ఒక సినిమాతో...రెండు కోరికలు! | Can't wait to direct Anushka Sharma, Aishwarya Rai: Karan | Sakshi
Sakshi News home page

ఒక సినిమాతో...రెండు కోరికలు!

Published Thu, Apr 2 2015 11:06 PM | Last Updated on Sat, Sep 2 2017 11:45 PM

ఒక సినిమాతో...రెండు కోరికలు!

ఒక సినిమాతో...రెండు కోరికలు!

 దర్శక, నిర్మాత కరణ్ జోహార్‌కి ఒకే సినిమాతో రెండు కోరికలు తీరనున్నాయి. ఐశ్వర్యారాయ్‌తో సినిమా చేయాలన్నది ఓ కోరిక అయితే, రణ్‌బీర్ కపూర్-అనుష్క శర్మ జంటగా ఓ చిత్రం చేయాలన్నది మరో కోరిక. ఈ రెండు కోరికలూ ‘ఏ దిల్ హై ముష్కిల్’ అనే ఒకే చిత్రం ద్వారా తీరుతున్నాయి. పదిహేనేళ్ల క్రితం దర్శకత్వం వహించిన ‘కుఛ్ కుఛ్ హోతా హై’, తర్వాత చేసిన ‘కభీ ఖుషీ కభీ గమ్’ సమయం నుంచీ ఐశ్వర్యారాయ్‌తో ఓ చిత్రం చేయాలనుకున్నాననీ, ‘బాంబే వెల్వెట్’ చిత్రానికి సంబంధించిన ఫొటోల్లో రణ్‌బీర్, అనుష్కల మధ్య కెమిస్ట్రీ చూసి, ఆ జంటతోనే చేయాలనుకున్నాననీ కరణ్ పేర్కొన్నారు.
 
  ఈ ముగ్గురికీ తగ్గట్టు ఆయనో కథ తయారు చేసుకున్నారు. ప్రేమ నేపథ్యంలో సాగే ఈ కథ విని ఐష్, రణ్‌బీర్, అనుష్కలు మరో ఆలోచనకు తావివ్వకుండా పచ్చజెండా ఊపారట. అనుబంధాలు, ప్రేమ ద్వారా జీవితానికి వచ్చే పరిపూర్ణత, అదే ప్రేమ వల్ల విరిగే మనసుల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని సమాచారం. ఇప్పటి వరకు దర్శక, నిర్మాతగా కరణ్ జోహార్ దాదాపు పాతిక సినిమాలు తీస్తే, అతి వేగంగా ప్రధాన పాత్రధారుల్ని ఎంపికచేసిన చిత్రం ఇదేనట. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement