ఆ పేరు చెబితే వైబ్రేషన్సే! | Madirakshi spl chit chat with Shirisha Challapalli | Sakshi
Sakshi News home page

ఆ పేరు చెబితే వైబ్రేషన్సే!

Published Wed, Apr 15 2015 10:25 PM | Last Updated on Sun, Sep 3 2017 12:20 AM

ఆ పేరు చెబితే వైబ్రేషన్సే!

ఆ పేరు చెబితే వైబ్రేషన్సే!

మదిరాక్షి... ‘ఓరి దేవుడోయ్’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మధ్యప్రదేశ్ మగువ. వృత్తిరీత్యా ఇంటీరియర్ డిజైనర్ అయిన ఈ సోగకళ్ల సుందరి... సంగీత దర్శకుడు కోటి తనయుడి పక్కన హీరోయిన్ చాన్స్ కొట్టేసింది. నగరంలో ఉన్నది ఏడునెలలే అయినా ఎంతో ఎమోషనల్ బాండ్ ఏర్పడిందంటున్న భోపాల్ బొమ్మ పరిచయం ఆమె మాటల్లోనే...
- శిరీష చల్లపల్లి
నేను పుట్టింది భోపాల్‌లో అయినా పెరిగింది, చదివింది పుణేలో. నాన్న బిజినెస్‌మ్యాన్.
 
అమ్మ అడ్వకేట్. ఒక అక్క. ఇంట్లో చిన్నదాన్ని కావడంతో గారాబం ఎక్కువ. అందుకే ఎడ్యుకేషన్ విషయంలోనూ డాక్టరో, ఇంజనీరో కావాలని పట్టుబట్టలేదు. నాకు ఇష్టమైన ఇంటీరియర్ డిజైనింగ్‌లో సెటిలయ్యాను. ప్రొఫెషనల్ ఇంటీరియర్ డిజైనర్‌గా ఓ కంపెనీ కూడా నిర్వహిస్తుండగా... అందాలపోటీల్లో పాల్గొనవచ్చు కదా అని ఫ్రెండ్స్ సల హా ఇచ్చారు. వారి సూచనల  మేరకు అందాల పోటీల్లో పాల్గొన్న. అప్పుడు మొదలైంది ఈ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్. నన్ను నేను కెమెరాలో చూసుకున్నాక కాన్ఫిడెన్స్ పెరిగింది. ఈ ఫీల్డ్‌లో రాణించగలననిపించింది.
 
చాలా నేర్చుకున్నా...
అలా ఇప్పుడు కోటి కుమారుడు రాజీవ్ హీరోగా చేస్తున్న ‘ఓరి దేవుడా’ సినిమాలో లీడ్‌రోల్ చాన్స్ వచ్చింది. లంగావోణీలో, చీరల్లో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే పాత్ర. నాకు చాలా నచ్చింది. మొదటిసారి నేను హైదరాబాద్ వ చ్చినప్పుడు కాస్త కంగారు పడ్డాను. కానీ యూనిట్ అంతా  నన్ను ఆదరించిన తీరు చూశాక నాకు ఒక ఎమోషనల్ బాండ్ ఏర్పడింది. అసలు తెలుగురాని నేను... ఈ సినిమాతో తెలుగు పూర్తిగా మాట్లాడగలుగుతున్నాను. చెప్పడం మర్చిపోయాను... ఈ సినిమా కేవలం 30 రోజుల్లోనే పూర్తి చేశారు. డే అండ్ నైట్ షూటింగ్. కష్టమనిపించినా ఇష్టంగా చేశాను. నాకైతే ఇదో కాలేజీలాగా అనిపించింది. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.
 
నెక్లెస్‌రోడ్‌లో రైడ్...
నాకు హైదరాబాద్ పరిచ యమై ఏడు నెలలే అయినా.. ఇక్కడ సిటీలో కొన్ని ప్లేసెస్ నా మనసుకు ఎంతో చేరువయ్యాయి. ముఖ్యంగా హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహం చూస్తే ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ప్రతిరోజూ షూటింగ్ పూర్తయిన తరువాత కనీసం పది నిమిషాలైనా నె క్లెస్ రోడ్‌లో అలా రైడ్‌కి వెళ్లి వచ్చేదాన్ని. రోజంతా పడ్డ కష్టాన్ని ఆ పదినిమిషాల్లో మరిచిపోయేదాన్ని. నాకు మహేష్‌బాబు అంటే బాగా ఇష్టం. అదేదో సినిమాలో చెప్పినట్టు... నాకు కూడా మహేష్ అన్న పేరు వినగానే వైబ్రేషన్స్ మొదలవుతాయి. సో... తనతో హీరోయిన్‌గా చేసే చాన్స్ వస్తే అంతకు మించిన ఆనందమే లేదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement