
Bigg Boss 5 Telugu Grand Finale Highlights, Siri Eliminated: బిగ్‌బాస్ ఫైనల్స్‌కు చేరిన ఐదుగురిలో నుంచి మొదటగా సిరి ఎలిమినేట్ అయింది. బిగ్‌బాస్ హౌస్ నుంచి స్టేజీపైకి వచ్చిన సిరి తనకెలా ఉండాలనిపిస్తే అలాగే ఉన్నానంటూ మాట్లాడింది. ఇప్పటికే ఓసారి ఎలిమినేషన్ అంటూ బిగ్‌బాస్ ప్రాంక్ చేశారు కాబట్టి ఇప్పుడు ఎలిమినేట్ అయినా పెద్దగా బాధపడలేడని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా నాగార్జున.. సిరి తల్లి శ్రీదేవి బాధతో చెప్పిన మాటలను ప్రస్తావించాడు. ఫ్యామిలీ ఎపిసోడ్‌లో హౌస్‌లోకి వచ్చిన మీ అమ్మ.. హగ్గులు నచ్చట్లేదని మాట్లాడాల్సింది కాదని చాలా బాధపడిందన్నాడు.
దీనిపై సిరి స్పందిస్తూ.. 'మాది మధ్యతరగతి కుటుంబం. అమ్మ చుట్టాల మాటలు ఎక్కువగా వింటుంది. ఆ మాటలు ఆమె మనసులో నుంచి వచ్చినవి కావు. అది నాకు తెలుసు. పదిహేను వారాలు నన్ను భరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు లేనిదే నేను లేను' అని పేర్కొంది. కాగా సిరి తల్లి ఫ్యామిలీ ఎపిసోడ్‌లో షణ్ముఖ్‌కు దగ్గరయిపోతున్నావు, హగ్గులివ్వడం నచ్చట్లేదంటూ చెప్పిన విషయం తెలిసిందే! ఇవి అప్పట్లో చాలా వైరల్‌గా మారాయి. అయితే తల్లిగా కూతురికి మంచి చెప్పినందుకు కూడా ఆమె విమర్శలు ఎదుర్కొందట! ఇదే విషయాన్ని ఈరోజు నాగార్జునతో చెప్తూ.. అలాంటి మాటలు ఎలా చెప్తావు, నీవు తల్లివేనా? అని చాలా అన్నారు, నేనలా మాట్లాడాల్సింది కాదు అంటూ బాధపడిందావిడ. అయితే నాగ్ మాత్రం.. తల్లిగా నీకు అనిపించింది చెప్పడంలో తప్పు లేదని సమర్థిస్తూ ఆమెను ఓదార్చాడు.
Comments
Please login to add a commentAdd a comment