ఇకత్ కాటన్ వేసవి ఉక్కపోతను తట్టుకుంటుంది. సంప్రదాయకతను కళ్లకు కడుతుంది. ఆధునికతనూ సింగారించుకుంటుంది. ఈ ఫ్యాబ్రిక్ కలనేతలోనే ఎవర్‌గ్రీన్ అనిపించే గొప్పదనం దాగుంటుంది. ఇక ఈ ఫ్యాబ్రిక్‌తో డ్రెస్సులను సందర్భానికి తగినట్టు డిజైన్ చేయించుకోవచ్చు. ఒకప్పుడు బెడ్‌షీట్స్‌గానే పేరొందిన ఇకత్ ఆ తర్వాత చీరలు, డ్రెస్సుల రూపంలోకి మారి అన్ని వయసుల వారినీ ఆకట్టుకుంది. క్యాజువల్ వేర్‌గానూ, పార్టీవేర్‌గానూ, అఫిషియల్ వేర్‌గానూ తన ప్రత్యేకతను చాటుతూనే ఉంది.
ఇండోవెస్ట్రన్ స్టైల్‌లో డిజైన్ చేసిన ఇకత్ డ్రెస్సులు ఈ తరం అమ్మాయిలను, అమ్మలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అబ్బాయిలకు కుర్తీలు, అమ్మాయిలకు ఫ్రాక్స్, లాంగ్ గౌన్స్‌తో పాటు వీటికి ఈ కాలానికి తగినట్టు మ్యాచింగ్‌గా ఇకత్ మాస్క్‌లను కూడా జత చేసుకోవచ్చు.
అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలో ఉండే ఇకత్ సింగిల్, డబుల్, పట్టులో లభిస్తుంది. కాటన్‌లో అయితే యంగ్‌స్టర్స్‌కి ఫ్రాక్స్. మోడలింగ్‌కి ప్యాంట్–క్రాప్‌టాప్ విత్ ఓవర్ కోట్, లాంగ్‌గౌన్స్ చిన్న చిన్న గెట్ టు గెదర్ పార్టీలకు హ్యాపీగా ధరించవ్చు. ఇది చేనేతకారులను ప్రోత్సహించాల్సిన సమయం. ఇకత్ క్లాత్‌తో ఎన్ని డిజైన్లు చేసుకోగలిగితే అన్నీ ప్రయత్నించవచ్చు. అందుకు కొన్ని మోడల్స్ ఇవి.
– రజితారాజ్, డిజైనర్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment