సాక్షి, సిటీబ్యూరో: సినీరంగంలో రాణించాలనుకుని, ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించేందుకు ఇండో–ఆస్ట్రేలియన్ ప్రొడక్షన్ హౌజ్ అయిన మెల్‌బోర్న్ మామా క్రియేటివ్ స్పేస్ సంస్థతో మాదల వేణు, రమాకాంత్ కలిసి ఏర్పాటు చేసిన ఆర్‌వీ స్క్వేర్ క్రియేటివ్ హబ్‌తో కొలాబ్ అయ్యారు. ఔత్సాహిక నిర్మాతలు, ప్రతిభావంతులైన కళాకారుల కలలకు ప్రాణం పోసేందుకు ఈ రెండు సంస్థలు ఒకటయ్యాయి.
సినిమా, వెబ్‌సిరీస్‌లకు సంబంధించి ఔత్సాహిక డైరెక్టర్లు, రచయితలు, నటీనటులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ప్రాజెక్టును ముందుకు నడిపించడమే తమ ఉద్దేశమని ఆర్‌వీ స్క్వేర్ క్రియేటివ్ హబ్ వ్యవస్థాపకుడు మాదల వేణు పేర్కొన్నారు. ఈ రెండు సంస్థల కలయికకు సంబంధించి కార్యక్రమం హైదరాబాద్‌లోని ఓ హోటల్ వేదికగా జరిగింది. ముఖ్య అతిథిగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ హాజరయ్యారు. కార్యక్రమంలో భారతీయం సత్యవాణి, పద్మశ్రీ శోభ రాజు, ఉప్పల శారద, పీవీ నర్సింహారావు మనవరాలు అజిత సురభి, మాలావత్ పూర్ణ, మాదల వేణు, ప్రముఖ సింగర్ ఎంఎం శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు.
వన్నెతగ్గని హ్యాండ్లూమ్..
సాక్షి, సిటీబ్యూరో: చేనేతకారులు నేసిన వస్త్ర సౌందర్యాల మధ్య ప్రముఖ టాలీవుడ్ వర్ధమాన నటి సౌమ్య జాను సందడి చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్–12లోని కళింగ కల్చరల్ హాలు వేదికగా బుధవారం ఏర్పాటు చేసిన ‘హ్యాండ్ టూ హ్యాండ్’ చేనేత వస్త్ర ప్రదర్శనను సినీ నటి సౌమ్య జాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిలో పట్టు, హ్యాండ్లూమ్ వ్రస్తోత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని, ఈ ఉత్పత్తులపై నేటికీ వన్నె తగ్గలేదని తెలిపారు.
నేటితరం యువత కూడా హ్యాండ్ లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారన్నారు. వీటిని సినీతారలు ప్రత్యేకంగా కస్టమైజ్ చేసుకుని ధరిస్తున్నారని ఆమె అన్నారు. ప్రదర్శన 24వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. 14 రాష్ట్రాలకు చెందిన చేనేతకారులు, చేతి పని బృందాలు తమ సిల్క్ హ్యాండ్లూమ్ చీరలు, డ్రెస్ మెటీరియల్ వంటి 75 వేల రకాల వస్త్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచారని నిర్వాహకులు జయేష్ గుప్తా వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment