‘హైబిజ్’ కార్యక్రమంలో ఫరియా అబ్దుల్లా సందడి
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని హోటల్ తాజ్ డక్కన్ వేదికగా జరిగిన 3వ ఎడిషన్ హైబిజ్ టీవీ ఫుడ్ అవార్డ్స్ ప్రదాన కార్యక్రమంలో టాలీవుడ్ నటి ఫరియా అబ్దుల్లా సందడి చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై.. ఫుడ్ గ్రాఫ్‌లో నగరాన్ని అత్యున్నత స్థానానికి తీసుకొచ్చేందుకు కృషి చేసిన వ్యక్తులతోపాటు హోటళ్లు, రెస్టారెంట్లు తదితర బ్రాండ్‌లకు 50 పురస్కారాలను ప్రదానం చేసింది.
కంట్రీ ఓవెన్ ఫౌండర్ డాక్టర్ సుధాకర్ రావు, వివేరా హోటల్స్ చైర్మన్ సద్ది వెంకట్‌రెడ్డిలకు లెజెండ్ అవార్డులను అందజేసింది. ‘హైదరాబాద్ అంటేనే ఒక ఎమోషన్. నగరవాసులు ఫుడ్‌ను ప్రేమిస్తారు, ఆస్వాదిస్తారు’అని ఆమె అన్నారు. తనకు కట్టీ దాల్ చావల్ ఫేవరేట్ ఫుడ్ అని చెప్పారు. ఈ వేడుకల్లో భాగంగా మిస్ యూనివర్స్ తెలంగాణ నిహారిక సూద్, మిస్ గ్రాండ్ ఇండియా 2022 ప్రాచీ నాగ్‌పాల్ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో సుచిరిండియా సీఈవో లయన్ డాక్టర్ వై.కిరణ్, జెమిని ఎడిబుల్స్ సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి.చంద్రశేఖర్‌రెడ్డి, విమల ఫీడ్స్ మధుసూదన్‌రావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment