Who Is The Guest Of Bigg Boss 5 Telugu Grand Finale, Deets Inside In Telugu - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: గ్రాండ్‌ ఫినాలేలో బాలీవుడ్‌ స్టార్స్‌ సందడి!

Published Mon, Dec 13 2021 7:02 PM | Last Updated on Wed, Dec 15 2021 11:53 PM

Who Is The Guest Of Bigg Boss 5 Telugu Grand Finale, Deets Inside In Telugu - Sakshi

Bigg Boss Telugu 5, Grand Finale Guests: బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ కథ క్లైమాక్స్‌కు చేరింది. ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పుడొక లెక్క అన్నట్లుగా ఉంది కంటెస్టెంట్ల మధ్య పోటీ. ఇన్నివారాలు మేము పోరాడాం, ఇప్పుడు మా కోసం మీరు పోరాడండి అంటూ తమకు ఓట్లేసి గెలిపించే భారాన్ని ప్రేక్షకులపై వేశారు ఫైనలిస్టులు. వచ్చే వారమే విజేత ఎవరో తేలిపోనుంది. 

డిసెంబర్‌ 19న జరగనున్న గ్రాండ్‌ ఫినాలేను నెవర్‌ బిఫోర్‌ అనే రేంజ్‌లో ప్లాన్‌ చేస్తున్నారు. మొదట్లో ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ ముఖ్య అతిథులుగా వస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ టాలీవుడ్‌ కాకుండా ఏకంగా బాలీవుడ్‌ నుంచి సెలబ్రిటీలను పట్టుకొచ్చే ప్లాన్‌లో ఉన్నారట బిగ్‌బాస్‌ నిర్వాహకులు. స్టార్‌ జంట రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొనేలతో పాటు బ్యూటిఫుల్‌ హీరోయిన్‌ అలియా భట్‌ను సైతం గ్రాండ్‌ ఫినాలేకు ముఖ్య అతిథులుగా తీసుకువచ్చేందుకు సంప్రదింపులు జరుపుతున్నారట! అలాగే టాలీవుడ్‌ స్టార్‌ హీరో రామ్‌చరణ్‌ సైతం షోలో సందడి చేయనున్నాడట! ఇదే నిజమైతే స్క్రీన్‌పై ఇంతమంది సెలబ్రిటీలను ఒకేసారి చూడటం ప్రేక్షకులకు కనులవిందు అనే చెప్పాలి! మరి గ్రాండ్‌ ఫినాలేకు ఈ నలుగురే ఫిక్స్‌ అయ్యారా? లేదంటే ఈ సీజన్‌ విజేతకు ట్రోఫీ అందించేందుకు మరెవరైనా సెలబ్రిటీ వస్తారా? అన్నది చూడాలి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement