designer clothing
-
ఖర్చు ఎక్కువని భయపడుతున్నారా? ఈ డిజైనర్ పట్టీలతో..
Outfit Elevation Design Ideas: వేడుకల సందర్భాల్లో ధరించే సంప్రదాయ దుస్తులకు ఎంబ్రాయిడరీ చేయించడం చూస్తూనే ఉంటాం. వాటి తయారీ కోసం కొన్ని రోజుల వరకు ఎదురుచూడటం ఖర్చు ఎక్కువ అవుతుందనుకోవడం కూడా వింటుంటాం. వీటి స్థానంలో మార్కెట్లో లభించే వివిధ రకాల డిజైనరీ పట్టీలు విస్తృతంగా వచ్చి చేరాయి. ఈ ఎంబ్రాయిడరీ స్ట్రిప్స్‌తో డ్రెస్ స్టైల్లో వచ్చిన మార్పులు మరింత అందాన్ని తీసుకువస్తున్నాయి. ఇతర అలంకారాలకూ.... బ్యాగ్, బ్యాంగిల్స్, నడుముకు ధరించే బెల్ట్... ఇలాంటి వాటిని కూడా అందమైన ఎంబ్రాయిడరీ పట్టీలను ఉపయోగిస్తూ తమ స్టైల్‌ని మరింత ఆకర్షణీయంగా మార్చేస్తున్నారు. ఇందుకు చేయాల్సిందల్లా మ్యాచింగ్ స్ట్రిప్స్‌ని ఎంచుకోవడమే. అందుకు ఎలాగూ అవకాశం ఉంది కదా! కాటన్, సిల్క్, డెనిమ్... ఫ్యాబ్రిక్ ఏదైనా, ఇండో వెస్ట్రన్ స్టైల్‌కి తీసుకురావచ్చు. సంప్రదాయ ఎంబ్రాయిడరీ స్ట్రిప్స్ ఎంచుకుంటే వాటిని కుర్తీ, లెహంగా, శారీ డిజైన్స్‌కు వాడచ్చు. అదే, వెస్ట్రన్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్నవి లేదా మన ఇతర ప్రాచీన ఎంబ్రాయిడరీ కళతో ఉన్న స్ట్రిప్స్‌ని మోడర్న్ డ్రెస్ డిజైన్స్‌లో ఉపయోగించవచ్చు. చదవండి: Fashion Trends: వేడుకలో మరింత వెలిగిపోయేలా.. Malavika Sharma: అందమైన అల్లికల శారీలో మెస్మరైజ్ చేస్తున్న మాళవిక! చీర ధర 68 వేలకు పైమాటే! -
Hyderabad: ఐఐటీలో మొదలైన ఉద్యోగ ప్రస్థానం! ఇప్పుడేమో సొంతంగా ఇలా..
ఐఐటీ చెన్నైతో మొదలైంది ఆమె ఉద్యోగ ప్రస్థానం. బిర్లా ఫార్మా, అద్వానీ ఆర్లికాన్, జండు ఫార్మా గ్రూప్ కంపెనీల్లో సాగింది. పెళ్లి తరవాత హైదరాబాద్‌కు వచ్చారామె. హైదరాబాద్‌లో టాటా క్రెడిట్ కార్ట్స్‌లో ఉద్యోగం. ఎంబీయే హెచ్ఆర్ చేసిన కాత్యాయని రెండు దశాబ్దాలకు పైగా ప్రఖ్యాతి చెందిన పెద్ద కంపెనీల్లో హెచ్ఆర్ మేనేజర్‌గా ఉద్యోగం చేశారు. ఓ సారి ప్రశాంతంగా సింహావలోకనం చేసుకున్నప్పుడు తెలిసింది ఏమిటంటే... ఇప్పటి వరకు తన మేధను, శ్రమను ఆయా కంపెనీల వృద్ధికే వెచ్చించడమైంది. ఇన్నేళ్ల తర్వాత తన ఐడెంటిటీ ఏమిటి? ఫలానా, ఫలానా కంపెనీల మాజీ ఉద్యోగి అనేది మాత్రమే. రిటైర్మెంట్ వరకు ఉద్యోగం చేసినా తన గుర్తింపు ఇదే. ‘జీవితం అంటే ఇది కాదు’ అని ఆమెకి అనిపించిన క్షణాలు చాలా బలమైనవే కావచ్చు. తనకు తానుగా గుర్తింపు తెచ్చుకోవాలి. ఇలా సాగిన ఆలోచనలకు ప్రతిరూపమే త్రిష ట్రెండ్స్. ఇప్పుడామె త్రిష ట్రెండ్స్ ఫౌండర్‌నని తనను తాను గర్వంగా పరిచయం చేసుకుంటున్నారు. ప్రయోగాల పర్వం! ‘‘మా కుటుంబ మూలాలు కడప జిల్లాలో ఉన్నాయి. నాన్న వ్యాపార ఉద్యోగాల రీత్యా నేను పెరిగింది, చదువు చెన్నైలోనే. పెళ్లితో హైదరాబాద్ వచ్చాను. ఈ నగరంతో మమేకమైపోయాననే చెప్పాలి. నా లైఫ్ జర్నీని ఉద్యోగం చేసిన రోజులు, ఉద్యోగాలిస్తున్న రోజులుగా విభజించుకోవచ్చు. సృజనాత్మకతకు అవకాశం ఉండాలి, నా మార్కు ప్రతిబింబించే పని చేయాలి, నా ఆలోచనలకు ఒక రూపం ఇవ్వాలి... ఇలా ఆలోచించి డిజైనర్ ట్రెండ్స్‌తో కొత్త పంథాలోకి వచ్చేశాను. డిజైనర్ క్లాత్ ఇండస్ట్రీ నిర్వహణ ఎంత సంతృప్తినిస్తోందంటే... ఏ రోజుకారోజు చైతన్యవంతంగా ఉంచుతోంది. ఒక కొత్త డిజైన్‌కి రూపకల్పన చేయడంలో ఉండే సంతోషాన్ని ఆస్వాదిస్తున్నాను. మధురై, కంచి, కోయంబత్తూర్, భాగల్పూర్, కోట, అస్సాం, కోల్‌కతాల నుంచి మెటీరియల్ తెస్తాను. దక్షిణాది మెటీరియల్ మీద ఉత్తరాది ట్రెడిషనల్ డిజైన్స్, అక్కడి వస్త్రాల మీద మన దక్షిణాది డిజైన్ల సమ్మేళనంతో అనేక ప్రయోగాలు చేయడం... కొత్త ఉత్సాహాన్నిస్తోంది. మ్యాగజైన్లు, ఇంటర్నెట్ సర్ఫింగ్‌తో దేశంలోని అన్ని ప్రాంతాల ట్రెడిషనల్ డిజైన్లను, ఆలయాల మీద చెక్కిన శిల్పాల నుంచి కొత్త డిజైన్లను సేకరిస్తాను. ఆ పేపర్ని బ్లాక్ మేకర్స్‌కి ఇచ్చి బ్లాక్ చేయించుకుంటాను. అలా నేను సేకరించిన కళల నిధి, జ్ఞాన నిధి వేలాది బ్లాక్‌ల రూపంలో ఉంది. ప్రతి బ్లాక్ డిజైన్ వెనుక ఓ చరిత్ర, సంస్కృతి ఉంటుంది. గుజరాత్, సింద్, రాజస్థాన్‌లో ప్రసిద్ధి చెందిన అజ్రక్ ప్రింట్ మీద కూడా స్టడీ చేసి బ్లాక్‌లు చేయించాను. మహిళలకు మార్గదర్శనం సగటు మహిళల విషయానికి వస్తే... సొంతంగా ఏదో ఒకటి చేయాలనుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. వాళ్లు సరైన దిశానిర్దేశం చేసే వాళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. నేను కూడా ఎమ్ఎస్ఎమ్ఈ ద్వారా ఇండస్ట్రీ పెట్టాను. నా దగ్గరకు వచ్చిన వాళ్లకు మొదట నేను అనుసరించిన విధానాన్ని వివరిస్తాను. ఎమ్ఎస్ఎమ్ఈ (మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియమ్ ఎంటర్ప్రైజెస్) ద్వారా ప్రభుత్వ పథకాలను ఎలా అందుకోవాలో వివరిస్తాను. ఏదైనా చేయాలనే ఉత్సాహం ఉండి ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉండే మహిళలకు నా సూచన ఒక్కటే... సమాజంలో అవసరాన్ని గుర్తించి ఆ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలి. ఓ ఇరవై ఏళ్ల కిందట టెలిఫోన్ బూత్‌లు వీథికి రెండు–మూడు ఉండేది. మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత అవి కనుమరుగయ్యాయి. మొబైల్ ఫోన్లు, రీచార్జ్, యాక్సెసరీస్ షాపులు కనిపిస్తున్నాయి. ఇక ఎప్పటికీ డిమాండ్ తగ్గని రంగాలు ప్రధానంగా మూడు... ఆహారం, ఔషధాలు, దుస్తులు. మనిషి పుట్టినప్పటి నుంచి ఆయుష్షు ఉన్నంత వరకు వీటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత స్థానం బ్యూటీ ఇండస్ట్రీది. తమ అభిరుచిని, మార్కెట్ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుంటే జాబ్ సాటిస్ఫాక్షన్, ఇండస్ట్రీ గ్రోత్ రెండూ ఉంటాయి’’ అని తన జీవనప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారు కాత్యాయని. స్కూళ్లు, కాలేజీల్లో ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్‌కి ఈ పాఠాలు, ప్రాజెక్ట్ వర్క్‌లు ఉంటున్నాయి. మా యూనిట్‌కి వచ్చే పిల్లలకు రంగులు కలపడం, డిజైన్ అద్దడం, బ్లాక్‌ల గురించి థియరీ వివరిస్తాను. మనం నేర్చుకున్న విద్య ఇచ్చే సంతోషం మాటల్లో వర్ణించనలవి కాదు. ప్రాజెక్ట్ వర్క్ కోసం వచ్చిన పిల్లలు వాళ్లు నేర్చుకున్న ఆర్ట్‌ని క్లాత్ మీద ముద్రించుకుని ఎంతగా మురిసిపోతారో! దానిని భద్రంగా పట్టుకోవడం, నలగకుండా జాగ్రత్తగా బుక్‌లో పెట్టుకోవడం చూస్తుంటే ముచ్చటేస్తుంది. నేను ఈ రంగంలో దాదాపుగా రీసెర్చ్ చేశాననే చెప్పాలి. నేను సేకరించిన వివరాలు, తెలుసుకున్న విషయాలను శాస్త్రబద్ధంగా గ్రంథస్తం చేయాలి. – పులికుంట కాత్యాయని, ఫౌండర్, త్రిష ట్రెండ్స్ – వాకా మంజులారెడ్డి చదవండి: Menthi Podi: షుగర్ పేషెంట్లు రాత్రి వేళ మెంతి గింజల్ని పాలలో ఉడకబెట్టి తాగితే.. International Disability Day: నిశ్శబ్ద విజయం -
ప్రగ్యా జైస్వాల్ కట్టుకున్న చీర ఖరీదెంతో తెలుసా?
‘కంచె’ సినిమాలో సంప్రదాయకట్టుతో కనిపించిన ప్రగ్యా జైస్వాల్.. ఫ్యాషన్ అవుట్ ఫిట్స్‌లోనూ అంతే మెరుస్తుంది. ఆ ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేసే బ్రాండ్స్ ఇవే.. అనావిలా.. ముతక చీరలంటే ముసలివాళ్లకు మాత్రమే అనుకునే ఎంతోమంది ఆలోచనను మార్చేసింది ముంబైకి చెందిన అనామిలా మిశ్రా. 2004లో ‘అనామిలా’ పేరుతో లెనిన్ ఫ్యాబ్రిక్ ఉపయోగించి, డిజైన్ చేసిన శారీ కలెక్షన్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. ఆ క్రేజ్ రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. బోరింగ్ డిజైన్స్‌కు చెక్ పెట్టేలా ఉండే ఈ డిజైన్స్‌కు సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతారు. కేవలం లెనిన్ ఫ్యాబ్రిక్ చీరలనే అనామిలా డిజైన్ చేస్తుంది. అయితే, వీటి ధర సాధారణ పట్టుచీర కంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది. విదేశాల్లోనూ వీటికి మంచి గిరాకి ఉంది. ముంబైలో మెయిన్ బ్రాంచ్ ఉంది. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. హౌజ్ ఆఫ్ శిఖా చాలామంది అమ్మాయిల్లాగే .. శిఖా మంగల్‌కు కూడా ఆభరణాలంటే ఇష్టం. ఆ ఇష్టం పెద్దయ్యాక ఆసక్తిగా మారింది. అలా బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు చేసి, 2014లో ‘హౌజ్ ఆఫ్ శిఖా’ ప్రారంభించింది. ఇదొక ఆన్లైన్ జ్యూయెలరీ స్టోర్. ప్రముఖ డిజైనర్స్ అందించే అందమైన ఆభరణాలన్నీ ఇక్కడ లభిస్తాయి. కొత్తతరం డిజైనర్స్‌కు ప్రాముఖ్యతనివ్వడంతో, డిజైన్స్ అన్నింటిలోనూ న్యూస్టయిల్ ప్రతిబింబిస్తుంది. అదే దీని బ్రాండ్ వాల్యూ. పేరుకు దేశీ బ్రాండ్ అయినా ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్లైన్లో మాత్రమే కొనుగోలు చేయొచ్చు. టోట్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం. ఎక్కువగా వాటినే షాపింగ్ చేస్తుంటా. కేవలం ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ధరించే దుస్తులపై దృష్టి సారిస్తా. చదవండి: Sai Pallavi : స్టేజ్ మీద సాయి పల్లవి కన్నీళ్లు.. కారణం ఏంటంటే -
డిఫరెంట్ గెటప్స్ ట్రై చేసేది అందుకే: జాతిరత్నాలు భామ
చిట్టి.. నా బుల్బుల్ చిట్టి.. అంటూ కుర్రకారు మనసు దోచుకున్న నటి, సొగసైన పొడగరి ఫరియా అబ్దుల్లా.. మొదటి సినిమాతో ఇటు గ్లామర్ పరంగా అటు నటనాపరంగా వందశాతం మార్కులు కొట్టేసింది. ఆరేళ్ల వయసులోనే యాక్టర్ కావాలనుకుందట ఈ అమ్మడు. అందుకే డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్, డ్రెస్‌లు ట్రై చేస్తుంటానని చెప్పింది చిట్టి. ఆ నటికి నచ్చిన.. ఆమె మెచ్చిన బ్రాండ్స్ ఇవీ.. గీతిక కానుమిల్లి.. హైదరాబాద్‌కు చెందిన గీతిక కానుమిల్లి.. చిన్నప్పటి నుంచి పెద్ద ఫ్యాషన్ డిజైనర్ కావాలని కలలు కంది. ఆ ఆసక్తితోనే ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసింది. అనంతరం 2018లో హైదరాబాద్‌లో ‘గీతిక కానుమిల్లి’ అని తన పేరుమీదే ఓ బొటిక్ ప్రారంభించింది. అనతి కాలంలోనే ఆమె డిజైన్స్ పాపులర్ అయి, మంచి గుర్తింపు తెచ్చుకుంది. పి.వి.సింధు, సమంత, కీర్తి సురేష్, సైనా నెహ్వాల్ వంటి చాలా మంది సెలబ్రిటీలకు దుస్తులను డిజైన్ చేసింది. ధర కూడా డిజైన్‌ను బట్టే ఉంటుంది. ఇక్కడ ఏది కొనాలన్నా వేల నుంచి లక్షల్లో ఖర్చు చేయాలి. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్ అన్నిటిలోనూ ఈ డిజైన్స్ లభిస్తాయి. ద ట్రింక్ హాలిక్.. ఇదొక ఇన్స్టాగ్రామ్ షాపింగ్ సైట్. ఈ మధ్యనే మొదలైన ఈ బ్రాండ్ .. అతి తక్కువ ధరలకే అందమైన జ్యూయెలరీని అందిస్తోంది. క్వాలిటీకి పెట్టింది పేరు. అదే వీరి బ్రాండ్ వాల్యూ. అందుకే, సామాన్య ప్రజల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీలకు ఇది ఫేవరెట్. ఇతర బ్రాండ్స్‌తో పోలిస్తే కాస్త సరసమైన ధరల్లోనే లభిస్తాయి. ఇన్స్టాగ్రామ్ మెయిన్ ప్లాట్‌ఫామ్‌గా వీటిని కొనుగోలు చేయొచ్చు. వాట్సాప్ చేసి కూడా ఆర్డర్ చేయొచ్చు. చదవండి: క్లాస్ అయినా.. మాస్ అయినా ఆయనే ‘బాస్’ -
Designer Sarees: జీవన సౌందర్యం
కళకు జీవనశైలి తోడైతే అది ఎప్పుడూ సజీవంగా ఆకట్టుకుంటూనే ఉంటుంది. దుస్తులపై ముద్రణ అనేది ఈ నాటిది కాదు. కానీ, హస్తకళా నైపుణ్యంతో ఒక థీమ్ డిజైన్ తీసుకురావడం ఎప్పుడూ ప్రత్యేకతను చాటుతుంది. అలా ఇండియన్ ట్రక్ ఆర్ట్ నుంచి ప్రేరణ పొందిన డిజైన్స్ ఇవి. చీర అంటే తనకెంత ఇష్టమో విద్యాబాలన్ శారీ కలెక్షన్ చూస్తుంటే అర్థమవుతుంది. ఏ ఈవెంట్‌కైనా చీరకట్టుతో కనిపించే విద్యాబాలన్ తన సినిమా టైటిల్‌కు తగినట్టుగా ఆ చీర డిజైన్ ఉండాలనుకుంటారు. ఇటీవల ఆమె నటించిన ‘షేర్నీ’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఐష్ర్ ఇలస్ట్రేషన్స్ స్టూడియో వారి హార్న్ ఓకే ప్లీజ్ సేకరణ నుంచి తీసుకున్న శారీలో మెరిశారు విద్యాబాలన్. చీర కొంగుపై పులి ముఖం, ముడివేసిన కేశాలంకరణ, చెవి రింగులతో విద్యా లుక్ నిజంగానే పులిలా గంభీరంగా కనిపిస్తుంది. మన రోడ్లమీద ట్రక్స్ చూస్తే వాటి మీద రాసి ఉన్న అక్షరాలు, ప్రింట్లు ఆకర్షిస్తుంటాయి. అవి చాలా సాదా సీదాగా అనిపించినా ఆ ట్రక్స్కే ఆ డిజైన్స్ సొంతం అనిపిస్తాయి. ఆకర్షణీయమైన రంగుల్లో కనిపించే ఆ డిజైన్స్‌ని ఒడిసిపట్టుకొని, వాటిని చీరలు, దుపట్టాల మీదకు తీసుకువస్తే ఎలా ఉంటాయో చేసిన ప్రయత్నమే ఈ ‘హార్న్ ఓకే ప్లీజ్.’ సేంద్రీయ మస్లిన్ ఫ్యాబ్రిక్‌ను ఎంచుకుని, బయోడిగ్రేడబుల్ రంగులతో ఇండియన్ ట్రక్ ఆర్ట్ నుండి ప్రేరణ పొందిన 9 ప్రింట్లతో ఐశ్వర్యా రవిచంద్రన్ చేతిలో రూపుదిద్దుకున్న చిత్రకళ ఇది. ఐశ్వర్యా రవిచంద్రన్ ఇలస్ట్రేటర్, ఫ్యాషన్ డిజైనర్ కూడా. వినూత్నమైన కళకు సంప్రదాయ సొబగులు అద్ది శారీస్, జాకెట్స్, షర్ట్స్, జ్యువెలరీని కూడా రూపొందిస్తున్నారు. ఈ ప్రత్యేక కలెక్షన్‌ను ఆర్గానిక్ మెటీరియల్‌పై సంప్రదాయ రంగుల కళను తీసుకొచ్చి దేనికది స్పెషల్‌గా రూపొందించిన చీరలు, దుపట్టాలు ప్రత్యేకతను చాటుతున్నాయి. -
ఫ్యాషన్ 2021: సౌకర్యమే స్టైల్
కరోనా కారణంగా దాదాపు పది నెలలు ఇంటి పట్టునే ఉన్నవారు కాస్తా ఇప్పుడిప్పుడే చిన్న చిన్న వేడుకలకి హాజరవడానికి సిద్ధపడుతున్నారు. 2020లో పండగలు, పార్టీలు, వేడుకలు, వైవిధ్యాలు.. అన్నీ ఇంట్లోనే. కంఫర్ట్ కోసం క్యాజువల్స్కే పరిమితం అయినా ఇక నుంచి గతం నేర్పిన పాఠాలతో కొత్తదనం నింపుకోక తప్పదు. 2021లో దుస్తుల ఎంపిక ప్రత్యేకంగా ఉంటుందనే ఆలోచనతో డిజైనర్లు సైతం ఆ దిశగా ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నారు. ఫ్యాషన్ పోకడల్లోనూ మార్పులు సంతరించుకోనున్నాయి. ఎంపికలు ప్రత్యేకంగా ఉండనున్నాయి. స్వీయ సంరక్షణ పేరిట తీసుకునే జాగ్రత్తల్లో మొదటి ఎంపిక ధరించే దుస్తులదే కాబట్టి మోర్ కేర్.. కంఫర్ట్ స్టైల్ ఈ సంవత్సరమంతా ట్రెండ్‌లో ఉండనుంది. మహమ్మారి సమయంలోనూ రాబోయే ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ డిజైనర్లైన తరుణ్ తహిలియాని, సబ్యసాచి, రోహిత్‌బాల్ వంటివారే కాకుండా వర్ధమాన డిజైనర్లు సైతం చేనేతలకు, హస్తకళలకు ప్రాముఖ్యమివ్వడం విశేషం. దేశవాళీ ఫ్యాబ్రిక్కే మొదటి స్థానం ఆభరణాల ఊసు లేకుండా ప్రింట్లున్న చేనేత దుస్తులు ఏ సీజన్‌కైనా నప్పుతాయన్నది డిజైనర్ల అభిప్రాయం. ఈ విధంగా చూస్తే దేశవాళీ కాటన్‌తో తయారైన ఫ్యాబ్రిక్ ఎంపిక పట్ల ఈ ఏడాది మరింత ఆసక్తి పెరగనుంది. ఒంటికి హాయిని, చెమటను పీల్చుకోదగినవి ఎంపికలో ముందండబోతున్నాయి. కాంతిమంతమైన రంగులు ఎంచుకున్నప్పటికి సౌకర్యానికి ప్రాధాన్యమిచ్చేలా వదులుగా ఉండే దుస్తులకే ఓటు వేయనున్నారు. లేత రంగులకే ప్రాధాన్యం.. ఇంటికే పరిమితమైన ప్రాణం బయటకు వచ్చినా కొన్నాళ్లపాటు ఇంకా సౌకర్యాన్నే కోరుకుంటుంది. అందుకే ఈ ఏడాది లేత రంగుల దుస్తులకే ప్రాధాన్యత పెరగనుంది. కంటికి, ఒంటికి హాయినిచ్చే రంగు దుస్తులు ట్రెండ్ కాబోతున్నాయి. అంతేకాదు, జెండర్ ప్రమాణాలను స్పష్టంగా చూపే గులాబీ, బ్లూ, పచ్చ, లావెండర్ రంగులు మరింత వెలుగులోకి రానున్నాయి. దుస్తుల్లో బేబీ పింక్ కలర్ ఈ దశాబ్దంలోనే ముందంజలో ఉంది. ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలు సైతం బేబీ పింక్‌లో డ్రెస్సులు, ఇతర ఉపకరణాలను రూపొందించాయి. ఇక ముందు ఇదే రంగు ముందంజలో ఉండబోతోంది. మళ్లీ మళ్లీ వాడదగిన వాటికే ఓటు గత సంవత్సరం ఫ్యాషన్ పోకడలను అప్పుడప్పుడే వదలలేం. అలాగని ఫ్యాషన్‌కి తగ్గట్టుగా మారకుండా ఉండలేం. అందుకే, సౌకర్యంతోపాటు వాడిన డ్రెస్సులను తిరిగి వాడుకునేలా చిన్న చిన్న మార్పులు చేసుకోదగిన దుస్తుల ఎంపిక ఈ ఏడాది ఉంటుంది. ఇప్పటికే వాడని దుస్తులను కొద్దిపాటి మార్పులు చేసుకుంటూ మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ ధరించవచ్చు. పండగలు, పెళ్లి వేడుకలనూ ఈ మిక్స్ అండ్ మ్యాచ్‌తోనే గ్రాండ్‌గా రూపుకట్టనున్నారు. ఖర్చును కట్టడి చేయడానికి మిక్స్ అండ్ మ్యాచ్ ఒక ట్రెండ్‌గా మారనుంది. దీంట్లో భాగంగానే రెట్రో ట్రెండ్ ఉంటుంది. జిమ్ వేర్ టు క్యాజువల్ వేర్ ఆరోగ్యంగా ఉండటం, ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్ని తినడం, వ్యాయామశాలలకు వెళ్లడం వంటివి అత్యవసరం అయ్యాయి. దీంతో ఫ్యాషన్ వర్కౌట్ డ్రెస్సులకు డిమాండ్ పెరిగింది. వీటిలో గ్రాఫిక్ నమూనాలు, నాణ్యత గల డ్రెస్సుల ఎంపికవైపు జనం ఆసక్తి చూపుతున్నారు. వ్యాయామం కోసమే కాకుండా క్యాజువల్ వేర్‌గానూ విభిన్నంగా ఉపయోగించే దుస్తులు కూడా ఈ సంవత్సరం ట్రెండ్‌లో ఉండబోతున్నాయి. డిజైనర్ మాస్కులు డ్రెస్‌కి తగిన మాస్క్ అనేది జాబితాలో మరింత గ్రాండ్‌గా చేరిపోనుంది. కాటన్ డ్రెస్ వేసినప్పటికి, ముక్కును, నోటిని కవర్ చేసే మాస్క్ కొత్త కొత్త రూపాల్లో, డిజైనర్ టచ్‌తో వెలిగిపోనున్నాయి. ఎక్కడకు వెళ్లాలన్నా ముందు మాస్క్ తప్పనిసరి కాబట్టి వీటిమీద డిజైనర్లు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. డెనిమ్స్ ఫిట్ టు కంఫర్ట్ జీన్స్ గురించి ఆలోచన రాగానే చాలా మందిలో స్లిమ్ ఫిట్, టైట్ ఫిట్ అనేవే మెదులుతాయి. ఇక నుంచి డెనిమ్‌లోనూ కొంత వదులుగా ఉండేవి, సాగేవి, సౌకర్యానికి ప్రాముఖ్యాన్ని ఇచ్చేవాటి సంఖ్య పెరగనుంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఖాదీ ఫ్యాబ్రిక్‌కు మంచి డిమాండ్ ఉంది. ఈ విధంగా మన దేశీయ చేనేతలతో రూపొందించిన దుస్తుల మీద మందంగా ఉండే డెనిమ్ లేదా ఖాకీ కలర్ జాకెట్స్ ఇండోవెస్ట్రన్ స్టైల్‌తో ఆకట్టుకోనుంది. – నిర్మలారెడ్డి -
పెళ్లిళ్లు ఆగినా ప్రాణవాయువు ఆగదు కదా..
‘అన్నీ సజావుగా ఉంటే మనం ఎదగం. సవాళ్లు వచ్చినప్పుడే ఎదుగుతాం’ అంటారు మణిపూర్ ఉక్రుల్‌కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ షున్‌సింగ్ రగోయ్. ఉక్రుల్లోని వినో బజార్లో ఆమెకు చిన్న స్టోర్ ఉంది. అందులో పెళ్లికూతురి డ్రస్సులను తయారు చేస్తుంటారామె. భర్త పాంగ్‌చన్ రగోయ్ ఆమెకు కోడిజైనర్గా పని చేస్తుంటాడు. ఇద్దరి జీవితం సజావుగా సాగుతూ ఉన్నా లాక్డౌన్ సమస్యలు తెచ్చిపెట్టింది. పెళ్లిళ్లు ఆగిపోయాయి. మొదలైనవి ఆర్భాటాలను తగ్గించుకున్నాయి. ‘ఒకటి పోతే ఇంకొకటి వెతుక్కోవాలి అనుకున్నాను‘ అంటుంది షున్‌సింగ్. పెళ్లిళ్లు ఆగినా ప్రాణవాయువు ఆగదు కదా. కరోనా టైమ్‌లో అందరి ప్రాణవాయువు నిలవాలంటే మాస్క్ తప్పనిసరి. కొత్తరకం మాస్క్‌లు తయారు చేద్దాం అనుకుంది షున్‌సింగ్. వెంటనే ఎంబ్రాయిడరీ ద్వారా మాస్క్ మీద అందమైన డిజైన్లను సృష్టించడం మొదలు పెట్టింది. మణిపూర్ ఎత్నిక్ డిజైన్స్, పక్షులు, పూలు మాస్క్‌ల మీద ప్రత్యక్షమయ్యాయి. ముక్కూ ముఖం కనిపించకపోయినా మాస్క్ మీద ఉన్న డిజైన్లతో మనుషులు అందంగా కనిపించసాగారు. షున్‌సింగ్ రగోయ్ మాస్క్‌లు కొద్ది రోజుల్లోనే పాపులర్ అయ్యాయి. సెలబ్రిటీలు వీటి గురించి ట్వీట్ చేయడం మొదలుపెట్టారు. ఒక్కొక్కటి 500 చేసే ఈ డిజైనర్ మాస్క్‌లు మరోచోట దొరకవు. వీళ్ల నుంచి కొనాల్సిందే. ఫేస్బుక్లో yanvai అని కొడితే వాళ్ల వివరాలు కనిపిస్తాయి. ఇంకెందుకు ఆలస్యం. తెప్పించుకోండి. అందరూ తల తిప్పి చూసేలా చేసుకోండి. -
ఫ్యాషన్ షో : షో టాపర్‌గా సింధు అదరహో
-
ఎదుటోడిని వేసుకోండి
సిగ్నల్ పడకముందే దాటేయాలని హోండా యాక్టివా స్పీడ్ పెంచింది అమృత. హఠాత్తుగా ఆ చౌరస్తాలో ఆమెకు రైట్ సైడ్ ఉన్న రోడ్ నుంచి ఓ టూ వీలర్ అడ్డురావడంతో సడెన్ బ్రేక్ వేసింది. ‘‘ట్రాఫిక్ రూల్స్ పాటించరు పాడు లేదు.. ఇంతకీ..’’ అని ఆమె ఇంకేదో అనబోయే లోపు.. ఆ అనేదేంటో ఆ టూ వీలర్ వ్యక్తికి అర్థమైనట్టే తన టీ షర్ట్ మీది వాక్యాలు చూపించాడు అమృతకు.. ‘‘ఇంట్లో చెప్పే వచ్చా’’ అని. ‘‘అబ్బా.. అవునా?’’ అనుకుంటూ తన టీషర్ట్ మీది వాక్యాలూ చూపించింది.. ‘‘ఫసక్’’ అని!ఆ వ్యక్తి హెల్మెట్ కవర్ వేసుకుంటూ వెహికిల్ రైజ్ చేసుకొని వెళ్లిపోయాడు. అమృతా దూసుకెళ్లింది డెస్టినేషన్ వైపు.హోటల్ పార్కింగ్‌లోకి వెళ్లబోతుంటే ఓ పాదాచారుడు అడ్డొచ్చాడు. ఆ స్లోప్‌లో మళ్లీ బ్రేక్ వేస్తూ చిరాగ్గా చూసింది అతనిని ‘‘ఎవడ్రా నువ్వు?’’ అన్నట్టు. ఆ యంగ్ మన్ పరమ పుర్సత్గా తన టీ షర్ట్ చూపించాడు ‘‘పక్కా లోకల్’’ అని రాసున్న అక్షరాలను!‘‘మిడిల్ క్లాస్ అబ్బాయి’’ అనుకుంటూ పార్కింగ్‌లోకి వెళ్లింది. రెస్టారెంట్లో.. ‘‘సారీ గైస్.. ట్రాఫిక్... ఆ రూల్స్‌ని బ్రేక్ చేసే వాళ్లతో లేట్ అయిపోయింది’’ అంటూ అప్పటికే తన కోసం వెయిట్ చేస్తున్న ఫ్రెండ్స్‌తో జాయిన్ అయింది అమృత.‘‘వాట్ హ్యాపెండ్?’’ అడిగాడు జయసూర్య.‘‘రెండుసార్లు డాష్ కొట్టబోయా’’ అంది అమృత మంచినీళ్ల గ్లాస్ తీసుకుంటూ!అమృత ముందుకొచ్చి నిలబడ్డాడు పాండు. ఏంటీ అన్నట్టు చూసింది ఆమె నీళ్లు తాగుతూ!టీ షర్ట్ చూపించాడు.. ‘‘లైట్’’ తీస్కో అని ఉంది దాని మీద. నోట్లో నీళ్లు పాండు మీద పడేలా నవ్వేసింది.‘‘యూ నో.. ఈ రోజు ట్రాఫిక్‌లో.. పార్కింగ్‌కి వెళ్తుంటే నా వెహికిల్‌కి అడ్డొచ్చిన వాళ్లూ ఇలాంటి టీ షర్ట్సే వేసుకున్నారు’’ అని చెప్పింది అమృత మంచి నీళ్ల గ్లాస్ టేబుల్ మీద పెడుతూ.‘‘అర్రే.. అంటే ట్రెండ్‌ను ఫాలో అవ్వడంలో మనమెప్పుడూ లేటే అన్నమాట’’ అంది గీతిక.ఆనంది టీషర్ట్ చూపించాడు శివ.. గీతికకు. ‘‘మూస్కో’’ అని ఉంది. వెంటనే తన టీషర్ట్ మీదున్న అక్షరాలను చూపించింది గీతిక.. ‘‘ఏడ్చావ్ లే..’’ అని.‘‘ఓకే. టాపిక్‌కి వద్దాం...’’ అంటూ జయసూర్య వైపు తిరిగి‘‘ రేయ్ జయ్.. చెప్పరా.. పార్టీ ఎక్కడ అరేంజ్ చేస్తున్నావో?’’ అడిగింది గీతిక.‘‘మా బాబాయ్ వాళ్ల ఫామ్ హౌజ్‌లో’’ చెప్పాడు. ‘‘ఎక్కడది?’’ అందరూ అడిగారు ముక్త కంఠంతో.‘‘తూప్రాన్’’ చెప్పాడు జయసూర్య. ‘‘రేయ్.. మొదటిసారి పెళ్లి చేసుకుంటున్నావ్. నీ ప్రీ మ్యారేజ్ పార్టీ అదిరిపోవాలి బ్రో..’’ అన్నాడు శివ సీరియస్‌గా. ‘‘మొదటిసారి ఏంట్రా.. మొదటిసారి’’ అంటూ వాడి వీపును దబేల్ మనిపించారంతా. ఆ సరదా సందడిలోనే తినడానికీ ఆర్డర్ ఇచ్చేసుకున్నారు.‘‘మరీ అంతగా డబ్బులు తగలేసుకోకురా! పెళ్లయ్యాక చాలా ఖర్చులుంటాయి’’ సలహా ఇచ్చింది అమృత.‘‘పేరెంట్స్ చూసుకుంటారు’’ టీషర్ట్ చూపించాడు జయసూర్య. ‘‘నిన్నూ...’’ అంటూ నవ్వుతూ జయ్ భుజమ్మీద ఒక్కటిచ్చింది.‘‘ఫారిన్ స్కాచ్ పెట్టాల్రా మామా’’ అన్నాడు పాండు. ‘‘అవున్రా పెట్టాల్రా’’ అంటూ ‘‘అబే.. శివా.., బంటీ మాట్లాడరేందిరా..’’ మిగతావాళ్లనూ రెట్టించాడు అభిరామ్. ‘‘అంతేగా.. అంతేగా’’ తన టీషర్ట్ చూపించాడు బంటీ!‘‘మీ టీషర్ట్స్ గోలేంట్రా’’ అంటూ సంహిత తల పట్టుకుంటూంటే ‘‘అరే చిచ్చా... ఈ ప్రీ మ్యారేజ్ పార్టీకి మన ఫ్రెండ్స్ అందరి మ్యానరిజమ్స్‌తో ఇట్లాంటి టీషర్ట్స్‌ను కస్టమైజ్ చేసుకుందామారా?’’.. అద్భుతమైన ఐడియా తట్టినట్టు ఎక్సయిటింగ్‌గా చెప్పాడు పాండు. ‘‘రంగుపడుద్ది’’ అనే టీషర్ట్ వేసుకున్న గౌతమ్, ‘‘పని చూస్కో’’అని మాటున్న టీషర్ట్ వేసుకున్న అభిరామ్, ‘‘నాకు బూతులు ఊరికే రావు’’ అనే రాతతో టీషర్ట్ వేసుకున్న శివ.. అందరూ పాండూ ముందుకొచ్చి నిలబడ్డారు.ఏం చెప్పాలో తెలియక ‘‘అబే హాదీ..’’ అంటూ సెల్లో మొహం పెట్టిన హార్దిక్‌ను తట్టాడు. తలపైకెత్తి ‘‘నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు రావు గారు’’ అన్న తన టీషర్ట్ అక్షరాలను చూపించాడు హార్దిక్. అందరూ పాండు వైపు చూశారు ‘‘అయిందా’’ అన్నట్టు. తలగోక్కున్నాడు పాండు. అప్పుడే హడావిడిగా వీళ్ల దగ్గరకు వచ్చాడు ఆదిత్య.. ‘‘మీటింగ్ ఎన్ని గంటలకో చెప్పి చావచ్చు గదరా’’ అంటూ. అప్పటికే వీళ్లు ఖాళీ చేసిన స్నాక్స్ ప్లేట్లను చూస్తూ... ‘‘ నాకేమన్నా చెప్పండ్రా.. ఆకలేస్తోంది’’ అన్నాడు ఆదిత్య. ‘‘మాది అయిపోయింది. కావల్సింది ఆర్డర్ ఇచ్చుకో’’ అన్నాడు అభిరామ్. సర్వర్ కోసం అటూఇటూ చూశాడు ఆదిత్య. ఎవరూ కనపడలేదు. వాడి ఆత్రం అర్థమైన అభిరామ్ ‘‘కౌంటర్ దగ్గరకెళ్లి ఆర్డర్ ఇయ్యిపోరా’’ అన్నాడు. వెళ్లడానికి ఆదిత్య ఇబ్బంది పడ్తూంటే.. శివను వెనక్కి తిప్పి అతని వీపు చూపించాడు అభిరామ్.. ‘‘వెళ్లి నా పేరు చెప్పు’’ అని ఉంది. ‘‘సరే.. నీ ఏడుపేదో ఏడ్చి రా.. పార్కింగ్ లాట్లో వెయిట్ చేస్తూంటాం’’ అంటూ లేచాడు జయసూర్య. తోపాటే అందరూ లేచారు. లిఫ్ట్ దగ్గర.. తన ఛాతి దగ్గర అదే పనిగా చూస్తున్న అబ్బాయికి.. తను వేసుకున్న టీషర్ట్ మీది అక్షరాలను చూపించింది అమ్మాయి.. ‘‘ఫేస్ పైనుంది బే’’ అని. ఆ అబ్బాయి తమాయించుకుని ఏమీ ఎరగనట్టు ఆమె పక్కన నిలబడ్డ అబ్బాయిని చూశాడు. అతను గుర్రుగా తన టీ షర్ట్ మీదున్న అక్షరాలను చూపించాడు ‘‘ఈ పిల్ల నాది బే’’. దాంతో తన టీ షర్ట్ మీదున్న అక్షరాలను చూసుకున్నాడు అబ్బాయి ‘‘దీనమ్మ జీవితం’’.ఇంతలోకే రెస్టారెంట్లో ఆదిత్య దగ్గరకు బిల్ తీసుకొని వచ్చాడు సర్వర్. తన టీషర్ట్‌ను సర్వర్కి చూపించాడు ఆదిత్య.. ‘‘దే పేడ్ నో’’ అని. లేదన్నట్టుగా తలూపాడు సర్వర్. అప్పుడే తన పక్క టేబుల్ అతను బిల్ పే చేసి వెళ్తుంటే అతని టీ షర్ట్ వెనక ఓ వాక్యం కనిపించింది ఆదిత్యకు ‘‘ఒక ఇంగ్లిష్ కవి ఏమన్నాడో తెలుసా?’’ అని.పై సన్నివేశాలన్నీ కల్పితమే. కాని ఆ సినిమా డైలాగ్స్‌తో ఉన్న టీషర్ట్స్ వాస్తవం. వీటి రూపకర్తలు ఇద్దరు సాఫ్టవేర్ ఇంజనీర్స్. మహీ ఇలీంద్ర, హరీష్ వాసిరెడ్డి. ప్రకాశం, ఖమ్మం జిల్లా వాసులు. హైదరాబాద్‌లో ఇద్దరికీ కామన్ ప్యాషన్ అయిన సినిమా ప్లాట్‌ఫామ్ మీద కలుసుకున్నారు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ మొదలు కొన్ని షార్ట్ మూవీస్‌కీ పనిచేశారు. వెబ్సిరీస్కూ వర్క్ చేస్తున్నారు. లేటెస్ట్గా ఈ టీషర్ట్స్ థాట్‌తో ఈ కామర్స్‌లోనూ కాలు పెట్టారు. దేడ్ దిమాగ్ ఇంగ్లీష్‌లో ‘ఐ లవ్ న్యూయార్క్’ అని, ‘కొలంబియా బాయ్స్’ అని, ‘లవ్ అమెరికా’ అని ‘లండన్ డ్రీమ్స్’ అని రకరకాల స్లోగన్స్‌తో టీ షర్ట్స్ దొరుకుతాయి. కానీ తెలుగులో ఇలాంటివి లేదు. మన భాషలో పాపులర్ అయిన మాటలతో టీషర్ట్స్‌ను మార్కెట్లోకి తెస్తే ఎలా ఉంటుంది అనిపించింది ఆ ఇద్దరికీ. హిట్ కావాలంటే ఒకే ఫార్మూలా.. సినిమా! సో.. ఈ స్టార్టప్‌కి ‘దేడ్ దిమాగ్’ అని పేరుపెట్టి.. పంచ్లా పేలిన డైలాగ్స్‌ను టీ షర్ట్స్ మీద ప్రింట్ చేయించి మార్కెట్లో విడుదల చేశారు. టేకాఫ్ కొంచెం స్లో అయినా.. రెండు నెలల్లో స్పీడ్ అందుకుంది. క్రేజ్‌కి తగ్గ రేంజ్లో ఇప్పుడు రోజుకి కనీసం అయిదు వందల టీషర్ట్స్ సప్లయ్‌కి డిమాండ్ ఉంది.తెలుగు రాష్ట్రాల్లోనే కాదు చెన్నై, బెంగళూరు, ముంబై దాటి అమెరికా దాకా! ప్రీ మ్యారేజ్ పార్టీలు, బ్యాచ్‌లర్ పార్టీలు, సంగీత్, మెహందీ, పుట్టినరోజులు, బారసాలలు, కాలేజ్ పార్టీలు.. ప్రైవేట్ ఫంక్షన్స్.. అన్నిటికీ కస్టమైజ్ చేసుకున్న డైలాగ్స్‌తో ఈ టీషర్ట్స్ అమ్ముడు పోతున్నాయి. హోలీ లాంటి పండగలకూ.. థీమ్ పార్టీలకూ ఇలాంటి టీషర్ట్స్ కావాలనుకుంటున్నారు ట్రెండ్ ఫాలోవర్స్. కొంతమంది తమ కుటుంబ వేడుకల కోసం కుటుంబ సభ్యుల మ్యానరిజమ్స్‌తో ఈ టీషర్ట్స్‌ను తయారు చేసి ఇవ్వమని కోరుతున్నారట. అంతేకాదు కొన్ని పొలిటికల్ క్యాంపెయిన్స్కీ అడుగుతున్నారని చెప్పారు ఆ ప్రొడ్యూసర్స్. ‘‘ఈ టీ షర్ట్స్ ద్వారా మన భాష, కల్చర్‌ను ప్రమోట్ చేయడం మా లక్ష్యం. పాపులర్ కావడానికి ముందు సినిమా డైలాగ్స్‌ను వాడుకున్నాం కాని.. తర్వాత సామెతలు.. నుడికారాలు, పలుకుపడులు వంటివాటినీ ప్రింట్ చేస్తాం’’ అని చెప్తున్నారు మహీ, హరీష్‌లు. సరస్వతి రమ -
చెంగు పలాజో
సమ్మర్ టైమ్..చీర కట్టు చాలా ఇబ్బంది అనుకునే నేటితరంపలాజో శారీ ధరించి న్యూలుక్‌తో వెలిగిపోవచ్చు. సింపుల్‌గానూ.. స్టైలిష్‌గానూ.. అత్యంత కంఫర్ట్గానూ..అమ్మాయిలను ఆకట్టుకుంటున్న ఈ చెంగు పలాజోను ధరించి చెంగు చెంగుమనచ్చు. ►కుర్తాకి బాటమ్‌గా ధరించే పలాజో ప్యాంట్ వదులుగా ఉంటుంది. మరిన్ని కుచ్చులతో పలాజో స్కర్ట్గానూ మారింది. ఈ పలాజోకు పవిటను జత చేస్తే పలాజో శారీ అవుతుంది. ►షర్ట్ స్టైల్ బ్లౌజ్, ప్రింటెడ్ పలాజో విత్ శారీ.. అటు పార్టీవేర్ ఇటు క్యాజువల్ వేర్కి రెంటికీ కరెక్ట్‌గా ఫిట్ అవుతుంది. ►కాటన్ ప్రింటెడ్ పలాజో, దానికి అదే డిజైన్‌లో ఉన్న చెంగును జత చేశారు డిజైనర్లు. కాలర్‌నెక్ బ్లౌజ్ జతచేయడంతో కార్పోరేట్ లుక్ వచ్చేసింది. ►కాటన్ ఫ్యాబ్రిక్, కలర్‌ఫుల్ కాంబినేషన్లో వచ్చిన ఈ పలాజో శారీ ఈ వేసవి కాలానికి సిసలైన∙కంఫర్ట్ వేర్. ►పలాజో, బ్లౌజ్ ఒకే రంగులో ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు డిజైనర్లు. పవిటను కాంట్రాస్ట్ ఎంచుకున్నారు. ఎలా చూసినా పలాజో శారీ డిజైన్ అద్భుతంగా కట్టడి చేస్తోంది. ►బ్లౌజ్, పలాజో, చెంగు.. మూడే ఒకే రంగు.. ఒకే ప్రింట్లు.. డిజైన్‌లో కొద్ది పాటి మార్పులు. ఈ పలాజో సూట్‌ని మరింత అందంగా మార్చింది. -
రితూ బెరి బెరి గుడ్
- రితూ గౌన్‌లో క్వీన్‌లా... లెహంగా కడితే విహంగంలా... హాఫ్ శారీలో డిలైట్‘ఫుల్’గా... చోళీలో చార్మింగ్‌గా ఉంటుందా డ్రస్ డిజైనింగ్. అందుకే రితూ బెర్రీని ప్రీతీజింటా నుంచి ప్రిన్స్ చార్లెస్ వరకూ అందరూ బెర్రీ బెర్రీ గుడ్ అంటారు. గ్లామరస్‌గా కనిపించాలంటే రితుబెరి కలెక్షన్‌ను చూడకూడదు. వందల్లో ఒకరిగా కనపడాలన్నా, ప్రత్యేకతను నిలుపుకోవాలన్నా మాత్రం రితూబెరి డిజైనర్ కలెక్షన్ వైపు తప్పక దృష్టి సారించాలి. ఆమె రూపొందించిన డిజైనర్ దుస్తులు అంత అసాధారణంగా ఉంటాయి. ఫ్రెంచ్ ప్రభుత్వం రితుబెరి డ్రెస్ డిజైన్ స్టైల్స్‌ని ‘మైండ్ బ్లోయింగ్ వర్క్’ అని ఆమెను ప్రశంసించింది. ప్రిన్స్ చార్లెస్, అమెరికా మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్, నికొలె కిడ్‌మ్యాన్, పర్షియన్ సామాజికవేత్తలు, ఇండియన్ బాలీవుడ్ తారలు రాణీ ముఖర్జీ, ప్రీతీ జింతా, మాధురీ దీక్షిత్ వంటి ప్రముఖులు రితుబెరి డిజైన్ చేసిన దుస్తుల్లో మెరిశారు. ఈమె స్టోర్స్ ఢిల్లీ, ఫ్రాన్స్, జెర్మనీలలో ఉన్నాయి. -
డిజైనర్ వస్త్రాలు... పోలిస్టోన్ శిల్పాలు...
జీవనశైలిలో వైవిధ్యం ప్రతిబింబింపజేయాలనుకునేవారికి, ఆహార్యంలో అద్భుతం అనిపించుకోవాలనే కోరిక ఉన్నవారికి ఒకే చిరునామాలో ఉత్పత్తులు దొరకడం అంత సులభమైన విషయం కాదు. మాదాపూర్‌లోని నోవాటెల్ హోటల్ ప్రాంగణంలో కొలువుదీరిన హై లైఫ్ లగ్జరీ ఎగ్జిబిషన్ ఈ అరుదైన మేళవింపుతో నగరవాసుల్ని మరోసారి అలరిస్తోంది. ఘజియాబాద్ నుంచి తరలివచ్చిన మానవ తయారీ లోహం పోలిస్టోన్తో శిల్పాలు మొదలుకుని అత్యుత్తమ డిజైనర్ బ్రాండ్ల దుస్తుల దాకా... ఈ ప్రదర్శనలో కొలువుదీరాయి. అన్ని ఎక్స్‌పోల తరహాలోనే ఈ ప్రదర్శనలోనూ డిజైనర్ దుస్తుల వెరైటీలకే ఎక్కువ ప్రాధాన్యం దక్కినప్పటికీ, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, సిల్వర్ ఫర్నిచర్, యాంటిక్స్, అనూహ్యమైన మెటీరియల్‌తో తయారు చేసిన ఇంటీరియర్ ఉత్పత్తులు వైవిధ్యాన్ని కోరుకునేవారికి నచ్చేలా అందుబాటులో ఉంచారు. ముంబయి, ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, లక్నో, పూనె,కోల్‌కత, చెన్నై... నగరాల నుంచి తయారీదారులు ఇందులో పాల్గొంటున్నారు. బాలీవుడ్ నటుడు అలోక్‌నాథ్, టాలీవుడ్ వర్ధమాన తారలు మానస, పరిణిధి, సోనా చత్వాని తదితరులు బుధవారం నాటి ప్రారంభ కార్యక్రమానికి అతిధులుగా హాజరయ్యారు. ప్రదర్శన మూడు రోజుల పాటు కొనసాగుతుంది. -
వెరైటీ డ్రెస్‌లకు కేరాఫ్
బొటిక్, డిజైనర్ దుస్తులు అనగానే ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని అనుకోవడం సహజం. అయితే ఎకానమీ రేట్లలో, యూనిక్ దుస్తులు లభిస్తాయంటే ఎవరు మాత్రం వద్దనుకుంటారు. అలా మహిళల డిజైనర్ దుస్తులను రీజనబుల్ ధరల్లో అందరికీ అందుబాటులోనికి తేవాలనే ప్రయత్నాలు నగరంలోని డిజైనర్లు మొదలుపెట్టారు. వినూత్న బ్రైడల్ ప్యాకేజీలు, కుర్తాలు, డిజైనర్ చీరలు, బ్లౌజ్‌లు, గాగ్రాలు, అనార్కలీలతో పాటు వర్కింగ్ వుమెన్ కోసం ప్రత్యేక వెరైటీలు రూపొందిస్తున్నారు. రోజువారీ నుంచి పెళ్లి దుస్తుల వరకు అన్నింటినీ అందుబాటు ధరల్లో అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. వెరసి వెరైటీ డ్రెస్‌లకు కేరాఫ్ అడ్రెస్‌గా నగరం నిలుస్తోంది. వధువు పెళ్లి బట్టలతో పాటు వధువు కుటుంబ సభ్యుల దుస్తుల బాధ్యత అంతా ఒక ప్యాకెజ్లా అందించే ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్యాకేజ్‌లో వధువు తల్లితండ్రులు, తోబుట్టువులు ఇలా సభ్యుల సంఖ్య, అలాగే వారు ఎంచుకునే దుస్తుల డిజైన్లను బట్టి ప్యాకేజీలు ఉంటారుు. స్పెషల్ బ్లౌజెస్... డిజిటల్ ప్రింట్ ఉన్న మెటీరియల్‌తో స్టిచ్ చేసిన చూడీ స్లీవ్స్ బ్లౌజ్. చక్కటి కట్స్, ఫిట్టింగ్తో నేటి యువతను ఆకట్టుకునే ఈ ట్రెండీ బ్లౌజ్‌ని ప్లెరుున్ చీరలతోనే కాకుండా రకరకాల చీరలపై మ్యాచ్ చేసుకోవచ్చు. సింపుల్ వర్క్ చేసిన గ్రే కలర్ శారీకి హైనెక్‌తో వున్న రెడ్ కలర్ బ్లౌజ్ హైలెట్‌గా కనిపిస్తుంది. కట్‌దానా మెటీరియల్‌పై పూర్తిగా హ్యాండ్ వర్క్ చేసిన ఈ బ్లౌజ్‌ని పలు రకాల చీరలకే కాదు గాగ్రాలకు కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఎల్లో పసువు రంగులతో డై చేసిన చక్కటి నిట్ వర్క్ బ్లౌజ్. పర్ఫెక్ట్ ఫిట్టింగ్, ఫినిషింగ్ వున్న లేటెస్ట్ ట్రెండ్ బ్లౌజ్‌ని ఇలా హాఫ్ శారీలకు మాత్రమే కాక చీరలకు కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. డిజైనర్ చీరలు... బ్లౌజ్‌లు, కుర్తాలు, డ్రెస్సులతో పాటు డిజైనర్ చీరలు రూపొందిస్తున్నారు. కోటా మెటీరియల్‌ని ఆరెంజ్, బ్లూ రంగులతో డై చేసి అందమైన చీరలుగా వులుస్తున్నారు. కట్‌వర్క్ చేసిన చీర అంచులకు కుందన్, ముత్యాలను చేతితో కుట్టి చూడచక్కగా తయూరు చేస్తున్నారు. కలంకారీ వర్క్‌ని ఎక్కువగా లేటెస్ట్ దుస్తుల డిజైన్లలో వాడుతున్నారు. సహజమైన రంగులతో చేసే ఈ వర్క్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలుగువారి కోసం, తెలుగు వారికి నచ్చే దుస్తుల రూపకల్పన చేస్తుంటాం. ఏ ప్రాంతం వారికైనా వారి ప్రాంతం, వారి ఇష్టాఇష్టాలు బాగా తెలుస్తాయి. అలా నేటివిటీ, టేస్ట్‌తో పాటు వచ్చిన కస్టమర్ అభిరుచి, రూపురేఖలకు అనుగుణంగా దుస్తులు తయారు చేస్తాం. అలాగే మా సర్వీసులు ఎక్కువగా ఆన్లైన్ ద్వారా అందుబాటులో వున్నాయి. విదేశాల్లో, ఇతర నగరాల్లో వున్న వనితల అవసరాలకు తగిన విధంగా దుస్తులు రెడీ చేసి ఇస్తుంటాం. - లతాశ్రీ, లాష్ స్టూడియో -
షాపింగ్ స్పాట్
‘ఓ మంచి పనికోసం కొద్దిసేపు ఆగండి’ అంటూ దేశవ్యాప్త సంప్రదాయ, సమకాలీన డిజైనర్ వస్త్రాలు, ఆభరణాలు, యాక్సెసరీస్‌ను ఎగ్జిబిషన్‌గా మన ముందు పెట్టింది తాజ్ డెక్కన్‌లోని కోహినూర్ హాల్. దేశవ్యాప్తంగా పేదల విద్య, వైద్యం, కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్న ఇండియా ఫౌండేషన్ కోసం వై.మధుపమ ‘పాజ్ ఫర్ ఏ కాజ్’ పేరిట ఈ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే స్టైలిష్ డిజైన్స్ కాశ్మీరీ జర్దోసీ, మెరిసే షిఫాన్స్, అద్భుతమైన జార్జెట్స్ కొలువుదీరాయి. ఫ్యాషన్ ప్రియుల కోసం ఇండో-వెస్ట్రన్ వేర్ కూడా ఉంది. శనివారం కూడా ప్రదర్శన ఉంటుంది. - సాక్షి, సిటీ ప్లస్ ఫ్రెష్ లుక్ బుక్స్‌తో కుస్తీ పట్టే స్టూడెంట్స్ కాస్త ‘బ్రేక్’ తీసుకున్నారు. స్పైసీ లుక్స్‌తో మాస్ సాంగ్‌లకు స్టెప్పులేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో న్యూ స్టూడెంట్స్‌కు వెల్కమ్ చెప్పారు. బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ అవ్మూరుులు... శుక్రవారం ఫ్రెషర్స్ డే ను జాలీగా ఎంజాయ్ చేశారు. Petals కేరాఫ్ లేటెస్ట్ లగ్జరీ వరల్డ్‌లో తిరుగులేని ఎగ్జిబిషన్ పెటల్స్. పేరుకు తగ్గట్టుగానే పూల రెక్కలకు కొన్ని తేనెచుక్కలు కలిపి తయారు చేసినట్టున్న వస్త్రాలు, ఆభరణాలు తాజ్ కృష్ణాలో కొలువుదీరాయి. ముంబై, ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, పుణే, బెంగళూర్, కోల్‌కతా, చెన్నయ్ వంటి ప్రముఖ నగరాల్లోని 60 మంది టాప్‌మోస్ట్ డిజైనర్లు రూపొందించిన డిజైన్లు చూపరులను కళ్లు తిప్పుకోనివ్వడం లేదు. డ్రెస్‌లు, యాక్ససరీస్, గృహోపకరణాలు, గిఫ్టుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లేటెస్ట్ ట్రెండ్స్‌కి అద్దం పట్టిన ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకురాలు పద్మలతను సిటీ ప్లస్ పలకరించింది... ‘ఫిబ్రవరి, జూలై, దసరాకు ముందు ఏడాదిలో మూడుసార్లు జరిగే ఈ ఎగ్జిబిషన్ లేటెస్ట్ ట్రెండ్స్‌ను ఇష్టపడే ఇన్నోవేటివ్ పీపుల్‌కి కరెక్ట్ ప్లేస్. అయితే మొదటి దఫాలో చేనేతకు పట్టం కడితే.. రెండోసారి దేశవ్యాప్తంగా డిజైనర్లను హైదరాబాదీలకు పరిచయం చేయడం, ఇక మూడో విడతలో పాకిస్థాన్ సహా అంతర్జాతీయ డిజైనర్స్ లక్ష్యంగా ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. రానున్న పండుగలు, పెళ్లిళ్ల సీజన్ దృష్టిలో పెట్టుకొని మహిళల కోసం వెడ్డింగ్ కలెక్షన్ ఈ ఎగ్జిబిషన్లో ఉంచాం. ప్రత్యేకించి కంచి, బెనారస్‌తో పాటు ఇకత్ వంటి అన్ని రకాల డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. 60 స్టాళ్లలో కిడ్స్ కోసం కొన్ని ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశాం. వాటితోపాటు సూట్స్, బ్లౌజ్‌లు, హెయిర్ ఫ్యాషన్ యాక్సెసరీస్, ఫుట్‌వేర్, బ్యాగ్స్ ఇలా అన్నింటిలో లేటెస్ట్ ట్రెండ్స్. ఆకర్షణీయమైన పసిడి, వెండి, వజ్రాభరణాలు ఇక్కడ ప్రత్యేకత’ అంటున్నారు పద్మలత. ప్రవుుఖ గాయుని ఉష ఇందులోని వెరైటీలు చూసి వుుచ్చటపడ్డారు. -
వేలి కొసల్లో మెరుపు
పార్టీకి వెళ్లడానికి మేకప్, డిజైనర్ దుస్తులు అన్నీ చక్కగా అమరాయి. మరి హ్యాండ్ బ్యాగ్?! అది కూడా చూడముచ్చటగా ఉండాలి... అని ఆలోచించేవారి మనసును ఇట్టే దోచేసే డిజైనర్ బ్యాగ్స్ ఇవి. వేళ్లతో ముచ్చటగా పట్టుకోవడానికి వీలుగా ఉండే వీటిని చిన్న పర్సులుగా కూడా వాడచ్చు. బ్లాక్ బ్రాస్ మెటీరియల్‌తో రూపొందించి, 24 క్యారెట్ల బంగారంతో కోటింగ్ ఇచ్చారు. చుట్టూ మువ్వలు, కుందన్స్, స్టోన్స్‌తో మరిన్ని హంగులను పొదిగారు. సంప్రదాయ దుస్తులకు చక్కగా అమరే ఈ బుజ్జి హ్యాండ్‌బ్యాగ్‌లో సెల్‌ఫోన్, డబ్బులూ పెట్టుకోవడానికి వీలుగా లోపల సిల్క్ క్లాత్‌ను పర్సగా ఉపయోగించారు. కలకత్తాలోని సంప్రదాయ ఆభరణాల సంస్థ ‘క్రితి’ వీటిని రూపొందించింది. ఇటీవల హైదరాబాద్ ఫ్యాషన్ ఎక్స్‌పోలో ఇవి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఒక్కో బ్యాగ్ ధర: రూ.5000/- - కవిత ఫుంభర, డిజైనర్ www.facebook.com/kriti.jewelry