చెంగు పలాజో  | Palazzo Saree is a Comfort Wear which is this summer season | Sakshi
Sakshi News home page

చెంగు పలాజో 

Published Fri, Mar 22 2019 12:23 AM | Last Updated on Fri, Mar 22 2019 6:25 PM

Palazzo Saree is a Comfort Wear which is this summer season - Sakshi

సమ్మర్‌ టైమ్‌..చీర కట్టు చాలా ఇబ్బంది అనుకునే నేటితరంపలాజో శారీ ధరించి న్యూలుక్‌తో వెలిగిపోవచ్చు. సింపుల్‌గానూ.. స్టైలిష్‌గానూ.. అత్యంత కంఫర్ట్‌గానూ..అమ్మాయిలను ఆకట్టుకుంటున్న ఈ చెంగు పలాజోను ధరించి చెంగు చెంగుమనచ్చు.

►కుర్తాకి బాటమ్‌గా ధరించే పలాజో ప్యాంట్‌ వదులుగా ఉంటుంది. మరిన్ని కుచ్చులతో పలాజో స్కర్ట్‌గానూ మారింది. ఈ పలాజోకు పవిటను జత చేస్తే పలాజో శారీ అవుతుంది.

►షర్ట్‌ స్టైల్‌ బ్లౌజ్, ప్రింటెడ్‌ పలాజో విత్‌ శారీ.. అటు పార్టీవేర్‌ ఇటు క్యాజువల్‌ వేర్‌కి రెంటికీ కరెక్ట్‌గా ఫిట్‌ అవుతుంది.

►కాటన్‌ ప్రింటెడ్‌ పలాజో, దానికి అదే డిజైన్‌లో ఉన్న చెంగును జత చేశారు డిజైనర్లు. కాలర్‌నెక్‌ బ్లౌజ్‌ జతచేయడంతో కార్పోరేట్‌ లుక్‌ వచ్చేసింది. 

►కాటన్‌ ఫ్యాబ్రిక్, కలర్‌ఫుల్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ పలాజో శారీ ఈ వేసవి కాలానికి సిసలైన∙కంఫర్ట్‌ వేర్‌.

 ►పలాజో, బ్లౌజ్‌ ఒకే రంగులో ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు డిజైనర్లు. పవిటను కాంట్రాస్ట్‌ ఎంచుకున్నారు. ఎలా చూసినా పలాజో శారీ డిజైన్‌ అద్భుతంగా కట్టడి చేస్తోంది.

►బ్లౌజ్, పలాజో, చెంగు.. మూడే ఒకే రంగు.. ఒకే ప్రింట్లు.. డిజైన్‌లో కొద్ది పాటి మార్పులు. ఈ పలాజో సూట్‌ని మరింత అందంగా మార్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement