Bigg Boss Telugu 5 TRP Rating: 6.2 Crore People Watch Grand Finale - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: గ్రాండ్‌ ఫినాలే టీఆర్పీ, నాల్గో సీజన్‌ కంటే తక్కువే!

Published Fri, Dec 31 2021 11:31 AM | Last Updated on Fri, Dec 31 2021 12:41 PM

Bigg Boss Telugu 5 TRP Rating: 6.2 Crore People Watch Grand Finale - Sakshi

Bigg Boss 5 Telugu Grand Finale TRP Rating: బుల్లితెర హిట్‌ షో బిగ్‌బాస్‌ ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. కానీ, భారీ టీఆర్పీ అందుకోవడంలో మాత్రం ఘోరంగా విఫలమైంది. సెప్టెంబర్‌ 5న అంగరంగ వైభవంగా ప్రారంభమైన బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ డిసెంబర్‌ 19న ముగిసింది. 19 మందితో ప్రారంభమైన ఈ షోలో నటుడు, యాంకర్‌ వీజే సన్నీ విజేతగా నిలవగా యూట్యూబర్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌ రన్నరప్‌గా అవతరించాడు.

తాజాగా ఈ షో గ్రాండ్‌ ఫినాలే టీఆర్పీ రేటింగ్‌ వివరాలను వెల్లడించింది స్టార్‌ మా. రాజమౌళి, రణ్‌బీర్‌ కపూర్‌, నాని, సాయిపల్లవి, కృతీ శెట్టి, రష్మిక మందన్నా, సుకుమార్‌, దేవి శ్రీ ప్రసాద్‌, అలియా భట్‌.. ఇలా ఎందరో సినీ ప్రముఖులు హాజరై సందడి చేసిన గ్రాండ్‌ ఫినాలే ఎపిసోడ్‌ను 6.2 కోట్ల మంది వీక్షించారని తెలిపింది. మొత్తంగా దీనికి 18.4 టీఆర్పీ వచ్చిందని స్పష్టం చేసింది. హాట్‌స్టార్‌లో లక్షలాది మంది సైతం గ్రాండ్‌ ఫినాలేను వీక్షించారని పేర్కొంది.

కాగా బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌కు అత్యధికంగా 21.7 టీఆర్పీ వచ్చింది. ఈ రికార్డును నాగార్జున తిరగరాస్తాడనుకుంటే 18.4 రేటింగ్‌తో సరిపెట్టుకున్నాడు. ఇక యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన తొలి సీజన్‌కు 14.13, రెండో సీజన్‌కు 15.05, మూడో సీజన్‌కు 18.29 టీఆర్పీ రేటింగ్స్‌ వచ్చాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement