Taj Deccan
-
ఫుడ్ లవర్స్ అడ్డా.. హైదరాబాద్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని హోటల్ తాజ్ డక్కన్ వేదికగా జరిగిన 3వ ఎడిషన్ హైబిజ్ టీవీ ఫుడ్ అవార్డ్స్ ప్రదాన కార్యక్రమంలో టాలీవుడ్ నటి ఫరియా అబ్దుల్లా సందడి చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై.. ఫుడ్ గ్రాఫ్‌లో నగరాన్ని అత్యున్నత స్థానానికి తీసుకొచ్చేందుకు కృషి చేసిన వ్యక్తులతోపాటు హోటళ్లు, రెస్టారెంట్లు తదితర బ్రాండ్లకు 50 పురస్కారాలను ప్రదానం చేసింది.కంట్రీ ఓవెన్ ఫౌండర్ డాక్టర్ సుధాకర్ రావు, వివేరా హోటల్స్ చైర్మన్ సద్ది వెంకట్‌రెడ్డిలకు లెజెండ్ అవార్డులను అందజేసింది. ‘హైదరాబాద్ అంటేనే ఒక ఎమోషన్. నగరవాసులు ఫుడ్‌ను ప్రేమిస్తారు, ఆస్వాదిస్తారు’అని ఆమె అన్నారు. తనకు కట్టీ దాల్ చావల్ ఫేవరేట్ ఫుడ్ అని చెప్పారు. ఈ వేడుకల్లో భాగంగా మిస్ యూనివర్స్ తెలంగాణ నిహారిక సూద్, మిస్ గ్రాండ్ ఇండియా 2022 ప్రాచీ నాగ్‌పాల్ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో సుచిరిండియా సీఈవో లయన్ డాక్టర్ వై.కిరణ్, జెమిని ఎడిబుల్స్ సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి.చంద్రశేఖర్‌రెడ్డి, విమల ఫీడ్స్ మధుసూదన్‌రావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ తాజ్ డెక్కన్ లో బ్యూటెక్ కాస్మెటిక్ అండ్ సెలూన్ ఎక్స్పో (ఫోటోలు)
-
ఫ్యాషన్ ఫర్ కాజ్
-
విభిన్నం...వినూత్నం
తాజ్ డెక్కన్‌లో శనివారం ఫ్యాషన్ షో నిర్వహించారు. విభిన్న రకాల దుస్తులతో మోడల్స్ హొయలొలికించారు. నగరంలో తొలిసారి నిర్వహించిన ఇంటర్నేషనల్ గ్లామ్ ఫ్యాషన్ వీక్ బ్రాండ్ ఫ్యాషన్ ఈవెంట్ ఆకట్టుకుంది. బెంగళూరుకు చెందిన ఈ బ్రాండ్ ఆధ్వర్యంలో నగరంలో రెండురోజుల ఈ కార్యక్రమం శనివారం తాజ్‌డెక్కన్‌లో ప్రారంభమైంది. తొలిరోజు లక్నోకు చెందిన డిజైనర్ హర్షిజమాల్, ముంబయికి చెందిన సంతోష్, హైదరాబాద్‌కి చెందిన నాగరాజు, అమిన్ ఫరిష్టా తదితర 10 మంది డిజైనర్ల దుస్తులను మోడల్స్ ప్రదర్శించారు. డిజైనర్లు తమ కలెక్షన్లలో స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్స్‌కు ఎక్కువగా చోటు కల్పించారు. - సాక్షి, సిటీబ్యూరో -
సమ్మర్లో హాయి.. హాయ్
‘పిచ్చెక్కిస్తా’ మూవీ ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైన అందాల బొమ్మ హరిణి మంగళవారం తాజ్ దక్కన్లో తళుకులీనింది. ‘ఫ్యాషన్ అన్లిమిటెడ్’ ఎక్స్పోను ప్రారంభించింది. ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ యాక్ససరీస్‌తో కొలువుదీరిన ఈ ఎక్స్పో నేడు కూడా కొనసాగనుంది. ఈ సందర్భంగా సిటీప్లస్‌తో హరిణి పంచుకున్న ముచ్చట్లు.. . - శిరీష చల్లపల్లి నాన్నది అసోం. అమ్మది విశాఖపట్నం. నేను అసోంలోనే పుట్టాను. చదువంతా వైజాగ్‌లోనే. నాకు ఇద్దరు చెల్లెళ్లు. నేను పూర్తిగా అమ్మకుట్టిని. నా ముద్దు పేరు అమ్ము. డిగ్రీ తరువాత మోడలింగ్ చేశాను. కొన్ని షోస్‌లో ర్యాంప్‌వాక్ చేశాను. అప్పుడే నాకు సినీ అవకాశాలు రాసాగాయి.‘పిచ్చెక్కిస్తా’ నా తొలి మూవీ. లాస్ట్ ఇయర్ ఈ మూవీ షూటింగ్ నిమిత్తం ఫస్ట్‌టైమ్ హైదరాబాద్ వచ్చా. గోల్కొండ ఫోర్ట్‌లో షూటింగ్ కావడంతో కోట మొత్తం చుట్టేశాను. అక్కడ గోడలపై లవర్స్ పేర్లు, గబ్బిలాల చక్కర్లు, చప్పట్ల శబ్దాలు నాకు వింతగా అనిపించాయి. చికెన్ అంటే బాగా ఇష్టం. గోంగూర చికెన్ కాంబినేషన్ అదరగొట్టేలా వండుతాను. అది వండినప్పుడల్లా ఫ్రెండ్స్ అందరికీ మా ఇంట్లోనే ట్రీట్. ప్రస్తుతం ‘నాడు నేడు’, ‘వలయం’, ‘ఈ వయసులో’ సినిమాలు ప్రాసెస్‌లో ఉన్నాయి. నాకు పదహారణాల తెలుగమ్మాయి రోల్ వేయాలని ఉంది. సౌందర్య నా అభిమాన నటి. ఇక సమ్మర్ సీజన్ బాగా ఇష్టం. కొబ్బరిబోండాలు, తాటిముంజలు, మామిడిపండ్లు ఈ సీజన్‌ను జాయ్‌ఫుల్‌గా మారుస్తాయి. ఈ హాట్ సమ్మర్లో స్విమ్మింగ్‌ని ఎంజాయ్ చేస్తా. పెళ్లిళ్లు, ఫంక్షన్లతో వేసవి భలే సందడిగా ఉంటుంది. -
హైదరాబాద్‌లో శ్రీదేవి సందడి
-
నగరంలో అతిలోక సుందరి
-
షాపింగ్ స్పాట్
‘ఓ మంచి పనికోసం కొద్దిసేపు ఆగండి’ అంటూ దేశవ్యాప్త సంప్రదాయ, సమకాలీన డిజైనర్ వస్త్రాలు, ఆభరణాలు, యాక్సెసరీస్‌ను ఎగ్జిబిషన్‌గా మన ముందు పెట్టింది తాజ్ డెక్కన్‌లోని కోహినూర్ హాల్. దేశవ్యాప్తంగా పేదల విద్య, వైద్యం, కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్న ఇండియా ఫౌండేషన్ కోసం వై.మధుపమ ‘పాజ్ ఫర్ ఏ కాజ్’ పేరిట ఈ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే స్టైలిష్ డిజైన్స్ కాశ్మీరీ జర్దోసీ, మెరిసే షిఫాన్స్, అద్భుతమైన జార్జెట్స్ కొలువుదీరాయి. ఫ్యాషన్ ప్రియుల కోసం ఇండో-వెస్ట్రన్ వేర్ కూడా ఉంది. శనివారం కూడా ప్రదర్శన ఉంటుంది. - సాక్షి, సిటీ ప్లస్ ఫ్రెష్ లుక్ బుక్స్‌తో కుస్తీ పట్టే స్టూడెంట్స్ కాస్త ‘బ్రేక్’ తీసుకున్నారు. స్పైసీ లుక్స్‌తో మాస్ సాంగ్‌లకు స్టెప్పులేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో న్యూ స్టూడెంట్స్‌కు వెల్కమ్ చెప్పారు. బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ అవ్మూరుులు... శుక్రవారం ఫ్రెషర్స్ డే ను జాలీగా ఎంజాయ్ చేశారు. Petals కేరాఫ్ లేటెస్ట్ లగ్జరీ వరల్డ్‌లో తిరుగులేని ఎగ్జిబిషన్ పెటల్స్. పేరుకు తగ్గట్టుగానే పూల రెక్కలకు కొన్ని తేనెచుక్కలు కలిపి తయారు చేసినట్టున్న వస్త్రాలు, ఆభరణాలు తాజ్ కృష్ణాలో కొలువుదీరాయి. ముంబై, ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, పుణే, బెంగళూర్, కోల్‌కతా, చెన్నయ్ వంటి ప్రముఖ నగరాల్లోని 60 మంది టాప్‌మోస్ట్ డిజైనర్లు రూపొందించిన డిజైన్లు చూపరులను కళ్లు తిప్పుకోనివ్వడం లేదు. డ్రెస్‌లు, యాక్ససరీస్, గృహోపకరణాలు, గిఫ్టుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లేటెస్ట్ ట్రెండ్స్‌కి అద్దం పట్టిన ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకురాలు పద్మలతను సిటీ ప్లస్ పలకరించింది... ‘ఫిబ్రవరి, జూలై, దసరాకు ముందు ఏడాదిలో మూడుసార్లు జరిగే ఈ ఎగ్జిబిషన్ లేటెస్ట్ ట్రెండ్స్‌ను ఇష్టపడే ఇన్నోవేటివ్ పీపుల్‌కి కరెక్ట్ ప్లేస్. అయితే మొదటి దఫాలో చేనేతకు పట్టం కడితే.. రెండోసారి దేశవ్యాప్తంగా డిజైనర్లను హైదరాబాదీలకు పరిచయం చేయడం, ఇక మూడో విడతలో పాకిస్థాన్ సహా అంతర్జాతీయ డిజైనర్స్ లక్ష్యంగా ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. రానున్న పండుగలు, పెళ్లిళ్ల సీజన్ దృష్టిలో పెట్టుకొని మహిళల కోసం వెడ్డింగ్ కలెక్షన్ ఈ ఎగ్జిబిషన్లో ఉంచాం. ప్రత్యేకించి కంచి, బెనారస్‌తో పాటు ఇకత్ వంటి అన్ని రకాల డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. 60 స్టాళ్లలో కిడ్స్ కోసం కొన్ని ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశాం. వాటితోపాటు సూట్స్, బ్లౌజ్‌లు, హెయిర్ ఫ్యాషన్ యాక్సెసరీస్, ఫుట్‌వేర్, బ్యాగ్స్ ఇలా అన్నింటిలో లేటెస్ట్ ట్రెండ్స్. ఆకర్షణీయమైన పసిడి, వెండి, వజ్రాభరణాలు ఇక్కడ ప్రత్యేకత’ అంటున్నారు పద్మలత. ప్రవుుఖ గాయుని ఉష ఇందులోని వెరైటీలు చూసి వుుచ్చటపడ్డారు.