
Bigg Boss Telugu 5 Promo: ఇవాళ శనివారం.. అంటే టాలీవుడ్ కింగ్ నాగార్జున బిగ్‌బాస్ స్టేజీపై సందడి చేసే రోజు. ప్రతి శనివారం ఆయన నామినేషన్‌లో ఉన్న కొంతమందిని సేఫ్ చేస్తాడు. కానీ ఇవాళ మాత్రం సేఫ్ చేయడానికి బదులుగా ఎవరెవరు ఫినాలేలో అడుగుపెట్టనున్నారో వెల్లడించనున్నాడు. ఇకపోతే ఇన్నివారాల జర్నీని ఒకసారి గుర్తు చేస్తూ వీల్ ఆఫ్ ద వీక్స్‌ను ప్రవేశపెట్టాడు. ఏ వారంలో అతిగా బాధపడ్డారో, ఏ వారంలో తప్పులు చేశామని ఫీలయ్యారో వాటిని కంటెస్టెంట్లు చెప్పుకొచ్చారు. మొదటిసారి సన్నీ ఏడవడంచూసి తాను మొట్టమొదటిసారిగా ఎమోషనల్ అయ్యానన్నాడు మానస్.
గడిచిన సమయం మళ్లీ వస్తే అలా చేసుకోనని ఫిక్స్ అయ్యానంటూ తను బాధపడిన సంఘటన గురించి చెప్పుకొచ్చింది సిరి. హిట్ స్టార్ ఎవరు? ఫ్లాప్ స్టార్ ఎవరు? అన్న గేమ్ ఆడించగా అందులో కాజల్.. షణ్నుకు ఫ్లాప్ స్టార్ అన్న బిరుదిచ్చింది. దీంతో నాగ్ కాజల్ మీద సెటైర్లు వేశాడు. సన్నీ, సిరి ఒకరికొకరు ఫ్లాప్ ట్యాగిచ్చుకున్నారు. మరి శ్రీరామచంద్ర తర్వాత ఇంకా ఎవరెవరు ఫినాలేకు వెళ్లబోతున్నారనే సస్పెన్స్‌కు నేడు తెర దించనున్నట్లు కనిపిస్తోంది. ఎవరెవరు టాప్ 5లో ఉంటారనేది తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment