కాలరెగరేసి ముగ్గులేయండి | Shirt is completely Indian stylized entirely of our Indian style | Sakshi
Sakshi News home page

కాలరెగరేసి ముగ్గులేయండి

Published Fri, Dec 14 2018 12:38 AM | Last Updated on Fri, Dec 14 2018 12:39 AM

Shirt is completely Indian stylized entirely of our Indian style - Sakshi

షర్ట్‌ పూర్తిగా వెస్ట్రన్‌ స్టైల్‌లెహంగా పూర్తిగా మన ఇండియన్‌ స్టైల్‌ఈ రెంటినీ మిక్స్‌ చేస్తే వచ్చిందే ఈ ఇండోవెస్ట్రన్‌ స్టైల్‌. క్యాజువల్‌ వేర్‌గా, వెస్ట్రన్‌ పార్టీవేర్‌గానే కాదుసంప్రదాయ వేడుకల్లోనూ ఈ డిఫరెంట్‌స్టైల్‌తో అమ్మాయిలు గ్రాండ్‌గా వెలిగిపోవచ్చు. బాలీవుడ్‌ టు టాలీవుడ్‌ తారామణులు సైతం ఈ స్టైల్‌కి తెగ ఫిదా అయిపోయారు. సౌకర్యంగానూ, స్టైలిష్‌గానూ ఉండే లుక్‌ ఇంతకు మించి ఉండదు అంటూ వేదికల మీద తెగ సందడి చేస్తున్నారు. సంక్రాంతి వస్తోంది.ముగ్గులూ వచ్చేస్తున్నాయి. ముగ్గులు ఆడపిల్లలు వెయ్యాలని మగవాళ్లు డిసైడ్‌ చేశారు. ట్రెడిషనల్‌గా పావడా వేస్కోవాలని కూడా వాళ్లే డిసైడ్‌ చేశారు. పోనివ్వండి పాపం.జెండర్‌ వాల్యూని నిలబెట్టుకుంటూముగ్గులు వేద్దాం. కానీ కాలర్‌ ఎగరేస్తూవేద్దాం. అందుకే ఈవారం కాలర్‌ చొక్కాతో...పావడాను కలిపి వేసుకుందాం.

►పింక్‌ కలర్‌ ప్లీటెడ్‌ స్కర్ట్‌ మీదకు క్రీమ్‌ కలర్‌ సిల్వర్‌ డాట్స్‌ షర్ట్‌ ధరిస్తే ఏ వేడుకైనా, వేదికైనా ‘వహ్‌వా’ అనే కితాబులు ఇవ్వాల్సిందే! 

►‘షర్ట్‌ విత్‌ లెహంగాను వివాహ వేడుకకు ఎలా ధరిస్తావు?’ అనేవారికి ఒక గ్రాండ్‌ దుపట్టా ధరించి రాయల్‌ లుక్‌తో సమాధానం చెప్పవచ్చు. 

►ఇండోవెస్ట్రన్‌ లుక్‌తో పాటు ఈ వింటర్‌ సీజన్‌కి పర్‌ఫెక్ట్‌ ఔట్‌ఫిట్‌గా డిసైడ్‌ చేశారు డిజైనర్లు. ఫ్యాషన్‌ వేదికల మీదనే కాదు వెడ్డింగ్‌ వేర్‌గానూ ఆకట్టుకునే డ్రెస్‌.

►లెహంగాలో బాగా కనిపించే జరీ రంగు షర్ట్‌ను డిజైన్‌ చేయించుకుని ధరిస్తే రాచకళతో వేడుకలో హైలైట్‌గా నిలుస్తారు. ఇలాంటి డ్రెస్‌కి ఆభరణాల అందమూ గ్రాండ్‌గా జత చేయవచ్చు.

►తెలుగింటి పావడాకి, వెస్ట్రన్‌ ఇంటి షర్ట్‌ను జత చేస్తే వచ్చే మోడ్రన్‌  లుక్‌ ఇది. కంఫర్ట్‌లోనూ, కమాండ్‌లోనూ సాటి లేదని నిరూపిస్తుందీ స్టైల్‌. 

►సంప్రదాయ చీరను స్కర్ట్‌లా డిజైన్‌ చేసి, వైట్‌ కలర్‌ కాలర్‌ షర్ట్‌ జత చేస్తే వచ్చే లుక్‌కి యువతరం ప్లాట్‌ అయిపోతుంది. దీని మీద సిల్వర్‌ అండ్‌ ప్యాషన్‌ జువెల్రీ బాగా నప్పుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement