సమ్మర్‌లో హాయి.. హాయ్ | cityplus chit chat with actor harini | Sakshi
Sakshi News home page

సమ్మర్‌లో హాయి.. హాయ్

Published Tue, Apr 21 2015 10:37 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

సమ్మర్‌లో హాయి.. హాయ్ - Sakshi

సమ్మర్‌లో హాయి.. హాయ్

‘పిచ్చెక్కిస్తా’ మూవీ ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైన అందాల బొమ్మ హరిణి మంగళవారం తాజ్ దక్కన్‌లో తళుకులీనింది. ‘ఫ్యాషన్ అన్‌లిమిటెడ్’ ఎక్స్‌పోను ప్రారంభించింది. ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ యాక్ససరీస్‌తో కొలువుదీరిన ఈ ఎక్స్‌పో నేడు కూడా కొనసాగనుంది. ఈ సందర్భంగా సిటీప్లస్‌తో హరిణి పంచుకున్న ముచ్చట్లు.. .
- శిరీష చల్లపల్లి
 
నాన్నది అసోం. అమ్మది విశాఖపట్నం. నేను అసోంలోనే పుట్టాను. చదువంతా వైజాగ్‌లోనే. నాకు ఇద్దరు చెల్లెళ్లు. నేను పూర్తిగా అమ్మకుట్టిని. నా ముద్దు పేరు అమ్ము. డిగ్రీ తరువాత మోడలింగ్ చేశాను. కొన్ని షోస్‌లో ర్యాంప్‌వాక్ చేశాను. అప్పుడే నాకు సినీ అవకాశాలు రాసాగాయి.‘పిచ్చెక్కిస్తా’ నా తొలి మూవీ. లాస్ట్ ఇయర్ ఈ మూవీ షూటింగ్ నిమిత్తం ఫస్ట్‌టైమ్ హైదరాబాద్ వచ్చా. గోల్కొండ ఫోర్ట్‌లో షూటింగ్ కావడంతో కోట మొత్తం చుట్టేశాను.

అక్కడ గోడలపై లవర్స్ పేర్లు, గబ్బిలాల చక్కర్లు, చప్పట్ల శబ్దాలు నాకు వింతగా అనిపించాయి. చికెన్ అంటే బాగా ఇష్టం. గోంగూర చికెన్ కాంబినేషన్ అదరగొట్టేలా వండుతాను. అది వండినప్పుడల్లా ఫ్రెండ్స్ అందరికీ మా ఇంట్లోనే ట్రీట్. ప్రస్తుతం ‘నాడు నేడు’, ‘వలయం’, ‘ఈ వయసులో’ సినిమాలు ప్రాసెస్‌లో ఉన్నాయి. నాకు పదహారణాల తెలుగమ్మాయి రోల్ వేయాలని ఉంది.

సౌందర్య నా అభిమాన నటి. ఇక సమ్మర్ సీజన్ బాగా ఇష్టం. కొబ్బరిబోండాలు, తాటిముంజలు, మామిడిపండ్లు ఈ సీజన్‌ను జాయ్‌ఫుల్‌గా మారుస్తాయి. ఈ హాట్ సమ్మర్‌లో స్విమ్మింగ్‌ని ఎంజాయ్ చేస్తా. పెళ్లిళ్లు, ఫంక్షన్లతో వేసవి భలే సందడిగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement