35 కిలోల బరువున్న గౌనులో...! | Anushka Sharma gains 35 kg for Bombay Velvet | Sakshi
Sakshi News home page

35 కిలోల బరువున్న గౌనులో...!

Published Thu, Jul 10 2014 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 10:03 AM

35 కిలోల బరువున్న గౌనులో...!

35 కిలోల బరువున్న గౌనులో...!

సన్నగా మెరుపు తీగలా చూడచక్కగా ఉంటారు అనుష్క శర్మ. ఆమె బరువు అటూ ఇటూగా ఓ యాభై కేజీలు ఉంటుందేమో. కథానాయికలందరూ దాదాపు ఈ బరువునే మెయిన్‌టైన్ చేస్తుంటారు. అందుకే.. ‘దేవదాస్’, ‘జోధా అక్బర్’ చిత్రాల్లో ఐశ్వర్యారాయ్, ‘అరుంధతి’ సినిమాలో అనుష్క కేజీల కొద్దీ నగలు, బరువున్న దుస్తులు ధరించినప్పుడు ‘లేత భామలు ఎంతో భారం మోస్తున్నా’రని చెప్పుకున్నారు.

ఇప్పుడు అనుష్కశర్మ గురించి ఈ విధంగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రాల్లో ‘బాంబే వెల్వెట్’ ఒకటి. ఇందులో అనుష్క శర్మ జాజ్ సింగర్‌గా నటిస్తున్నారు. ఆధునిక యువతి పాత్ర కాబట్టి, చాలా స్టయిలిష్‌గా కనిపిస్తారు. ఈ సినిమాలో దాదాపు 144 రకాల దుస్తుల్లో కనిపిస్తారు ఈ బ్యూటీ.
 
వాటిలో ఓ పొడవాటి గౌను ఉంది. ఆ గౌను బరువు 35 కేజీలు. దీన్ని నిహారికా బాసిన్‌ఖాన్ డిజైన్ చేశారు. పొడవాటి గౌను కాబట్టి, అనుష్క నడుస్తున్నప్పుడు ఇద్దరు అసి స్టెంట్లు రెండు వైపులా ఆమెతో నడుస్తూ గౌను పట్టుకోవాల్సి వచ్చేదట. ఈ గౌనులో నడవడమే కష్టం అంటే.. ఇక డాన్స్ చేయాల్సి వస్తే అనుష్క పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

కానీ, అదృష్టం కొద్దీ కేవలం టాకీ సీన్స్‌కి మాత్రమే ఈ గౌను వాడుతున్నారు. ఈ గౌను డిజైన్ చేయడానికి చాన్నాళ్లు పట్టిందట. మొత్తం డిజైనింగ్ పూర్తయిన తర్వాత నిహారికా ఊపిరి పీల్చుకున్నారు. కానీ, ఈ చిత్రం షూటింగ్ శ్రీలంకలో జరిగినప్పుడు, అక్కడి వర్షాలకు గౌను పై భాగం మొత్తం తడిచిపోయింది. దాంతో డ్యామేజ్ అయినంతవరకూ కత్తిరించి మళ్లీ డిజైన్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement