల్లలున్నారు. మళ్లీ తనను కూడా పెళ్లి చేసుకుంటానని చెప్పాడని ఆమె చెప్పింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం ప్రాంతానికి చెందిన శ్రీజను లవ్ ఈజ్ గేమ్ అనే సినిమాలో హీరోయిన్ చేస్తానని అతడు మోసగించినట్లు తెలిపింది. ఇంతకుముందు అతడు లవ్ సిలబస్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. పోలీసులు శనివారం తెల్లవారుజామున చాంద్ పాషాను అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను శ్రీజను మోసం చేయాలని సదరు దర్శకుడు చెప్పటం విశేషం. బాధితురాలి తల్లి మాట్లాడుతూ తన కుమార్తెకు సినిమాల్లో ఛాన్సు ఇప్పిస్తానంటూ సుమారు ఆరు లక్షల వరకూ తీసుకున్నాడని, దాంతో పాటు తన కుమార్తెను మోసం చేశాడని ఆరోపించింది. తనకు దర్శకులు, నిర్మాతలు తెలుసు అని చెప్పాడని.... పెళ్లి కాలేదని... పిల్లలు లేరని చాంద్ పాషా అబద్దాలు చెప్పాడని తెలిపింది. గతరాత్రి కొంతమంది తన కుమార్తెపై దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించింది. తమకు తగిన న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని ఆమె స్పష్టం చేసింది.