Bigg Boss Telugu 5 Promo: Nagarjuna Serious On VJ Sunny - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: తంతావు, అమ్ముతావా? సన్నీకి నాగ్‌ చురకలు

Published Sat, Nov 13 2021 6:28 PM | Last Updated on Sat, Nov 13 2021 7:40 PM

Bigg Boss Telugu 5 Promo: Nagarjuna Serious On VJ Sunny - Sakshi

Bigg Boss Telugu 5 Promo: సిరి-సన్నీల మధ్య జరిగిన వార్‌తో నాగార్జున ఎటువైపు నిలబడతాడనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉదయం నుంచి ప్రోమో కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూశారు. ఎట్టకేలకు ఆలస్యంగానైనా బిగ్‌బాస్‌ ప్రోమో వదిలాడు. అందరూ ఊహించినట్లుగానే ఆవేశంలో సన్నీ మాటలు జారడాన్ని నాగ్‌ తప్పుపట్టాడు. రవి కూడా సన్నీది చాలా బ్యాడ్‌ బిహేవియర్‌ అని, లూజ్‌ టంగ్‌ అని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ ఇష్టమొచ్చినట్లు చేస్తాననడం తప్పన్నాడు. తంతా అనడం తప్పని రవి అనడంతో ఆ మాటే అనలేదని సన్నీ బుకాయించాడు. మానస్‌ కూడా అవుననంటూ సన్నీకి వత్తాసు పలకడం గమనార్హం.

దీంతో బిగ్‌బాస్‌ వీడియో చూపించగా అందులో సన్నీ తంతాను అనడం స్పష్టంగా కనిపించింది. అయితే తంతానని టవర్‌ బ్రిక్స్‌ను అన్నానని చెప్పగా సిరి మాత్రం లేదు, తననే అన్నాడని చెప్పింది. నిజానికి సన్నీ బ్రిక్స్‌నే తంతాను అని చెప్పాడు కానీ బిగ్‌బాస్‌ ఆ క్లిప్పింగ్‌ చూపించనట్లు కనిపిస్తోంది. నిన్నే అమ్మేస్తానని ఎవర్ని అన్నావని నిలదీయగా ఆ మాట అనలేదన్నాడు సన్నీ. దీంతో యానీ మధ్యలో కలగజేసుకుంటూ అతడు కోపంలో ఏదో అనేస్తాడు, కానీ సిరిని అమ్మేస్తాననలేదని చెప్పింది. అంటే కోపంలో ఏదైనా అనేయొచ్చా? అని నిలదీశాడు. మరి నాగ్‌ సన్నీకి మాత్రమే క్లాస్‌ పీకాడా? ఇంకా ఎవరెవరికి కోటింగ్‌ ఇచ్చాడనేది తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement