యాక్టింగ్‌తో పాటు యాటిట్యూడ్.. యాక్టర్స్ నుంచి ఇప్పటి జనరేషన్ కోరుకునేది ఇదే. ఆ లక్షణాలతో వందకు వంద శాతం పూర్తిగా న్యాయం చేస్తున్న ఏకైక బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్. తన విచిత్రమైన మేనరిజంతో.. నటనలో వేరియేషన్స్‌తో అతని ఫ్యాన్స్‌లో, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్‌గా మారుతుంటాడు రణ్‌వీర్. ఇవాళ రణ్‌వీర్ 36వ పుట్టినరోజు...
బాంద్రాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి జగ్జీత్ సింగ్ భవ్నాని కొడుకే ఈ రణ్‌వీర్ సింగ్. స్కూల్ రోజుల్లోనే అల్లరిని అవపోసన పట్టిన రణ్‌వీర్.. పేరు పొడుగ్గా ఉందనే ఉద్దేశంలో భవ్నానిని లేపేసుకున్నాడు. కాపీరైటర్‌గా కెరీర్ మొదలుపెట్టి ఆపై మోడలింగ్ అటు నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టాడు రణ్‌వీర్ సింగ్. ఎక్స్ రేటెడ్(అడల్ట్) మ్యాగజైన్స్‌ను తెగ ఇష్టపడే రణ్‌వీర్.. అవకాశాల కోసం తొలినాళ్లలో బాగానే కష్టపడ్డాడు. అయితే ఆరంభంలోనే మూడు పెద్ద సినిమాల అవకాశాలు వచ్చాయి. కానీ, బ్యాండ్ బాజా బరాత్ కోసం ఇచ్చిన కమిట్‌మెంట్‌కు కట్టుబడి వాటిని వదిలేసుకున్నాడు.
ఫ్యాన్స్ ఫేవరెట్
కోస్టార్స్‌కి మాత్రమే కాదు.. అభిమానులకూ రణ్‌వీర్ సింగ్ అంటే ఒక ఎనర్జీ. ఈవెంట ఏదైనాసరే ఎప్పుడూ రెడ్‌బుల్ తాగినోడిలా ఎనర్జిటిక్‌గా ఉంటూ సందడి చేస్తుంటాడు. ఫ్యాన్స్‌కు అతనొక ఫ్రెండ్లీ స్టార్. ఎవరైనా ‘సర్ మీ అభిమాని’ని అని చెబితే చాలు.. ఆప్యాయంగా వాళ్లను వాటేసుకుని ఫొటోలు దిగుతుంటాడు రణ్‌వీర్. అంతేకాదు ఎందరికో ఆర్థిక సాయం అందించాడు. చెప్పాపెట్టకుండా అభిమాల పుట్టినరోజు వేడుకలకు సైతం హాజరై ఆశ్చర్యపరుస్తుంటాడు. అభిమానుల మానసిక ఆనందమే తనకు ముఖ్యమని చాలాసార్లు ప్రకటించాడు ఈ యంగ్ హీరో.
ఖిల్జీగా క్రూరత్వం
కెరీర్ మొదట్లో రణ్‌వీర్‌ది చిచ్చొర యాక్టింగ్ అనే ముద్రపడిపోయింది. కానీ, తనలోని వేరియెన్స్‌ను క్రమంగా బయటపెడుతూ అలరిస్తూ వచ్చాడు. దిల్ దడక్‌నే దో(2015) రణ్‌వీర్ నటనకు తొలిగా ప్రశంసలు దక్కేలా చేసింది. గోలియోన్ కీ రాస్‌లీలా రామ్-లీలాలోని అతని నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ నటనను మెచ్చి బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్.. రణ్‌వీర్‌ను పొడుగుతూ స్వదస్తూరితో రాసిన లేఖను పంపాడు. ఇక బాజీరావ్ మస్తానీలో నటనకు బెస్ట్ యాక్టర్ ఫిల్మ్‌ఫేర్ అందుకున్న రణ్‌వీర్.. పద్మావత్‌లో అల్లావుద్దీన్ ఖిల్జీ రోల్‌తో క్రూరత్వాన్ని పండించి అందరినీ మెప్పించాడు. సింబా, గల్లీబాయ్ సక్సెస్‌ల తర్వాత ‘83’ లాంటి బయోగ్రాఫికల్ స్పోర్స్ డ్రామా ద్వారా, అపరిచితుడు రీమేక్‌తో తన కెపాసిటీని చూపించేందుకు రెడీ అయ్యాడు.
లవ్ యూ దీప్‌వీర్
కెరీర్‌లో, బయట క్రేజీగా కనబడే రణ్‌వీర్.. ఫ్యామిలీ విషయంలో మాత్రం బాధ్యతగా ఉంటాడు. పేరెంట్స్, అక్క మధ్య అల్లరిగా పెరిగిన రణ్‌వీర్.. ఎఫైర్ల విషయంలోనూ ఓపెన్‌గానే ఉంటాడు. కాలేజీ రోజుల్లో అమ్మాయిల వెంటపడి చిల్లరగా వ్యవహరించానని ఓపెన్‌గానే ఇంటర్వ్యూలలో ఒప్పుకున్నాడు రణ్‌వీర్. అయితే సినిమాల్లోకి అడుగుపెట్టాక హేమా మాలిని చిన్న కూతురు అహానాతో మొదట డేటింగ్ చేశాడు. ఆ తర్వాత దీపికా పదుకొనేతో ప్రేమాయాణం.. అభిమానుల అనుమానాల మధ్యే వాళ్ల వాళ్లిద్దరూ ఒక్కటైపోవడం.. ఆప్యాయంగా సాగుతున్న దీప్‌వీర్ అనుబంధం గురించి అందరికీ తెలిసిందే.
వీడు హీరోనా?:కరణ్
రణ్‌వీర్ తొలి మూవీ ‘బ్యాండ్ బాజా బారాత్’(2010). రణ్‌వీర్‌ను యశ్‌రాజ్ స్టూడియో దగ్గర తొలిసారి చూసిన బాలీవుడ్ సీనియర్ ఫిల్మ్‌మేకర్ కరణ్ జోహర్ ‘వీడేం హీరో’ అనుకున్నాడట. ఇక ఈ సినిమా పోస్టర్ చూసి ‘వీడు హీరో అయితే ఈ సినిమా ఎవడు చూస్తాడు’ అనుకున్నాడంట. అంతేకాదు నిర్మాత ఆదిత్యా చోప్రాతో ఈ విషయంపై చర్చించాడట కూడా. ఇక బలవంతంగా ఆ సినిమా చూశాక.. తన అభిప్రాయం మార్చుకున్నాడనని, రణ్‌వీర్ విషయంలో మూర్ఖంగా ఆలోచించాననే విషయం అప్పుడు అర్థమైందని కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో గుర్తు చేసుకున్నాడు కరణ్. ఇప్పుడు అదే కరణ్ డైరెక్షన్‌లో కొత్తగా ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు. అలియాభట్‌తో పాటు జయాబచ్చన్, షబానా అజ్మీ, ధర్మేంద్ర ఇందులో కీలక పాత్రల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
మీమ్ కంటెంట్
రణ్‌వీర్.. సోషల్ మీడియాలో ఒక మీమ్ స్టఫ్. యాక్టింగ్ కంటే రణ్‌వీర్ జనాలకు ఎక్కువగా దగ్గరైంది ఈ యాటిట్యూడ్‌తో. విచిత్రమైన అతని అటిరే(డ్రెస్సింగ్ విధానం), వేషధారణలు మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ చర్చగా మారుతుంటాయి. ఫ్యాషన్ విషయంలో అతనొక ట్రెండ్ సెట్టర్. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ, ఆ ట్రెండ్‌ను ఫాలో కావాలంటే కొంచెం గట్స్ కూడా ఉండాలి. అంతెందుకు కండోమ్ యాడ్‌లో యాక్ట్ దమ్మున్న హీరో రణ్‌వీర్ మాత్రమేనేమో!. సెటైర్, వరెస్ట్.. ఇలా ఎన్ని కామెంట్లు వినిపించినా.. విమర్శలు చుట్టుముట్టినా రణ్‌వీర్ మాత్రం మారడు. పైగా ఈ కోణాలన్ని ఉన్నందునే ఈ యంగ్ ఫైనెస్ట్ యాక్టర్‌ను ‘తేడా సింగ్’గా చూస్తూ.. ఆదరిస్తూ వస్తున్నారు అశేష అభిమానులు.
Comments
Please login to add a commentAdd a comment