Casual Wear
-
ఇండోవెస్ట్రన్ స్టైల్.. 'టైమ్ లెస్ కంఫర్ట్ ప్లస్'!
'ధరించే డ్రెస్‌ను బట్టి తమ స్టైల్, లుక్ ఎదుటివారికి తెలియాలని కోరుకుంటారు. క్యాజువల్ వేర్ అయినా పార్టీ వేర్ అయినా తమను ప్రత్యేకంగా గుర్తించాలని తపిస్తారు. ముందే పలకరిస్తున్న వేసవి తాపాన్ని తట్టుకుంటూ వేడుకలలోనూ రాయల్ లుక్‌తో మెరిసిపోవడానికి ఓవర్‌కోట్ బార్డర్ స్టైల్ తన స్పెషాలిటీని చాటుతోంది. రెడీ అవ్వడానికి తక్కువ టైమ్ పట్టడమే కాదు సౌకర్యంలోనూ సరైన ఛాయిస్ అనిపించకమానదు.' రాయల్ లుక్ కలిగిన డ్రెస్‌లు ఇవే.. ఇండోవెస్ట్రన్ స్టైల్ డ్రెస్సింగ్ నవతరాన్ని అధికంగా ఆకర్షిస్తుంటుంది. అప్పట్లో ఓవర్‌కోట్ అంటే మందంగా ఉండే డ్రెస్‌గా మాత్రమే చూసేవారు. ఇప్పుడు అదే స్టైల్లో పట్టు, కాటన్స్తో తయారు చేస్తున్నారు. ఎంచుకున్న మెటీరియల్‌ను బట్టి పైఠానీ, గద్వాల్, ఇక్కత్ హ్యాండ్లూమ్ డిజైన్ గల బార్డర్స్ వచ్చేలా డిజైన్ చేస్తున్నారు. ఓవర్కోట్లా ఉండే టాప్స్, అదే రంగులో ఉండే బాటమ్ ΄్యాంట్స్కి అంచును జత చేయడంతో ఈ డ్రెస్‌లో అమ్మాయిలు మరింత ప్రత్యేకంగా కనపడుతున్నారు. సిల్క్, క్రేప్ ప్లెయిన్ మెటీరియల్‌ను ఈ డ్రెస్ తయారీకి ఎంచుకున్నప్పుడు ప్రత్యేక హంగుగా హ్యాండ్ ఎంబ్రాయిడరీని ఉపయోగిస్తున్నారు. షరారా ΄్యాంట్స్, టాప్స్, టై అండ్ డై మెటీరియల్ ఎంపిక కూడా ఈ డ్రెస్సింగ్‌కి ప్రత్యేక ఆకర్షణగా అమరుతున్నాయి. బంగారు రంగులో ఉన్న వెడల్పాటి అంచులే కాదు, ఎంబ్రాయిడరీ చేసిన లేదా కాంట్రాస్ట్ బార్డర్స్ కూడా ఈ డ్రెస్ మోడల్స్‌ను స్పెషల్‌గా చూపుతున్నాయి. గాఢమైన రంగులు లేదా లేత రంగులు సందర్భానికి అనుగుణంగా డ్రెస్‌ను ఎంపిక చేసుకోవచ్చు. వీటికి ఫ్యాషన్ జ్యువెలరీ అదీ చాలా తక్కువగా ఉపయోగించవచ్చు. లేదా ఆభరణాల ఊసు లేకపోయినా నప్పే హెయిర్ స్టైల్‌తో ఆధునికంగా మెరిసిపోవచ్చు. ఇవి చదవండి: Sia Godika: 'సోల్ వారియర్స్'.. తను ఒక చేంజ్‌మేకర్! -
నూలు విధాలు
దారాలెన్నింటినో ఒద్దికగా పేర్చితే... ఆ అల్లిక ఒక నేత చీరగా రూపుకడుతుంది. స్టైల్స్ ఎన్నింటినో పొందికగా కూర్చితే ఆ కొత్తదనం చీరంత అందమై కొలువుదీరుతుంది. నూలు దారాలన్నీ వినూత్నమై ఇలా నూలు విధాలుగా వెలుగొందుతాయి. నిన్నామొన్నటి వరకు కాటన్ చీరలు అంటే అమ్మాయిలు వాటిని ఆమడదూరం పెట్టేసేవారు. అవి పెద్దవారి జాబితా అంటూ పెదవి విరిచేవారు. ఇప్పుడు నయా స్టైల్ వచ్చింది. కంచి, ఖాదీ, లినెన్, మల్.. హ్యాండ్లూమ్ కాటన్ చీర ఏదైనా అమ్మాయిలు, అమ్మలు ఇలా కాటన్ కట్టులో కొత్తదనం తీసుకు వస్తున్నారు. ధరించే బ్లౌజ్‌తో అట్రాక్టివ్ లుక్ తీసుకువస్తున్నారు. ఈ ఇండోవెస్ట్రన్ లుక్ క్యాజువల్ వేర్‌గానే కాదు, సీజన్‌కి తగ్గట్టు పార్టీ వేర్‌గానూ హంగామా క్రియేట్ చేస్తుంది. -
చెంగు పలాజో
సమ్మర్ టైమ్..చీర కట్టు చాలా ఇబ్బంది అనుకునే నేటితరంపలాజో శారీ ధరించి న్యూలుక్‌తో వెలిగిపోవచ్చు. సింపుల్‌గానూ.. స్టైలిష్‌గానూ.. అత్యంత కంఫర్ట్గానూ..అమ్మాయిలను ఆకట్టుకుంటున్న ఈ చెంగు పలాజోను ధరించి చెంగు చెంగుమనచ్చు. ►కుర్తాకి బాటమ్‌గా ధరించే పలాజో ప్యాంట్ వదులుగా ఉంటుంది. మరిన్ని కుచ్చులతో పలాజో స్కర్ట్గానూ మారింది. ఈ పలాజోకు పవిటను జత చేస్తే పలాజో శారీ అవుతుంది. ►షర్ట్ స్టైల్ బ్లౌజ్, ప్రింటెడ్ పలాజో విత్ శారీ.. అటు పార్టీవేర్ ఇటు క్యాజువల్ వేర్కి రెంటికీ కరెక్ట్‌గా ఫిట్ అవుతుంది. ►కాటన్ ప్రింటెడ్ పలాజో, దానికి అదే డిజైన్‌లో ఉన్న చెంగును జత చేశారు డిజైనర్లు. కాలర్‌నెక్ బ్లౌజ్ జతచేయడంతో కార్పోరేట్ లుక్ వచ్చేసింది. ►కాటన్ ఫ్యాబ్రిక్, కలర్‌ఫుల్ కాంబినేషన్లో వచ్చిన ఈ పలాజో శారీ ఈ వేసవి కాలానికి సిసలైన∙కంఫర్ట్ వేర్. ►పలాజో, బ్లౌజ్ ఒకే రంగులో ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు డిజైనర్లు. పవిటను కాంట్రాస్ట్ ఎంచుకున్నారు. ఎలా చూసినా పలాజో శారీ డిజైన్ అద్భుతంగా కట్టడి చేస్తోంది. ►బ్లౌజ్, పలాజో, చెంగు.. మూడే ఒకే రంగు.. ఒకే ప్రింట్లు.. డిజైన్‌లో కొద్ది పాటి మార్పులు. ఈ పలాజో సూట్‌ని మరింత అందంగా మార్చింది. -
కాలరెగరేసి ముగ్గులేయండి
షర్ట్ పూర్తిగా వెస్ట్రన్ స్టైల్లెహంగా పూర్తిగా మన ఇండియన్ స్టైల్ఈ రెంటినీ మిక్స్ చేస్తే వచ్చిందే ఈ ఇండోవెస్ట్రన్ స్టైల్. క్యాజువల్ వేర్‌గా, వెస్ట్రన్ పార్టీవేర్గానే కాదుసంప్రదాయ వేడుకల్లోనూ ఈ డిఫరెంట్స్టైల్తో అమ్మాయిలు గ్రాండ్‌గా వెలిగిపోవచ్చు. బాలీవుడ్ టు టాలీవుడ్ తారామణులు సైతం ఈ స్టైల్‌కి తెగ ఫిదా అయిపోయారు. సౌకర్యంగానూ, స్టైలిష్‌గానూ ఉండే లుక్ ఇంతకు మించి ఉండదు అంటూ వేదికల మీద తెగ సందడి చేస్తున్నారు. సంక్రాంతి వస్తోంది.ముగ్గులూ వచ్చేస్తున్నాయి. ముగ్గులు ఆడపిల్లలు వెయ్యాలని మగవాళ్లు డిసైడ్ చేశారు. ట్రెడిషనల్‌గా పావడా వేస్కోవాలని కూడా వాళ్లే డిసైడ్ చేశారు. పోనివ్వండి పాపం.జెండర్ వాల్యూని నిలబెట్టుకుంటూముగ్గులు వేద్దాం. కానీ కాలర్ ఎగరేస్తూవేద్దాం. అందుకే ఈవారం కాలర్ చొక్కాతో...పావడాను కలిపి వేసుకుందాం. ►పింక్ కలర్ ప్లీటెడ్ స్కర్ట్ మీదకు క్రీమ్ కలర్ సిల్వర్ డాట్స్ షర్ట్ ధరిస్తే ఏ వేడుకైనా, వేదికైనా ‘వహ్వా’ అనే కితాబులు ఇవ్వాల్సిందే! ►‘షర్ట్ విత్ లెహంగాను వివాహ వేడుకకు ఎలా ధరిస్తావు?’ అనేవారికి ఒక గ్రాండ్ దుపట్టా ధరించి రాయల్ లుక్‌తో సమాధానం చెప్పవచ్చు. ►ఇండోవెస్ట్రన్ లుక్‌తో పాటు ఈ వింటర్ సీజన్‌కి పర్ఫెక్ట్ ఔట్‌ఫిట్‌గా డిసైడ్ చేశారు డిజైనర్లు. ఫ్యాషన్ వేదికల మీదనే కాదు వెడ్డింగ్ వేర్‌గానూ ఆకట్టుకునే డ్రెస్. ►లెహంగాలో బాగా కనిపించే జరీ రంగు షర్ట్‌ను డిజైన్ చేయించుకుని ధరిస్తే రాచకళతో వేడుకలో హైలైట్‌గా నిలుస్తారు. ఇలాంటి డ్రెస్‌కి ఆభరణాల అందమూ గ్రాండ్‌గా జత చేయవచ్చు. ►తెలుగింటి పావడాకి, వెస్ట్రన్ ఇంటి షర్ట్‌ను జత చేస్తే వచ్చే మోడ్రన్ లుక్ ఇది. కంఫర్ట్‌లోనూ, కమాండ్లోనూ సాటి లేదని నిరూపిస్తుందీ స్టైల్. ►సంప్రదాయ చీరను స్కర్ట్‌లా డిజైన్ చేసి, వైట్ కలర్ కాలర్ షర్ట్ జత చేస్తే వచ్చే లుక్‌కి యువతరం ప్లాట్ అయిపోతుంది. దీని మీద సిల్వర్ అండ్ ప్యాషన్ జువెల్రీ బాగా నప్పుతుంది. -
కఫ్తాన్ అందమైన తాను
డ్రెస్ స్టైలిష్‌గా ఉండాలి. అదే సమయంలో సౌకర్యంగా ఉండాలి. ఈ రెండు కఫ్తాన్ సొంతం. అందుకే యంగేజ్ వాళ్లే కాదు అమ్మలు కూడా కఫ్తాన్ని ఇష్టపడి ధరిస్తున్నారు. క్యాజువల్ వేర్ నుంచి కలర్‌ఫుల్ పార్టీ వరకు కఫ్తాన్ రాణిస్తుంది. అటో కుట్టు... ఇటో కుట్టు...సింపుల్‌గా కట్టు... స్టైల్‌కి... నిండుతనానికి.. నిలువెత్తు అందం తాను. ♦ ధరించడంలోనే కాదు నచ్చిన క్లాత్‌తో కఫ్తాన్ని ఎవరికి వారు డిజైన్ చేసుకోవడం చాలా సులువు. దీనికి పెద్ద పెద్ద ప్రణాళికలు, డ్రాఫ్టింగ్లు అస్సలు అవసరం లేదు ♦ చతురస్త్రం లేదా దీర్గచతురస్త్రం కొలతతో ఎంచుకున్న ఫ్యాబ్రిక్‌ని రెండు మడతలుగా వేసి, చేతుల వద్ద (లాంగ్, షార్ట్ స్లీవ్స్) తగినంత వదిలేసి, రెండు వైపులా కుట్టేస్తే చాలు ♦ నడుము, ఛాతీ, హిప్ దగ్గర కొంత కొలత తీసుకొని మార్క్ చేసి కూడా కుట్టేయవచ్చు. ♦ ఈ కుట్టు వల్ల సల్వార్ కమీజ్ లుక్ వస్తుంది ♦ కఫ్తాన్ టైట్ ఫిట్ ఉండదు. రిలాక్స్డ్గా ఉంటుంది. ఇండోవెస్ట్రన్ కాక్టెయిల్ పార్టీస్‌కి బాగా నప్పుతుంది ♦ రేయాన్, కాటన్ సిల్క్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ కూడా కఫ్తాన్స్కి బాగుంటుంది. పొట్టి కఫ్తాన్ జీన్స్ మీదకు బాగుంటుంది ♦ దూరప్రయాణాలలోనూ కఫ్తాన్ చాలా సౌకర్యంగా ఉంటుంది. దీనికి ప్రత్యేకించి దుపట్టా, స్కార్ఫ్ వంటివి అదనంగా వాడనవసరం లేదు. బాటమ్‌గా పలాజో సరైన ఎంపిక ♦ గర్భవతులకు కూడా సౌకర్యవంతమైన డ్రెస్ ఇది. ♦ ధోతీ మీదకు కఫ్తాన్ ధరిస్తే ఇండో వెస్ట్రన్ స్టైల్ ఆకట్టుకుంటుంది. పార్టీలో ప్రత్యేకతను చాటుతుంది. ♦ సిల్క్, క్రాప్ కాటన్స్, జార్జెట్స్, షిఫాన్స్.. కఫ్తాన్స్కి బాగా సూటవుతాయి. స్టిప్గా ఉండే ఫ్యాబ్రిక్ దీనికి సూట్ అవదు. ♦కఫ్తాన్ చుట్టూ అంచు, నెక్ పార్ట్‌లోనూ చిన్న చిన్న బుటీ వచ్చేలా డిజిటల్ ప్రింట్ వేసుకోవచ్చు. లేదంటే ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు. మగ్గం వర్క్తోనూ డిజైన్ చేసుకోవచ్చు. పార్టీకి వెలుతున్నప్పుడు కఫ్తాన్కి బాటమ్‌గా స్లిమ్ సూట్ ట్రౌజర్ ధరిస్తే అందంగా కనిపిస్తారు. ♦నలుచదరంగా ఉండే క్లాత్ మీద డిజిటల్ ప్రింట్ వేశారు. ఈ ప్రింట్ లేదంటే లైట్ బార్డర్ వేసుకొని కూడా ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ♦ ఏ ఆభరణమైనా బాగుంటుంది. అయితే, ధరించి కఫ్తాన్ స్టైల్, సందర్భాన్ని బట్టి ఆభరణాల ఎంపిక ఉండాలి. సల్వార్ కమీజ్ లాంటి కఫ్తాన్ వేసుకుంటే బుట్టలు ట్రెడిషనల్ జువెల్రీ కూడా వాడచ్చు. పాదర క్షల విషయంలోనూ ప్రత్యేకతలు అవసరం లేదు. బాటమ్‌ని బట్టి ప్లాట్స్, హీల్స్ ఎంచుకోవచ్చు. ♦ క్యాజువల్ వేర్ లుక్ రావాలంటే మోకాలి వరకు ఉన్న కఫ్తాన్ ధరించాలి. బాటమ్‌గా చుడీ వేసుకుంటే సల్వార్ కమీజ్ డ్రెస్‌లా ఉంటుంది. నీ లెంగ్త్ కన్నా కిందకు వేసుకుంటే చుడీ వేసుకోవచ్చు. -
టాప్స్.. రీ ఫ్యాషన్
న్యూలుక్ ఎప్పుడూ వేసుకునే టాప్సే.. ఎప్పుడూ వేసుకునే ట్యునిక్సే.. ఎప్పుడూ వేసుకునే షర్ట్లే.. ఎప్పుడూ వేసుకునే టీ షర్ట్లే.. కొత్తగా మార్చేదెలా? సింపుల్‌గా ఇలా!! లేత రంగులో ఉన్న ప్లెయిన్ టీ షర్ట్‌కు గాఢమైన కలర్ క్లాత్‌ను ఇలా జత చేస్తే ఓ కొత్త మోడల్ టాప్ రెడీ. పొడవు చేతుల షర్ట్ అయినా, పొట్టి చేతుల చొక్కా అయినా వీపు భాగంలో త్రికోణాకృతిలో కట్ చేయాలి. దీనికి మరో కాంట్రాస్ట్ కలర్ క్లాత్ లేదా, లేస్‌ను జత చేయాలి. ఇలా చూడముచ్చటైన మరో టాప్ స్టైల్‌గా మీ ముందు సిద్ధం అవుతుంది. క్యాజువల్ వేర్లో ఓ స్టైల్‌ని క్రియేట్ చేస్తుంది. మిడ్ స్లీవ్స్ ప్లెయిన్ ట్యునిక్కి ఛాతి భాగం నుంచి ప్రింట్ మెటీరియల్‌తో స్కర్ట్‌లా కుట్టి, జత చేయాలి. ఇలా మరో అందమైన టాప్ సిద్ధం. ఈవెనింగ్ వెస్ట్రన్ పార్టీలకు స్టైల్‌గా కనువిందుచేస్తుంది. ప్లెయిన్ టీ షర్ట్ లేదా కుర్తీ అయినా తీసుకోండి. భుజం మీద నుంచి చేతుల భాగం వరకు కట్ చేయండి. కట్ చేసిన భాగాన్ని జత చేస్తూ అందమైన లేస్ వేస్తే సరి. మరో అందమైన టాప్ వేసుకోవడానికి రెడీగా ఉంటుంది. ఉన్న డ్రెస్‌లనే రీ మోడల్ చేస్తే ఇలాంటి స్టైలిష్ టాప్స్ మీ వార్డ్‌రోబ్‌లో చేరిపోతాయి. వాటిని ధరిస్తే నలుగురిలో మీకో ప్రత్యేకతను తెచ్చిపెడతారు. -
పిల్లల క్యాజువల్ వేర్...
చంటిపిల్లలకు ఎన్ని డ్రెస్సులున్నా సరిపోవు. క్యాజువల్ వేర్‌గా ఇంట్లో వేసే పైజామాలు, నైట్ డ్రెస్సులైతే ఎప్పుడూ వెతుక్కోవాల్సిందే! పెద్దవాళ్ల లాంగ్ స్లీవ్స్ షర్ట్లు, టీ షర్ట్లు, పైజామాలను ఇలా పిల్లలకు ⇔ ఉపయోగపడేలా తయారుచేసుకోవచ్చు. కొత్తగానూ వెరైటీగానూ అనిపించే ఈ డిజైనింగ్ ఈ వారం... ⇔ రెండు మూడేళ్ల పిల్లలకు ఇంట్లో వేయదగిన డ్రెస్సుల సిద్ధం చేయాలంటే ఎంతో ఖర్చుపెట్టాల్సిన ⇔ అవసరం లేదు. పెద్దవాళ్ల షర్టులు, టీషర్టులు ఉంటే చాలు వాటిలో.... ⇔ కొత్తగా ఉండి ఉపయోగించని పొడవాటి చేతులున్న టీ షర్ట్ లేదా స్వెటర్ తీసుకోవాలి. చేతుల భాగాన్ని భుజాల దగ్గర కట్ చేయాలి. పిల్లల నడుము నుంచి పాదాల వరకు కొలత తీసుకొని అంతమేరకు చాప్‌స్టిక్‌తో మార్క్ చేసుకోవాలి. తర్వాత రెండు చేతుల భాగాన్ని ఫొటోలో చూపిన విధంగా జత చేయాలి. ⇔ షర్ట్స్ చేతుల భాగాన్ని కూడా ఇలాగే తయారుచేసుకోవచ్చు. ⇔ పెద్దవాళ్ల షర్ట్స్, ప్యాంట్స్ పాకెట్స్‌ని కత్తిరించి పిల్లల పైజామాలకు జత చేస్తే అవి కొత్తవాటిలా కనిపిస్తాయి. ⇔ పెద్దవాళ్ళ పైజామా ఉపయోగంలో లేకుండా ఉంటే ఇలా చిన్నపిల్లలకు క్యాజువల్ వేర్‌గా సిద్ధం చేయవచ్చు. ⇔ షర్ట్ కింది సగభాగాన్ని స్కర్ట్గానూ, చేతుల భాగాన్ని పైజామాగానూ ఉపయోగించవచ్చు. -
టాప్ డిజైన్!
న్యూలుక్ ఎప్పుడూ ఒకేలాంటి టీ షర్ట్స్, షర్ట్స్ వేసుకోవాలంటే బోర్ అనిపించవచ్చు. ఓ కొత్త ప్రయోగంతో డిజైనర్ టాప్‌ని మీకు మీరుగానే రూపొందించుకోవచ్చు. ఇది చాలా సులువు కూడా! క్యాజువల్ వేర్‌లోనూ స్టైలిష్ లుక్‌తో అదరగొట్టే డిజైన్స్ మీ కోసం... ఒక టీ షర్ట్ లేదా షర్ట్ రూపు మార్చడానికి ఏదైనా ఒకటి ఎంచుకోవాలి. దీనికి సరైన కాంబినేషన్ గల ప్రింటెడ్ మెటీరియల్ తీసుకోవాలి. ఇందుకు రెండు షర్ట్‌లను కూడా ఉపయోగించవచ్చు. ఏ భాగం కట్ చేసి, ఏ మెటీరియల్‌ని ప్యాచ్‌గా వేస్తే టాప్ బాగా కనిపిస్తుందో ముందే ఒక అంచనాకు రావాలి. షర్ట్‌లో ఏదైనా ఒక పార్ట్ మాత్రమే కట్ చేసి, ఆ ప్లేస్‌ను కవర్ చేసేలా మెటీరియల్‌తో ప్యాచ్ చేయాలి. ఇలా ఒక్కో మార్పును చేర్చుతూ షర్ట్ రీ డిజైనింగ్ చేసుకోవచ్చు. బటన్ టాప్ కింది భాగం ► (నడుము) కట్ చేసి, దీనికి అదనంగా మరో సాఫ్ట్ క్లాత్‌ని జత చేస్తే ఇలా అందమైన టాప్ సిద్ధం. ► టీ షర్ట్ టాప్‌కి చెక్స్ షర్ట్ కాలర్, ఛాతీ భాగం, హ్యాండ్ కఫ్స్ జత చేయాలి. స్టైలిష్ టాప్ రెడీ. ► ప్లెయిన్ లాంగ్ స్లీవ్స్ టాప్‌కి వీపు భాగం, పాకెట్, స్లీవ్స్ క ఫ్స్.. మరో క్లాత్‌తో ప్యాచ్‌వర్క్ చేస్తే చూడ ముచ్చటైన షర్ట్ రెడీ. డెనిమ్ షర్ట్ కింది భాగం (నడుము నుంచి దాదాపు 5 సెంటీమీటర్ల) భాగం కట్ చే యాలి. దీనికి మరో ప్రింటెడ్ మెటీరియల్‌ను జత చేస్తే మరో డిజైనర్ షర్ట్ రెడీ చెక్స్ షర్ట్ నెక్ కాలర్ కట్ చేసి బ్లాక్ కలర్ క్లాత్‌తో పైపింగ్ చేయాలి. అలాగే చెక్స్ స్లీవ్స్ తీసేసి ప్రింటెడ్ మెటీరియల్ లాంగ్ స్లీవ్స్ జత చేయాలి. రెండు వైపులా పాకెట్స్ ప్యాచ్‌గా వేయాలి. మరో డిజైనర్ షర్ట్ సిద్ధం.