షాపింగ్ స్పాట్ | The exhibition is aimed at designers | Sakshi
Sakshi News home page

షాపింగ్ స్పాట్

Published Sat, Jul 5 2014 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 9:48 AM

షాపింగ్  స్పాట్

షాపింగ్ స్పాట్

‘ఓ మంచి పనికోసం కొద్దిసేపు ఆగండి’ అంటూ దేశవ్యాప్త సంప్రదాయ, సమకాలీన డిజైనర్ వస్త్రాలు, ఆభరణాలు, యాక్సెసరీస్‌ను ఎగ్జిబిషన్‌గా మన ముందు పెట్టింది తాజ్ డెక్కన్‌లోని కోహినూర్ హాల్. దేశవ్యాప్తంగా పేదల విద్య, వైద్యం, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ కోసం పనిచేస్తున్న ఇండియా ఫౌండేషన్ కోసం వై.మధుపమ ‘పాజ్ ఫర్ ఏ కాజ్’ పేరిట ఈ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే స్టైలిష్ డిజైన్స్ కాశ్మీరీ జర్దోసీ, మెరిసే షిఫాన్స్, అద్భుతమైన జార్జెట్స్ కొలువుదీరాయి. ఫ్యాషన్ ప్రియుల కోసం ఇండో-వెస్ట్రన్ వేర్ కూడా ఉంది. శనివారం కూడా ప్రదర్శన ఉంటుంది.
 - సాక్షి, సిటీ ప్లస్
 
 ఫ్రెష్ లుక్
 బుక్స్‌తో కుస్తీ పట్టే స్టూడెంట్స్ కాస్త ‘బ్రేక్’ తీసుకున్నారు. స్పైసీ లుక్స్‌తో మాస్ సాంగ్‌లకు స్టెప్పులేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో న్యూ స్టూడెంట్స్‌కు వెల్‌కమ్ చెప్పారు. బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ అవ్మూరుులు... శుక్రవారం  ఫ్రెషర్స్ డే ను జాలీగా ఎంజాయ్ చేశారు.
 
 Petals  కేరాఫ్ లేటెస్ట్

 లగ్జరీ వరల్డ్‌లో తిరుగులేని ఎగ్జిబిషన్ పెటల్స్. పేరుకు తగ్గట్టుగానే పూల రెక్కలకు కొన్ని తేనెచుక్కలు కలిపి తయారు చేసినట్టున్న వస్త్రాలు, ఆభరణాలు తాజ్ కృష్ణాలో కొలువుదీరాయి. ముంబై, ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, పుణే, బెంగళూర్, కోల్‌కతా, చెన్నయ్ వంటి ప్రముఖ నగరాల్లోని 60 మంది టాప్‌మోస్ట్ డిజైనర్లు రూపొందించిన డిజైన్లు చూపరులను కళ్లు తిప్పుకోనివ్వడం లేదు. డ్రెస్‌లు, యాక్ససరీస్, గృహోపకరణాలు, గిఫ్టుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లేటెస్ట్ ట్రెండ్స్‌కి అద్దం పట్టిన ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకురాలు పద్మలతను సిటీ ప్లస్ పలకరించింది...
 
 ‘ఫిబ్రవరి, జూలై, దసరాకు ముందు ఏడాదిలో మూడుసార్లు జరిగే ఈ ఎగ్జిబిషన్ లేటెస్ట్ ట్రెండ్స్‌ను ఇష్టపడే ఇన్నోవేటివ్ పీపుల్‌కి కరెక్ట్ ప్లేస్. అయితే మొదటి దఫాలో చేనేతకు పట్టం కడితే.. రెండోసారి దేశవ్యాప్తంగా డిజైనర్లను హైదరాబాదీలకు పరిచయం చేయడం, ఇక మూడో విడతలో పాకిస్థాన్ సహా అంతర్జాతీయ డిజైనర్స్ లక్ష్యంగా ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. రానున్న పండుగలు, పెళ్లిళ్ల సీజన్ దృష్టిలో పెట్టుకొని మహిళల కోసం  వెడ్డింగ్ కలెక్షన్ ఈ ఎగ్జిబిషన్‌లో ఉంచాం.

ప్రత్యేకించి కంచి, బెనారస్‌తో పాటు ఇకత్ వంటి అన్ని రకాల డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. 60 స్టాళ్లలో కిడ్స్ కోసం కొన్ని ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశాం. వాటితోపాటు  సూట్స్, బ్లౌజ్‌లు, హెయిర్ ఫ్యాషన్ యాక్సెసరీస్, ఫుట్‌వేర్, బ్యాగ్స్ ఇలా అన్నింటిలో లేటెస్ట్ ట్రెండ్స్. ఆకర్షణీయమైన పసిడి, వెండి, వజ్రాభరణాలు ఇక్కడ ప్రత్యేకత’ అంటున్నారు పద్మలత. ప్రవుుఖ గాయుని ఉష ఇందులోని వెరైటీలు చూసి వుుచ్చటపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement