
VJ Sunny Comments On Shannu Siri Relationship: బిగ్‌బాస్ షో సిరి, షణ్ముఖ్‌ను బాగా దగ్గర చేసింది. ఎవరేమనుకున్నా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని కుండ బద్ధలు కొట్టేశాడు షణ్ను. అదే సమయంలో సిరి వల్లే తను ఓడిపోయానని కూడా వెల్లడించాడు. ఇక షణ్ముఖ్ ఆల్‌రెడీ దీప్తి సునయనతో పీకల్లోతు ప్రేమలో ఉండగా.. సిరికి శ్రీహాన్‌తో నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ వీరిద్దరూ ఆ విషయం మర్చిపోయి బిగ్‌బాస్ హౌస్‌లో ఒకరికొకరు హగ్గులిచ్చుకుంటూ, ముద్దులు పెట్టుకున్నారు. ఇది చాలామందికి మింగుడుపడలేదు. స్నేహం పేరుతో వీళ్లు అతిగా ప్రవర్తించారన్న విమర్శలు వచ్చాయి. అయితే సిరి తల్లి హౌస్‌లోకి వచ్చినప్పుడు సన్నీ వాళ్ల కోసం స్టాండ్ తీసుకున్నాడు. మానస్‌ది తనది ఎలాంటి ఫ్రెండ్‌షిప్పో.. సిరి, షణ్నులది కూడా అలాంటి స్నేహమేనని మద్దతుగా మాట్లాడాడు.
తాజాగా సిరి- షణ్ముఖ్‌ల బంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సన్నీ. 'సిరికి ఒక మాట చెప్పాలనుకున్నాను. దోస్తాన్ దోస్తానే కానీ బయట నిన్ను నమ్ముకుని ఒక మనిషి(శ్రీహాన్) ఉన్నాడు. పాపం అతడు ఫీల్ అవుతాడు కదా అని చాలాసార్లు చెప్పాలనిపించింది. కానీ ఇది నేరుగా చెప్దాం అనుకున్నా వాళ్లు తీసుకోరు అనిపించింది. ఎందుకంటే వాళ్లను మాట్లాడిద్దాం అని వెళ్లినప్పుడల్లా.. మాకు కొంచెం సమయం కావాలి. ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు అంటారు. కనెక్షనే లేనప్పుడు ఇంకేం చెప్తాం' అని చెప్పుకొచ్చాడు సన్నీ.
Comments
Please login to add a commentAdd a comment