Long Gown
-
లాంగ్ గౌన్‌లో మెరిసిపోతున్న హీరోయిన్! డ్రెస్ ధర తక్కువే.. అయితే..
Gouri G Kishan: ‘జాను’ సినిమాలో చిన్ననాటి జానకిగా సంప్రదాయంగా కనిపించి.. రెండో సినిమా ‘శ్రీదేవి–శోభన్‌బాబు’లో మోడర్న్ లుక్‌లో మెరిసి అభియనంలోనే కాదు అపియరెన్స్లోనూ వైవిధ్యాన్ని చాటుకుంది గౌరీ జి. కిషన్. ఈ వెర్సటాలిటీని తను అనుసరించే ఫ్యాషన్‌లోనూ చూపిస్తోంది. ప్రడే.. స్వచ్ఛమైన వెండి నగలకు పెట్టింది పేరు ఈ బ్రాండ్. మెషిన్ మేడ్ కాకుండా నైపుణ్యంగల స్వర్ణకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న నగలే ఈ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వాల్యూ. ఆ క్రియేటర్ పేరు దీప్తి ముత్తుసామి. జ్యూలరీ డిజైనింగ్ మీదున్న ఆసక్తే ఆమెను ఈ రంగంలోకి దింపింది. ఫ్యాషన్ ఎంట్రపెన్యూర్‌గా మార్చింది. దేశంలోనే పేరెన్నికగన్న జ్యూలరీ బ్రాండ్లలో ఒకటిగా ‘ప్రడే’ను నిలిపేలా చేసింది. ఈ బ్రాండ్ జ్యూలరీ ఇటు సంప్రదాయ వస్త్రధారణకైనా.. అటు వెస్టర్న్ అవుట్ ఫిట్స్కైనా నప్పేలా ఉంటుంది. ధరలూ అంతే అటు సామాన్యులూ కొనేలా ఇటు సెలెబ్రిటీల స్థాయినీ పెంచేలా ఉంటాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. మాగ్జీహం.. పేరుకు తగ్గట్టుగానే ఎంతో ఆనందభరితంగా ఉంటాయి ఈ మాగ్జీహం కలెక్షన్స్. కాలేజీకెళ్లే యువతులే ఈ డిజైనర్ మెయిన్ టార్గెట్. క్యాజువల్ డ్రెసెస్‌కు కేరాఫ్‌గా ఉంటుంది ఈ బ్రాండ్. బడ్జెట్ ఫ్రెండ్లీ దుస్తులను అందిస్తూ చాలామంది యువతులకు ఫేవరేట్‌గా మారింది. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేసుకోవచ్చు. చెన్నైలోని టీనగర్లో మెయిన్ బ్రాంచ్ ఉంది. బ్రాండ్ వాల్యూ డ్రెస్ బ్రాండ్: మాగ్జీహం ధర: రూ. 4,500 జ్యూలరీ బ్రాండ్: ప్రడే కమ్మల ధర: రూ. 3,130 నెక్‌పీస్ ధర: రూ. 19,030 కొన్నిసార్లు పొగడ్తలు కూడా విమర్శల మాదిరి హాని చేస్తాయి. అందుకే, రెండింటినీ మనసుకు తీసుకోను. – గౌరీ జి.కిషన్ -దీపిక కొండి చదవండి: Deepika Padukone: ఒంటి మీదే క్షణాల్లో ఆల్టరేషన్.. రణ్వీర్ డ్రెసెస్‌కి కూడా! ఈ చీర ధర తెలిస్తే.. -
Fashion: ఇకత్ స్టైల్.. ఎవర్గ్రీన్
ఇకత్ కాటన్ వేసవి ఉక్కపోతను తట్టుకుంటుంది. సంప్రదాయకతను కళ్లకు కడుతుంది. ఆధునికతనూ సింగారించుకుంటుంది. ఈ ఫ్యాబ్రిక్ కలనేతలోనే ఎవర్గ్రీన్ అనిపించే గొప్పదనం దాగుంటుంది. ఇక ఈ ఫ్యాబ్రిక్‌తో డ్రెస్సులను సందర్భానికి తగినట్టు డిజైన్ చేయించుకోవచ్చు. ఒకప్పుడు బెడ్షీట్స్గానే పేరొందిన ఇకత్ ఆ తర్వాత చీరలు, డ్రెస్సుల రూపంలోకి మారి అన్ని వయసుల వారినీ ఆకట్టుకుంది. క్యాజువల్ వేర్‌గానూ, పార్టీవేర్‌గానూ, అఫిషియల్ వేర్‌గానూ తన ప్రత్యేకతను చాటుతూనే ఉంది. ఇండోవెస్ట్రన్ స్టైల్లో డిజైన్ చేసిన ఇకత్ డ్రెస్సులు ఈ తరం అమ్మాయిలను, అమ్మలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అబ్బాయిలకు కుర్తీలు, అమ్మాయిలకు ఫ్రాక్స్, లాంగ్ గౌన్స్తో పాటు వీటికి ఈ కాలానికి తగినట్టు మ్యాచింగ్‌గా ఇకత్ మాస్క్‌లను కూడా జత చేసుకోవచ్చు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలో ఉండే ఇకత్ సింగిల్, డబుల్, పట్టులో లభిస్తుంది. కాటన్లో అయితే యంగ్‌స్టర్స్‌కి ఫ్రాక్స్. మోడలింగ్‌కి ప్యాంట్–క్రాప్‌టాప్ విత్ ఓవర్ కోట్, లాంగ్గౌన్స్ చిన్న చిన్న గెట్ టు గెదర్ పార్టీలకు హ్యాపీగా ధరించవ్చు. ఇది చేనేతకారులను ప్రోత్సహించాల్సిన సమయం. ఇకత్ క్లాత్‌తో ఎన్ని డిజైన్లు చేసుకోగలిగితే అన్నీ ప్రయత్నించవచ్చు. అందుకు కొన్ని మోడల్స్ ఇవి. – రజితారాజ్, డిజైనర్, హైదరాబాద్ -
పూలు చల్లిన హోలీ
కెమికల్ కలర్స్ ఔట్... నేచురల్ కలర్స్ ఇన్ పూల నుంచి తోడిన రంగులతో హోలీ చిలకరింపులు అందంగా ఉంటాయి. మరి, ఆ పూల అచ్చులతోనే రంగులు అద్దుకుంటే ఎలా ఉంటుంది? అచ్చం పూలు చల్లిన హోలీలా ఉంటుంది. ►ఫ్రాక్ అంతా పువ్వులు రంగులు అద్దుకోవడానికి ముట్టడి చేస్తే నడిచివచ్చే సౌందర్యం కళ్లను కట్టడి చేయాల్సిందే! ► టాప్ టు బాటమ్ పువ్వుల నవ్వులు తోడైతే వెస్ట్రన్ పార్టీలో వెలుగుల రవ్వలు విరజిమ్మాల్సిందే. ► రంగులన్నీ చేరి పువ్వులుగా మారి అవి ప్రింట్లుగా దర్శనమిస్తే పెరిగే వయసుకూ అడ్డుకట్టవేయాల్సిందే! వనితను వైవిధ్యంగా చూపాల్సిందే! ► అంతర్జాతీయ వేదికలైనా సరే పువ్వుల సింగారాలు దుస్తుల మీదకు చేరితే అందరి చూపులు అల్లుకుపోవాల్సిందే! ► పువ్వులు, లతలు జత చేరి అల్లుకుపోయాయంటే అవి లాంగ్ గౌన్‌కు కొత్త వన్నెలద్దాల్సిందే. అందంగా రూపుకట్టాల్సిందే! ► అమ్మాయి మేనిరంగుతో పోటీ పడాలని గులాబీల సోయగం ఫ్రాక్ మీద రూపు కడితే అవి నిలువెల్లా విరిజల్లులై మురిపించాల్సిందే! ► మోదుగపూల సింగారం తెల్లని టాప్ మీదకు చేరితే వాటికి పోటీగా పూలన్నీ రంగులను కుమ్మరించాల్సిందే! అవి మేనికి వసంతాన్ని మోసుకురావాల్సిందే! -
పట్టు చీరకు కొత్త హంగులు..
పెళ్లిళ్ల సీజన్. పాత పట్టుచీరలను పెట్టెల అడుగునే ఉంచేయకుండా వాటికో కొత్త రూపు ఇస్తే న్యూ లుక్ ఇలా నలుగురిలో ప్రత్యేకంగా నిలుపుతాయి.సంప్రదాయ పట్టుచీరను ఆధునికపు హంగులు అద్ది లాంగ్ గౌన్‌గా రూపు కట్టవచ్చు.చీరంతా పాడైపోయినా, అంచులు, పల్లూ డిజైన్స్ జరీ మెరుపులు కొత్తగా అలాగే ఉండిపోతాయి. వీటిని అందమైన క్లాత్ హ్యాండ్ బ్యాగులుగా రూపొందించుకోవచ్చు. పట్టు చీరను ఇలా చుడీ టాప్‌గా డిజైన్చేయించుకోవచ్చు. చీరకట్టుకోవడానికి ఇబ్బంది పడే అమ్మాయిలు వీటిని సౌకర్యవంతంగా ధరించవచ్చు.అంచుల మీద ఆప్లిక్, గోటా వర్క్ చేసిన ఎరుపు, పచ్చ, నారింజ రంగుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న కంజీవరం లాంగ్ అనార్కలీ ఇది. చీరంతా పాడైపోయినా, అంచులు, పల్లూ డిజైన్స్ జరీ మెరుపులు కొత్తగా అలాగే ఉండిపోతాయి. వీటిని అందమైన క్లాత్ హ్యాండ్ బ్యాగులుగా రూపొందించుకోవచ్చు. -
35 కిలోల బరువున్న గౌనులో...!
సన్నగా మెరుపు తీగలా చూడచక్కగా ఉంటారు అనుష్క శర్మ. ఆమె బరువు అటూ ఇటూగా ఓ యాభై కేజీలు ఉంటుందేమో. కథానాయికలందరూ దాదాపు ఈ బరువునే మెయిన్టైన్ చేస్తుంటారు. అందుకే.. ‘దేవదాస్’, ‘జోధా అక్బర్’ చిత్రాల్లో ఐశ్వర్యారాయ్, ‘అరుంధతి’ సినిమాలో అనుష్క కేజీల కొద్దీ నగలు, బరువున్న దుస్తులు ధరించినప్పుడు ‘లేత భామలు ఎంతో భారం మోస్తున్నా’రని చెప్పుకున్నారు. ఇప్పుడు అనుష్కశర్మ గురించి ఈ విధంగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రాల్లో ‘బాంబే వెల్వెట్’ ఒకటి. ఇందులో అనుష్క శర్మ జాజ్ సింగర్‌గా నటిస్తున్నారు. ఆధునిక యువతి పాత్ర కాబట్టి, చాలా స్టయిలిష్‌గా కనిపిస్తారు. ఈ సినిమాలో దాదాపు 144 రకాల దుస్తుల్లో కనిపిస్తారు ఈ బ్యూటీ. వాటిలో ఓ పొడవాటి గౌను ఉంది. ఆ గౌను బరువు 35 కేజీలు. దీన్ని నిహారికా బాసిన్ఖాన్ డిజైన్ చేశారు. పొడవాటి గౌను కాబట్టి, అనుష్క నడుస్తున్నప్పుడు ఇద్దరు అసి స్టెంట్లు రెండు వైపులా ఆమెతో నడుస్తూ గౌను పట్టుకోవాల్సి వచ్చేదట. ఈ గౌనులో నడవడమే కష్టం అంటే.. ఇక డాన్స్ చేయాల్సి వస్తే అనుష్క పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కానీ, అదృష్టం కొద్దీ కేవలం టాకీ సీన్స్‌కి మాత్రమే ఈ గౌను వాడుతున్నారు. ఈ గౌను డిజైన్ చేయడానికి చాన్నాళ్లు పట్టిందట. మొత్తం డిజైనింగ్ పూర్తయిన తర్వాత నిహారికా ఊపిరి పీల్చుకున్నారు. కానీ, ఈ చిత్రం షూటింగ్ శ్రీలంకలో జరిగినప్పుడు, అక్కడి వర్షాలకు గౌను పై భాగం మొత్తం తడిచిపోయింది. దాంతో డ్యామేజ్ అయినంతవరకూ కత్తిరించి మళ్లీ డిజైన్ చేశారు.