ఓయో రూమ్స్ బుకింగ్స్‌లో సిటీకి అగ్రస్థానం
మన తర్వాతే మిగిలిన మెట్రో నగరాలు
విశ్రాంతి, వ్యాపారం కోసమూ నగరానికి..
ట్రావెలోపీడియా 2024 నివేదికలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాకపోకలతో కిక్కిరిసిపోతున్న మన హైదరాబాద్.. హోటల్ బుకింగ్స్‌లోనూ టాప్‌గా నిలుస్తోంది. మెట్రో నగరాలన్నింటి కన్నా మిన్నగా మన నగరం అత్యధిక బుకింగ్స్ సాధిస్తోంది. ఈ విషయాన్ని లీజ్, ఫ్రాంచైజీ మోడల్స్‌లో గదులు అద్దెకు ఇచ్చే ప్రముఖ హాస్పిటాలిటీ సంస్థ ఓయో తాజాగా విడుదల చేసిన ట్రావెలోపీడియా 2024’ వార్షిక నివేదిక వెల్లడిస్తోంది. నివేదిక వెల్లడించిన మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలు..
వరుసగా రెండో ఏడాదీ మనమే..
గతేడాది కూడా మన నగరం అత్యధికంగా బుకింగ్స్ కలిగిన నగరంగా నిలిచింది. తర్వాత స్థానాల్లో వరుసగా బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా వంటి నగరాలు బుకింగ్‌లలో అగ్రస్థానాలను పొందగా, విచిత్రంగా ముంబై బుకింగ్స్‌లో దిగజారింది. దీనికి కారణం ముంబైకి వెళ్లే పర్యాటకులు ఆ నగరానికి సమీప ప్రాంతాల్లోని విశ్రాంతికి, విహారానికి అనువుగా ఉండే ప్రదేశాలను ల్లో ఉండేందుకు ఇష్టపడటమేనని తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్ టాప్..
దేశంలోకెల్లా ఉత్తరప్రదేశ్ ప్రయాణానికి అత్యంత ప్రజాదరణ పొందిన రాష్ట్రంగా నిలిచింది. పూరి, వారణాసి, హరిద్వార్ తీర్థయాత్రల రంగానికి నాయకత్వం వహించడంతో, ఆధ్యాతి్మక పర్యాటకం భారతదేశ పర్యాటకానికి ప్రధాన చోదకశక్తిగా ఉందని నివేదిక పేర్కొంది. డియోఘర్, పళని, గోవర్ధన్ వంటి ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్యలో గణనీయమైన మార్పు కనిపించింది. ఇది గతంలో అంతగా తెలియని ఆధ్యాత్మిక ప్రదేశాలపై పెరుగుతున్న ఆసక్తిని తెలియజేస్తోంది.
విహారం.. వ్యాపారం..
విశ్రాంతి, విహారాలతో పాటు వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన ప్రయాణాల్లోనూ హైదరాబాద్ గణనీయమైన పెరుగుదల చూసింది. ప్రయాణికుల సంఖ్యాపరంగా చూస్తే మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక వరుసగా తొలి మూడు స్థానాలు దక్కించుకున్నాయి. బీహార్‌లోని పాటా్న, ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, కర్ణాటకలోని హుబ్లీ వంటి చిన్న పట్టణాలు ఈ ఏడాది అద్భుతమైన వృద్ధితో బుకింగ్‌లు 48 శాతం పెంచుకున్నాయి. జైపూర్, గోవా, పాండిచ్చేరి, మైసూర్ అగ్ర పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి.
మళ్లీ మనమే..
Comments
Please login to add a commentAdd a comment